Saturday, September 26, 2020

🌱 ఆయుర్వేదం - తిప్పతీగ (Giloy)



సంస్కృతంలో తిప్పతీగ "అమృత" అని పిలవబడుతుంది  అంటే "చావు లేకుండా చేసేది " అని అర్ధం. ఈ మూలికల యొక్క అద్భుతమైన ప్రభావాలను చుస్తే, తిప్పతీగను నిజంగా అమృతం తో సమానమైనది అని చెప్పవచ్చు. ఎందుకంటే అమృతం దేవతలను ఎల్లపుడు యవ్వనంగా మరియు ఆరోగ్యగా ఉంచుతుంది. 


తిప్పతీగను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీన్ని గిలోయ్ (టినోస్పోరా కార్డిఫోలియా) అంటారు. మనదేశంలో ఆయుర్వేదానికి సంబంధించిన చాలా మందులకు తిప్ప తీగను ఉయోగిస్తారు.తిప్పతీగతో పాటు దాన్ని కాండాన్ని ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. ఎఫ్ డీఏ (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) కూడా తిప్పతీగను ధ్రువీకరించింది.తిప్పతీగ యొక్క ఔషధ ప్రయోజనాలు చాలా వరకు దాని కాండం లోనే ఉంటాయి, కానీ ఆకులు, పండ్లు, మరియు వేర్లను కూడా కొంత మేరకు ఉపయోగిస్తారు. తిప్పతీగను ఉపయోగించి జ్యూస్, పౌడర్, కాప్సూల్స్ తయారు చేస్తారు. ఇవన్నీ కూడా కొన్ని రకాల వ్యాధులను నయం చేయడానికి బాగా ఉపయోగపడతాయి.




* తిప్ప తీగ పౌడర్ (తిప్ప సత్తు) :




* తిప్పతీగ  ప్రయోజనాలు : 



• రోగనిరోధక శక్తి పెరుగుతుంది:

తిప్పతీగతో తయారు చేసిన మందులను, పదార్థాలను తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తిప్పతీగలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడగలవు. అలాగే మీ శరరీంలోని కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు తిప్పతీగ బాగా పని చేస్తుంది.


• బ్యాక్టీరియాతో పోరాడ గల గుణాలు:

రక్తాన్ని శుభ్రపరిచే గుణాలు తిప్పతీగలో ఉంటాయి. పలు రకాల వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడగల గుణాలు తిప్పతీగలో ఉంటాయి. కాలేయ సంబంధిత వ్యాధుల బారిన పకుండా చేయగలదు. కొందరు ప్రత్యేక నిపుణులు తిప్పతీగతో హృదయ సంబంధిత వ్యాధుల బారినపడకుండా మందులు తయారు చేస్తారు.


• కొన్ని రకాల విష జ్వరాలను నివారించగలదు :

సీజనల్ వ్యాధులు విష జ్వరాలైన డెంగ్యూ, స్వైన్ ఫ్లూ మలేరియా వంటి వాటిని పూర్తిగా నివారించగల శక్తి తిప్పతీగకు ఉంటుంది.


• జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది : 

అజీర్తి సమస్యతో బాధపడుతున్న వారు తిప్పతీగతో తయారు చేసిన మందుల్ని వాడితే మంచిది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచేగల శక్తి తిప్పతీగకు ఉంటుంది. కాస్త తిప్పతీగ పొడిని కాస్త బెల్లంలో కలుపుకుని తింటే చాలు అజీర్తి సమస్య పోతుంది.


• మధుమేహానికి బాగా ఉపయోగపడుతుంది : 

తిప్పతీగ హైపోగ్లైకేమిక్ ఏజెంట్ గా పని చేస్తుంది. తిప్పతీగలో మధుమేహాన్ని నివారించే గుణాలున్నాయి. ముఖ్యంగా టైప్ 2 మధుమేహం తగ్గేందుకు ఇది ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించగలదు.


• ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది : 

మీరు నిత్యం ఒత్తిడి, ఆందోళనతో ఇబ్బందిపడుతుంటే తిప్పతీగతో తయారు చేసిన మందుల్ని ఉపయోగించడం మంచిది. ఇది మీ మానసిక ఒత్తిడిని, ఆందోళన తగ్గించగలదు. మీ జ్ఞాపకశక్తి పెంచగలదు.


• శ్వాస సంబంధిత సమస్యల్ని పోగొడుతుంది : 

తిప్పతీగలో యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారికి తిప్పతీగ మందులు బాగా పని చేస్తాయి. దగ్గు, జబలుబు, టాన్సిల్స్ వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించగల గుణాలు తిప్పతీగలో ఉన్నాయి.



• ఆర్థరైటిస్ : 

ఆర్థరైటిస్ తో బాధపడేవారు తిప్పతీగను ఉపయోగిస్తే చాలా మంచిది. కీళ్లవ్యాధులను తగ్గించే గుణాలు తిప్పతీగలో చాలా ఉన్నాయి. తిప్పతీగ పొడిని కాస్త వేడి పాలలో కలుపుకుని తాగితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యల బారి నుంచి బయటపడొచ్చు. ఆ పాలలో కాస్త అల్లం కలుపుకుని కూడా తాగొచ్చు.


• కంటిచూపును మెరుగుపరుస్తుంది : 

కంటిచూపును మెరుగుపరిచే గుణాలు తిప్పతీగలో ఉన్నాయి. తిప్పతీగ పొడిని చల్లటి నీళ్లలో కలుపుకోండి. ఆ నీటిని ఐలిడ్స్ పై పోసుకోండి. ఇలా చేయడం వల్ల కంటిచూపు మెరుగవుతుంది.


• వృద్ధాప్య ఛాయలు రాకుండా చేయగలదు : 

తిప్పతీగ వృద్ధాప్య ఛాయలు రాకుండా చేయగలదు. అలాగే ముఖంపై మచ్చలు, మొటిమలు రాకుండా, ముడతలు ఏర్పడకుండా చేయగల ప్రత్యేక గుణాలు తిప్పతీగలో ఉంటాయి.


• మహిళలకు తిప్పతీగ : 

దాని రోగనిరోధక-పెంచే లక్షణాల కారణంగా, ఋతుక్రమం ఆగిపోయిన మహిళలకు తిప్పతీగ ఒక గొప్ప ఉపయోగకరమైన మూలిక. దీని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు  బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.


• పురుషుల కోసం తిప్పతీగ:

తిప్పతీగ యొక్క ఉపయోగం లైంగిక పనితీరును మెరుగుపరుస్తుంది మరియు పురుషులలో లైంగిక కోరికను పెంచుతుంది.


• క్యాన్సర్కు తిప్పతీగ:

కొన్ని అధ్యయనాలు దాని యాంటీఆక్సిడెంట్ లక్షణాల వల్ల క్యాన్సర్ చికిత్సలో తిప్పతీగ వాడకాన్ని ప్రతిపాదించారు.


• బరువు తగ్గడానికి తిప్పతీగ:

తిప్పతీగ హైపోలిపిడెమిక్ చర్యలను కలిగి ఉంటుంది దీనిని  క్రమముగా వినియోగిస్తే బరువు తగ్గుదలలో అద్భుతముగా పనిచేస్తుంది. ఇది జీర్ణాశయ  ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు కాలేయాన్ని రక్షిస్తుంది.


* తిప్పతీగ దుష్ప్రభావాలు : -


1. తిప్పతీగ ఒక సమర్థవంతమైన హైపోగ్లైసిమిక్ ఏజెంట్ (రక్త చక్కెర తగ్గింపు), కాబట్టి మీరు ఔషధాలు వాడుతున్న డయాబెటిక్ వ్యక్తి అయితే, ఏ రూపంలో ఐన తిప్పతీగను తీసుకోవటానికి ముందు మీ వైద్యుడిని తనిఖీ చేయడమే మంచిది.

2. గర్భం ధరించినా లేదా చనుబాలిచ్చు సమయంలో తిప్పతీగ యొక్క సంభావ్య ప్రభావాలు గురించి ఎటువంటి ఆధారాలు లేవు. కాబట్టి గర్భిణీ మరియు చనుబాలిచ్చు స్త్రీలు ఏ రూపంలోనూతిప్పతీగను ఉపయోగించటానికి ముందు వారి ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించాలి

3. తిప్పతీగ మీ రోగనిరోధక వ్యవస్థను మరింత చురుకుగా పనిచేయటానికి ఉద్దీపన చేయగల ఒక అద్భుతమైన రోగనిరోధక సూత్రం. కాబట్టి, మీరు ఆటోఇమ్యూన్(autoimmune) వ్యాధితో బాధపడుతున్నట్లయితే, తిప్పతీగను తీసుకునే ముందు తీసుకోవాలా లేదా అని మీ వైద్యుడిని అడగండి.



No comments:

Post a Comment

🌱 ఆయుర్వేదం - శతావరి

ఆయుర్వేదవైద్యం లో పేర్కొన్న పురాతనమైన మూలికలలో ‘ శతావరి ’ ఒకటి. శతావరి గురించిన ప్రస్తావనలు భారతదేశపు అత్యంత పురాతన వైద్య గ్రంధా...