Tuesday, December 22, 2020

🌱 ఆయుర్వేదం - శతావరి


ఆయుర్వేదవైద్యంలో పేర్కొన్న పురాతనమైన మూలికలలో ‘శతావరి’ ఒకటి. శతావరి గురించిన ప్రస్తావనలు భారతదేశపు అత్యంత పురాతన వైద్య గ్రంధాలలో కనిపిస్తాయి. “చరక సంహిత” మరియు “అష్టాంగ హృదయ్యం” అనే వైద్యగంథాలు రెండింటిలోను శతావరిని "ఆడ టానిక్" (female tonic) గా పిలవడం జరిగింది. కాబట్టి శతావరి ఓ బలవర్ధకౌషధం అన్నమాట.   నిజానికి, శతావరి అనే మాటకున్న అర్థం మీలో కుతూహలాన్ని రేపవచ్చు. “శతావరి” అంటే “వంద భర్తలను కలిగి ఉన్నది" అని అర్థం. కనుకనే ఇది స్త్రీ పునరుత్పాదక వ్యవస్థ యొక్క మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో తిరుగులేని మూలికగా శతావరి ప్రసిద్ధి చెందింది. ఆయుర్వేదం ప్రకారం, శతావరిని "నూరు  వ్యాధుల్ని మాన్పునది" అని కూడా అంటారు.  అదనంగా, శతావరికి ఉన్న “ఒత్తిడి-వ్యతిరేకతా” (అడాప్తోజేనిక్) గుణం మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఒత్తిడి-సంబంధిత సమస్యలకు పరిణామకారి ఔషధీ. ఇది ముసలి వయస్సు-సంబంధిత వ్యాధులకు కూడా ఉపశమనకారిగా పని చేసే చాలా ప్రభావవంతమైన మూలిక. శతావరి మూలికకున్న ప్రాముఖ్యం అంతటిది కాబట్టే ఆయుర్వేదవైద్యం దీనిని "మూలికల రాణి" (queen of herbs)  గా పిలుస్తోంది. హిమాలయపర్వతాల్లో మరియు ఆ పర్వత పాదప్రాంతాల్లో పెరుగుతున్న అడవిమొక్కలలో కనిపించేదే “శతావరి” అనే మూలిక. 



☆ శతావరి గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలు: 

ఔషధీశాస్త్ర నామం (బొటానికల్ పేరు): అస్పరాగస్ రసిమోసస్

కుటుంబం: లిలియాసియా / ఆస్పరాగసేయే

సాధారణ పేరు: శతావరి, ఆస్పరాగస్ రూట్, ఇండియన్ ఆస్పరాగస్

సంస్కృతం పేరు: శతావరి, శట్ములి/శతములి

ఉపయోగించే భాగాలు: వేర్లు మరియు ఆకులు

స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక పంపిణీ: భారత ఉపఖండంలోని ఉష్ణమండల ప్రాంతాలు శతావరికి నిలయంగా ఉన్నాయి, కానీ ఇది భారతదేశ హిమాలయ ప్రాంతాలలో కూడా విస్తారంగా పెరుగుతుంది. శతావరి శ్రీలంక మరియు నేపాల్ ప్రాంతాల్లో కూడా కనిపిస్తుంది.

శక్తిశాస్త్రం: శరీరానికి శీతలీకరణాన్ని మరియు తేమను కల్గించే గుణం శతావరికి ఉంది. ఆయుర్వేదంలో శతావరి గురించి ప్రస్తావించి, వాత, పిత్త దోషాలను సమతుల్యం చేస్తుందని చెప్పారు.


శతావరి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు : - 



• మహిళలకు శతావరి ప్రయోజనాలు :

మహిళల ఆరోగ్య కోసం ఒక విజేతలాగా పని చేసే మందు అంటే అది శతావరి మాత్రమే. శతావరి సేవనం మహిళల్లో అధిక లైంగిక శక్తిని పెంచడమే కాక వారి గర్భాశయం సమగ్ర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆడవారి శరీరంలో హార్మోన్లను సమతుల్యం చేయడానికి మరియు మహిళల సంతానోత్పత్తిని శతావరి మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, శతావరి కారణంగా మహిళల్లో హార్మోన్ల సమతుల్య వ్యవస్థ ఏర్పడడం వల్ల వారికి పొత్తి కడుపులో వచ్చే నొప్పి లేక తిమ్మిరి కూడా తక్కువై నొప్పి లేని ఋతుచక్రం వారి సొంతమవుతుంది.

• పురుషులకు శతావరి ప్రయోజనాలు :

ఆడవారికి బాగా ఉపయోగపడే  సుప్రసిద్ధ మూలికలలో శతావరి ఒకటి. కానీ ఈ మూలిక  సామర్థ్యం కేవలం ఒక్క ఆడవారికి మాత్రమే పరిమితం కాదు. శతావరి నుండి తీసిన జల-మద్యపాన (hydro-alcoholic) మరియు నీటి సారం పురుషులక్కూడా ఒక కామోద్దీపనంగా చాలా సమర్థవంతంగా పని చేస్తుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఆయుర్వేదంలో చెప్పిన ప్రకారం, ఏ మూలికయినా లేదా మరేదైనా మందైనా సరే స్త్రీ పురుషుల లైంగిక పనితీరును మరియు లైంగికశక్తిని (లిబిడో) మెరుగుపర్చడానికి ఉపయోగించినట్లైనా దాన్ని కామోద్దీపకమైన మందు లేకా వీర్యవృద్ధికర మందు అని అంటారు. 

• బాలింత తల్లులకు శతావరి ప్రయోజనాలు :

ఆయుర్వేదలో, శతావరిని చనుబాలసంవర్ధిని (galactagogue)గా  పిలుస్తారు, అంటే స్తన్యపానమిచ్చే తల్లులలో (బాలింతల్లో) చనుబాల ఉత్పత్తిని శతావరి  పెంచుతుందని మరియు ఆయుర్వేద వైద్యులు బాలింతలైన ఆడవారిలో చను పాలు ఎక్కువగా వృద్ధి కావడానికి శతావరిని సేవించమని సూచించారు. బాలింత స్త్రీలకు ఈ మూలికను సేవించేందుకు ఇచ్చేటందుకు ముందుగా మీ ఆయుర్వేద డాక్టర్తో సంప్రదించడం మంచిది.

• ఒత్తిడిని తగ్గించేందుకు శతావరి :

ఒత్తిడిని తగ్గించే ప్రసిద్ధ మందులలో శతావరి కూడా ఒకటని ఆయుర్వేదం ఉటంకించింది. అంటే, శతావరిలో ఒత్తిడికి వ్యతిరేకంగా పని చేసే బలవర్ధక లక్షణాలున్నాయన్నమాట. శతావరిని సేవించడం మూలంగా మెదడుకు గల మార్గంపై ఇది ప్రభావవంతంగా పనిజేసి శరీరంలోని ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్లను తగ్గిస్తుందని తద్వారా ఒత్తిడి లేని ప్రశాంతమైన మనసు ఏర్పడుతుందని ఇటీవలి పరిశోధనలు సూచిస్తున్నాయి. 

• అనామ్లజనిగా శతావరి :

శరీరంలో స్వేచ్ఛా రాశులు కల్గించే హానికి వ్యతిరేకంగా పని చేసి మన శరీర ఆరోగ్యానికి దోహదపడే సహజ రక్షణ వ్యవస్థే అనామ్లజనకాలు. ఈ “స్వేచ్ఛా రాశులు” అంటే ఏమిటబ్బా అని మీరు ఆశ్చర్యపోతున్నారా, రోజువారీ పనుల ద్వారా శరీరంలో ఏర్పడే కణాలు లేదా అణువులే స్వేచ్ఛా రాశులు. కానీ, చివరికి, ఈ స్వేచ్ఛా రాశులే శరీరం యొక్క సొంత కణాలనే చంపడం ద్వారా శరీరానికి విషపూరితం అవుతుంటాయి. ఈ స్వేచ్ఛా రాశులు పెద్ద సంఖ్యలో శరీరంలో గుమిగూడుకుపోవడాన్నే “ఆక్సీకరణ ఒత్తిడి”గా పిలువబడుతుంది. ఈ ఆక్సీకరణే బలహీనమైన శరీర విధులకు  మరియు అకాల వృద్ధాప్యానికి ప్రధాన కారణం. మీ శరీరం నుండి అన్ని హానికరమైన స్వేచ్ఛా రాశులను తొలగించేందుకు సహాయపడే మూడు అతి శక్తివంతమైన అనామలీజనకాలు- రసమూఫరాన్, అస్పార్గామిన్, రేసిమోసోల్ లను శతావరి కలిగి ఉందని అధ్యయనాలు పేర్కొన్నాయి. కాబట్టి మీ ఆహారంలో శతావరిని ఓ భాగంగా తీసుకుంటే మీ శరీరంలో కలిగే జీవక్రియాహానిని అరికట్టి ఆరోగ్యవంతమైన జీవక్రియకు ఈ మూలిక సహాయపడుతుంది.

• కడుపులో పుండ్లకు శతావరి :

మన కడుపు చాలా సన్నని రక్షిత పొరను కలిగి ఉంటుంది. ఇది శరీరంలో ఉత్పత్తి చేయబడిన హానికరమైన జీర్ణ ఆమ్లాల ప్రభావాల నుండి మనల్ని రక్షిస్తుంది. ఈ ఆమ్లాలు మనం తీసుకునే ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడంలో మరియు కడుపులో బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గించటానికి సహాయపడి పొట్టను ఆరోగ్యాంగా ఉంచుతాయి. అయితే కొందరు అధికంగా తీసుకునే మసాలాలు దట్టించిన ఆహారపదార్థాలు లేదా వారి జీవనశైలి అలవాట్ల కారణంగా మన పొట్టలో ఈ ఆమ్లాలు అధికంగా ఉత్పత్తి అయ్యేందుకు దారి తీయవచ్చు. జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే అధిక ఆమ్లాల ప్రభావాల నుండి కడుపు తనను తానూ రక్షించుకోలేకపోయినప్పుడు ఆ ఆమ్లాలు కడుపు లోపలి భాగాలను కాల్చడానికి (బర్న్ చేయటానికి) మొదలు పెడతాయి. తద్వారా కడుపులో పుండ్లు (లేక కడుపులో పూత/పేగుపూత అని కూడా అంటారు దీన్ని) ఏర్పడటానికి దారితీస్తుంది. “పెప్టిక్ పుండు” (peptic ulcer) అనేది వైద్య పదం. అంటే ఈ పెప్టిక్ పుండ్లు కడుపులో అధిక ఆమ్లాల ఉత్పత్తి కారణంగా ఏర్పడతాయి. కడుపులో పుండ్లకు చికిత్సగా శతావరి చూర్ణం చక్కగా పని చేసినట్లు అధ్యయనకారులు కనుగొన్నారు. కానీ, మీరు కూడా ఈ మూలికను సేవించి దాని సంపూర్ణ ఫలితాల్ని పొందడానికి ముందుగా మీ ఆయుర్వేద డాక్టర్ను సంప్రదించడం మంచిది.



• సూక్ష్మజీవనాశినిగా శతావరి ప్రయోజనాలు :

శతావరి యొక్క సూక్ష్మజీవనాశక (antimicrobial) తత్వాలను పరీక్షించేందుకు పలు అధ్యయనాలు నిర్వహించారు. మన పొట్టలో జనించే హానికారక సూక్ష్మజీవులైన ఈ-కోలి, బాసిల్లస్ సబ్లిటిస్, స్టాఫిలోకాకస్, సాల్మోనెల్లా మరియు సూడోమోనాస్ మరియు క్యాండిడా వంటి ఫంగస్ బ్యాక్టీరియాల విరుద్ధంగా శతావరి సూక్ష్మక్రిమినాశినిగా ప్రభావవంతంగా పని చేసిందని అధ్యయనాలు చెప్పాయి.అందువల్ల, చాలా మటుకు సూక్ష్మక్రిమికారక వ్యాధులు మరియు శిలీంధ్ర వ్యాధులకు చికిత్స చేయడానికి శతావరి వేర్లను సురక్షితంగా ఉపయోగించవచ్చు. 

• కీళ్లవాపుల నొప్పినివారిణిగా శతావరి : 

స్వేచ్చా రాశులు కల్గించే హాని మరియు ఆక్సీకరణ ఒత్తిడి అనేవి కీళ్ళనొప్పులకు కారకమయ్యే ముఖ్య కారణాల్లో ఒకటి. శతావరి ఓ అనామ్లజనిగా శరీరంలో స్వేచ్ఛా రాశుల్ని పూర్తిగా తొలగించేందుకు సహాయపడుతుంది, తద్వారా, ఆక్సీకరణ ఒత్తిడి తగ్గి, ముఖ్యంగా యువకులలో, కీళ్ళనొప్పులు వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అదనంగా, అధ్యయనాలు చాటుతున్నదేమంటే శతావరి ఓ చక్కటి నొప్పి నిరోధకంగా పని చేయడం మూలంగా ఇది కీళ్ళలో వచ్చే వాపు మరియు కీళ్ళ నొప్పులకు విరుగుడుగా పని చేస్తుంది.

• అతిసారం చికిత్సకు శతావరి :

ఆయుర్వేద వైద్యులు అతిసారం చికిత్సలో శతావరిని వాడుతూనే ఉన్నారు, కానీ ఈ మూలిక యొక్క సామర్ధ్యాన్ని పరీక్షించడానికి శాస్త్రవేత్తలు పరీక్షలు చేశారు. అత్యంత సాధారణ ఆరోగ్య సమస్య అయిన అతిసార చికిత్సలో శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనపరీక్షల ఫలితాలు ఆయుర్వేద వాదనలు ఖచ్చితమైనవేనని గుర్తించబడ్డాయి. అయితే, మానవుడికొచ్చే అతిసారం మరియు విరేచనాలను చికిత్స చేయడంలో శతావరి మోతాదు మరియు చర్యలను పరీక్షించే నిమిత్తమై అధ్యయనాలు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి. 

• మూత్రవిసర్జనకారిగా శతావరి :

శరీరంలోంచి తరచుగా సాధ్యమైనంతగా నీటిని విడుదల చేసేందుకు దోహదపడే మూలిక లేదా మందును “మూత్రకారకం” (diuretic) గా పేర్కొనవచ్చు. సహజసిద్ధంగా నిర్విషీకరణ ఏజెంట్ గా మరియు మూత్రవర్ధకంగా పనిజేసే మందుకోసం చూస్తున్నట్లయితే శతావరి ఈ విషయంలో మీకెంతో తోడ్పడుతుంది.   శరీరంలో ఉండే అధిక నీటిని, ఇతర విషపదార్థాలను బయటికి విడుదల చేస్తుంది, తద్వారా శరీరం ఆరోగ్యాంగా తయారవుతుంది. అంతేకాకుండా, అదనపు లవణాలు మరియు నీటిని బయటకు పంపేయడం ద్వారా శతావరి మూత్రపిండాలను శుభ్రం చేస్తుంది. 

• జుట్టు మరియు నెత్తిచర్మారోగ్యానికి శతావరి :

శతావరి వేర్ల నుండి తీసిన ఎథనోలిక్ పదార్ధాలు సాధారణమైన చర్మసంబంధమైన శిలీంధ్రాలకు వ్యతిరేకంగా పని చేసే ఒక అద్భుతమైన “యాంటీబయాటిక్” మందు అని చెప్పవచ్చు. చుండ్రు మరియు “సెబోరెయిక్ డెర్మటైటిస్స్” (తామర మరియు సోరియాసిస్ వంటి చర్మం-డంబంధమైన దురదలన్నిటి చర్మసమస్య.) చర్మ వ్యాధి చికిత్సలో శతావరి చాలా ప్రభావకారిగా ఉంటుంది. ఆయుర్వేదలో సూచించిన మేరకు శతావరి నొప్పిని, వాపుల్ని హరించే మందుగా దీర్ఘకాలంగా పిలవబడుతోంది, అనగా మీరు చర్మం-సంబంధమైన దద్దుర్లు, విపరీతమైన దురదతో, దానికితోడు తలమీది చర్మం మీద వచ్చే సాంక్రామిక దద్దుర్లు మరియు చిన్న కురుపుల బాధ నుండి ఉపశమనం పొందటానికి శతావరి బాగా పని చేస్తుంది. 

• చెక్కెర వ్యాధికి శతావరి ప్రయోజనాలు :

శతావరి వేర్లు చక్కెరవ్యాధికి పనిచేసే ఒక అద్భుతమైన “యాంటీ-డయాబెటిక్ ఏజెంట్”. ఇది శరీరం యొక్క ఇన్సులిన్ పరిమాణాన్ని పెంచుతుంది. తద్వారా, శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలను క్రమంగా తగ్గిస్తూ రోగికి సహాయం చేస్తుందీ మూలిక. 

• రోగనిరోధకతను పెంచే శతావరి :

ప్రకృతిలో సహజంగా లభించే పదార్థాలతో చేసే సంపూర్ణ చికిత్స మీ శరీరంలో దాపురించే ద్వితీయ సంక్రమణాల్ని నయం చేయడమే గాక మీ రోగనిరోధక వ్యవస్థను మరింత బలపరచి, అటుపై ఏ ఇతర ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు సహాయపడుతుంది. ద్వితీయ అంటురోగాలైన  కాండిడా మరియు స్టెఫిలోకోకస్ లను నయం చేసే ఒక అద్భుతమైన ఏజెంట్ శతావరి, అని అధ్యయనాలు సూచిస్తున్నాయి. శతావరిని మందుగా సేవించడం వల్ల మన శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థను మరింత ప్రభావితం చేస్తుంది. తద్వారా శరీరంలో మరిన్ని ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయడానికి శతావరి తోడ్పడి సంక్రమణవ్యాధుల్ని మరింత సమర్థవంతంగా చంపుతుందని అధ్యయనకారులు సూచించారు.

• దోమకారక వ్యాధులను నివారించడంలో శతావరి శక్తి :

భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో వ్యాధులు ప్రబలి, తత్ఫలితంగా సంభవించే మరణాలకు గల సాధారణ కారణాలలో దోమల వలన కలిగే వ్యాధులు ఒకటి. శతావరి వేర్ల నుండి తీసిన మిథనాల్ సారం దోమల్ని, వాటి  లార్వా, గుడ్లను సైతం అద్భుతంగా చంపేస్తాయి. అంటే డెంగ్యూ, మలేరియా మరియు చికున్ గున్యా వంటి వ్యాధులను నివారించడానికి ఈ శతావరి వేర్ల నుండి తీసిన ఇథనాల్ సారాన్ని ఉపయోగించుకోవచ్చు. పైగా ఇది పర్యావరణహిత కీటకనాశిని. శతావరి మూలికను దోమలనివారణకు అనువైనదిగా అభివృద్ధి చేయబడుతోంది కనుక ఇది విస్తృతమైన పరిధిలో పనిచేస్తుంది, కనుక శతావరి వేర్ల సారం యొక్క చర్యకు వ్యతిరేకంగా మరో నిరోధకతను పొందడం కష్టం.


శతావరి మోతాదు : - 



రోజులో రెండు సార్లు శతావరి చూర్ణాన్ని ఓ టీస్పూన్ మోతాదులో టీ మాదిరిగా సేవించవచ్చు. ఈమేరకు ఆయుర్వేద వైద్యులు సూచించారు. సంతానోత్పత్తి సమస్యలున్నవారు గర్భం దాల్చడానికి కొన్ని నెలల ముందుగానే శతావరి సేవనాన్ని ఓ క్రమపద్ధతిలో మొదలుపెట్టడం మంచిది. ఇలా చేయడం వల్ల ఇది మీ సంతానోత్పత్తిశక్తిని పెంచడమీ గాక గర్భందాల్చడానికి మీ గర్భాశయం యొక్క పరిస్థితులను మెరుగుపరుస్తుంది. కనుక గర్భం దాల్చేందుకు కొన్ని నెలలు ముందే ఈ మూలికను సేవించడం గర్భధారణకు మరింత అనుకూలంగా ఉంటుంది. ఆడవాళ్లు 2 టీస్పూన్ల శతావరి చూర్ణాన్ని పాలతోబాటు తీసుకోవచ్చని ఆయుర్వేద వైద్యులు సూచించారు. ఇది స్త్రీలలో గర్భధారణకు అనుకూలించడమే గాక వారిలో లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని సూచించారు.


శతావరి దుష్ప్రభావాలు : - 

• గర్భధారణ సమయంలో శతావరిని సేవించడం సురక్షితం కాదు, కాబట్టి, గర్భిణీ స్త్రీలు శతావరిని సేవించేందుకు ముందుగా వైద్యుడిని తప్పకుండా సంప్రదించితీరాలి. 

• శతావరి కుటుంబానికి చెందిన మూలికలు ఎవరి శరీరానికి పడవో అలాంటివారికి శతావరి కూడా పడకుండా పోవచ్చు, అలెర్జీకారకంగా తయారవచ్చు. 

• ఒకవేళ మీరు ఇప్పటికే ఏవైనా డాక్టర్ సూచించిన ఔషధాలను తీసుకుంటున్న యెడల, శతావరిని కూడా ఆ మందులతో పాటు సేవించాలని మీరనుకుంటుంటే నిపుణుడైన వైద్యుడ్ని సంప్రదించడం చాలా మంచిది.



x

No comments:

Post a Comment

🌱 ఆయుర్వేదం - శతావరి

ఆయుర్వేదవైద్యం లో పేర్కొన్న పురాతనమైన మూలికలలో ‘ శతావరి ’ ఒకటి. శతావరి గురించిన ప్రస్తావనలు భారతదేశపు అత్యంత పురాతన వైద్య గ్రంధా...