గుగ్గులు (గుగ్గిలం) , ఒక రకమైన ఔషధ మొక్క.ఇది బర్సెరసి కుటుంబానికి చెందింది.దీని నుండి లభించే జిగురు వంటి ద్రవాన్ని గుగ్గులు(గుగ్గిలం) గా ఉపయోగిస్తారు.గుగ్గులు ఒక రకమైన పూలు పూసే ఔషధ మొక్క.దీని శాస్త్రీయనామం కొమ్మిఫోరా వైటై (Kommiphora wightii).బర్సెరేసియే కుటుంబంలో ఎన్నోజాతులు ఉన్నాయి.ఒక్క కొమ్మిఫొరా వైటై (గుగ్గిలం) తప్ప మిగతా జాతులు విషపదార్ధాలు కలిగిఉన్నందున బహు కొద్దిమాత్రమే వాడుకలో ఉన్నవి. సుమారు 3,000 సంవత్సరాలనుండి ఆయుర్వేద మందులలో ఈ గుగ్గుల్ వాడబడుతూ ఉంది.ఇందులో మందుగా వాడబడేది " గుగుల్-స్టెరోన్ (గుగులిపిడ్ ) అనే రసాయన పదార్ధం. శరీరములో కొలెస్టిరాల్ ను తగ్గించే గుణం, కాలేయం కొలెస్టిరాల్ ను తయారీని ఆపుచేసే గుణం దీనికి ఉందని శాస్త్రీయంగా కనుగొనబడింది. ఇది శరీరంలో ఫర్నెసోయిడ్ X రెసెప్టార్లను మూసివేయడం వలన కొలెస్టిరాల్ తగ్గుతుందని అంటారు. ఎఫ్.ఎక్ష్.ఆర్. కాలేయంలో బైల్ సాల్ట్స్ ను అదుపుచేయడం ద్వారా తన పనిచేస్తుందని శాస్త్రజ్ఞులు అంటారు . ఎల్.డి.ఎల్. (చెడ్డ ) కొలెస్టెరాల్ ను ఎక్కువ చేసే గుణం ఉన్నట్లు ఆయుర్వేదంలో చెప్పబడి ఉంది . గుగ్గుల్ వ్యాపార రీత్యా పండిస్తారు. మంచి వాసనగల ఈ జిగురును ఎండిన తరువాత ధూపం గాను, అగరుబత్తీలు తయారీలోనూ వాడతారు.
సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఇంటి నుంచి తొలగిపోతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. గుగ్గిలంతో ప్రతిరోజూ సాంబ్రాణి ధూపాన్ని దేవతలకు సమర్పించాలని.. తద్వారా పలురకాలైన సత్ఫలితాలను పొందవచ్చు.
తిప్పతీగను, త్రిఫలాలను సమాన భాగాలు తీసుకొని కచ్చా పచ్చాగా దంచి నీళ్లకు కలిపి మరిగించి కషాయం తయారుచేసుకోవాలి. అర కప్పు కషాయానికి అర టీ స్పూన్ శుద్ధ గుగ్గులు కలిపి నెల రోజులపాటు తీసుకుంటే దీర్ఘకాలంనుంచీ బాధించే మెడనొప్పి తగ్గుతుంది. కీళ్ల నొప్పులకు వైద్యచికిత్సల్లో ఆయుర్వేద నిపుణులు యోగరాజ గుగ్గులు, త్రయోదశాంగ గుగ్గులు, లాక్షాది గుగ్గులు, మహావాత విధ్వంసినీ రసం వంటి మందులు ఇస్తారు. వీటిని వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాలి. యోగారాజా గుగ్గులు ఈ మందు పక్షవాతానికి పనిచేస్తుంది. కాంచనార గుగ్గులు ఈ మందులు చర్మవ్యాధులు, అంటు వ్యాధులకు, గడ్డలకు పనిచేస్తుంది. కీళ్ళ నొప్పులకు బెల్లము శుద్ధి చేసిన గుగ్గిలము, ఈ రెండు సమాన బాగాలుగా కలిపి దంచి రేగి పండంత మాత్రలు ఆరబెట్టి నిలువ చేసుకుని పూటకు ఒక మాత్ర చొప్పున 2 పూటల కొంచెం నెయ్యిలో కలిపి సేవిస్తూ వుంటే కీళ్ళ నొప్పులు చీల మండల నొప్పులు, మెడిమల నొప్పులు తగ్గిపోతాయి. గుగ్గుల్ ని అశ్వగందతో కలిపి వాడితే మధుమేహ వ్యాధికి మంచిదని ఆయుర్వేద వైద్యులు ఆంటారు . ఆయుర్వేదిక్ వైద్యులు గుగ్గిలము అనే పేరుతో వాడుతున్నారు.
* గుగ్గిలముల రకాలు :
• రత్నపురి గుగ్గిలం,
• తెల్ల గుగ్గిలం,
• పుట్టగుగ్గిలమం
• మహిసాక్షి గుగ్గిలం
ఇందులోనిని రత్నపురి గుగ్గిలం, తెల్లగుగ్గిలం, మహిసాక్షి గుగ్గిలం ఔషధోపయోగానికి వాడతారు.పుట్టగుగ్గిలం ధూపాలకు, రంగులకు ఉపయోగిస్తారు.
* మహిసాక్షి గుగ్గిలం గుణములు :
మృదువు, జిగట, సువాసన, చేదు లక్షణాలు కలిగి ఉంటుంది. లోపలికిచ్చిన రక్తం శుభ్రపరచును. చెమట పుట్టించును. మూత్ర సంభందిత వ్యాధులకు మంచి జేయును. పొట్టకు బలం జేయును. మృదువు పరచును. శరీరానికి కాంతిదెచ్చును. రక్త పైత్యం, కఫం, మేధోరోగమం, శ్లేష్మం, క్రిమి, ఉన్మాదం, మూలవ్యాధి, దుష్టవ్రణాలు, గ్రంథులు, గండమాలలు, వాతం, దుష్ట రక్తం, ప్రాతనొప్పులు, విషం వీనిని హరించును. గడ్డలను, కంతులను కరగించును. నరాల రోగాలు, గొంతుకనొప్పి, గుండెలలోని దోషాలు, అమిత నడక వలన గలిగిన కాళ్ళవాపు వీనిని పోగొట్టును. బుద్ధికి బలమిచ్చును. కడుపులోను, గుండెలోను కూడియున్న చెడురక్తాన్ని శుభ్రపరచును, శీఘ్రప్రసవం గావించును. స్త్రీల ఋతుబద్ధంను విపును. నడుము నొప్పి, కాళ్ళనొప్పి, కీళ్ళనొప్పి వీనిని హరించును; స్త్రీలకు పాలు పడజేయును. మూత్రపు సంచిలో పుట్టు రాళ్ళను. నరాల మార్గాలలో పుట్టు గట్టి పదార్థాలను తీసి వేయును. విరేచనాలు కట్టును. వేడితగ్గటానికి చేసే ఔషధాలలో గలిపిన వాడినయెడల వేడిని తగ్గించును.
ఎర్రగుగ్గిలం తేనెలో గలిపి గొంతుక వాపుకు పట్టువేసిన నయమగును. ఆవుపాలలో గుగ్గిలం గలుపుకొని పుచ్చుకొనిన పుంసత్వంనకు బలము జేయును. ఇతర రుగ్మతలకు దీని చూర్ణం వేడినీళ్ళలో గలిపి పుచ్చుకొనవచ్చును. దీని సత్తువ 20 సంవత్సరావరకు దేహమందు నిలిచియుండును.
ఉదయమున నోటవచ్చు ఉమ్మితో దీనిని అరగదీసి పైనపూసిన లేక పట్టువేసిన గడ్డలు హరించును.బుడ్డకు పూసిన అది కరిగిపోవును. దీని పొగ పుచ్చుకొనినను, దీని పొగ బట్టినను మూలవ్యాధి నయమగును. దీని పొగ దుర్గంధపుగాలికి, అంటు విషపు గాలియొక్క దోషమును పోగొట్టును . తేలు కుట్టిన చోట దీనిని పూసిన విషం హరించును. దెబ్బ తగిలిన చోట పూసిన వాపు హరించును. పట్టు వేసిన గాయంలో కూడియుండు దుష్టరక్తాన్ని శుభ్రపరచును. గండమాలలకు, కంఠంపైన నయ్యెడు గడ్డలు మానును. దీనిని నూనెవేసి నూరుచూ, నీళ్ళతో 4-5 పర్యాయములు కడుగుచుండిన జిగురు వచ్చును. దానిని దళసరిగుడ్డకు వేసి పట్టువేయ వలెను. దీనిని తినిన కడుపులోని వాపుల తీసివేయును.
☆ ప్రత్యేక జాగ్రత్తలు & హెచ్చరికలు:
• గర్భం మరియు తల్లి పాలివ్వడం: గర్భధారణ సమయంలో గుగ్గిలం అసురక్షితంగా ఉంటుంది. ఇది రుతుప్రవాహాన్ని ప్రోత్సహిస్తుందని మరియు గర్భాశయాన్ని ప్రేరేపిస్తుందని అనిపిస్తుంది, కాబట్టి కొంతమంది పరిశోధకులు ఇది గర్భధారణకు అపాయం కలిగిస్తుందని ఆందోళన చెందుతున్నారు. తల్లి పాలివ్వడంలో గుగ్గిలం ఉపయోగించడం యొక్క భద్రత గురించి తగినంతగా తెలియదు. మీరు గర్భవతిగా ఉంటే లేదా తల్లి పాలివ్వడంలో గుగ్గిలం వాడకండి.
• రక్తస్రావం లోపాలు: గుగ్గిలం రక్తం గడ్డకట్టడాన్ని నెమ్మదిస్తుంది మరియు రక్తస్రావం లోపాలతో బాధపడుతున్న వారిలో రక్తస్రావం లేదా గాయాలు కావచ్చు.
• రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, ఎండోమెట్రియోసిస్ లేదా గర్భాశయ ఫైబ్రాయిడ్ల వంటి హార్మోన్-సున్నితమైన పరిస్థితి: గుగ్గిలం శరీరంలో ఈస్ట్రోజెన్ లాగా పనిచేస్తుంది. ఈస్ట్రోజెన్కు గురికావడం ద్వారా అధ్వాన్నంగా మారే ఏదైనా పరిస్థితి మీకు ఉంటే, గుగ్గిలం ను ఉపయోగించవద్దు.
No comments:
Post a Comment