ఉత్తరేణి చెట్టుని "అపామార్గ" అని పిలుస్తారు . తెలుగులో " దుచ్చెన చెట్టు " అని మరొక పేరు . ప్రతి గ్రామంలోను దొరికే మూలిక ఉత్తరేణు (ఆంగ్లం: Prickly Chaff Flower; సంస్కృతం: अपामार्ग). ఈ ఆకు ముదురు పచ్చ రంగులో ఉంటుంది. ఆకారం అస్తవ్యస్తంగా ఉంటుంది. పరిమాణం మధ్యస్థం. ఈ చెట్టు చిన్న మొక్కగా పెరుగుతుంది. ఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం అఖిరాంథస్ ఆస్పరా. ఆయుర్వేద వైద్యంలో ఈ చెట్టుకు ప్రముఖస్థానం ఉన్నది. కఫ, వాత హరముగా పని చేస్తుంది. వేడి చేస్తుంది. ఆకలిని పుట్టిస్తుంది. జీర్ణకారి. శరీరములో క్రొవ్వును కరిగిస్తుంది. ఈ చెట్టు సమూల రసం కాని కషాయం చేదుగా మరియు వెగటుగా ఉండును.
వినాయక చవితి నాడు చేసే పత్ర పూజలో దీనిని ఉపయోగిస్తారు. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు ఆరొ వది.
* ఉత్తరేణి చెట్టు విత్తులను పాలతో వండి పాయసంలా చేసుకుని తినుచున్న పరిణామ శూలని పొగొట్టును. పరిణామశూల అనగా ఆహారం తీసుకొనిన తరువాత జీర్ణం అయ్యే సమయంలో కలుగు నొప్పి.
* ఈ చెట్టు సమూలం తీసికొనివచ్చి నీడలో ఎండించి భస్మం చేసి ఆ భస్మమును 3 గ్రాముల చొప్పున నీటిలో కలిపి తీసుకొనుచున్న అజీర్ణం వలన వచ్చే నొప్పి తగ్గును.
* ఉత్తరేణి చెట్టు సమూల భస్మం గంజితో కాని , శొంఠి కషాయంతో కాని ఇచ్చిన శరీరపు ఉబ్బు మరియు ఉదర రోగం నివారణ అగును.
* దీని విత్తనాలను నీళ్లతో నూరి కాని , చూర్ణం చేసి నీళ్లతో ఇచ్చిన వెర్రికుక్క విషపు సంధి (Hydrophobia ) తగ్గును. దీని పూతవెన్నులను కొద్దిగా పంచదార వేసి నూరి మాత్రలుగా చేసి వెర్రికుక్క కరిచిన వానికి ఇచ్చిన విషం హరించును పూటకు గచ్చకాయ మోతాదులో రోజుకు రెండుపూటలా 3 నుంచి 4 దినములు ఇవ్వవలెను.
* ఉత్తరేణి చెట్టు ఆకులను కాని పూత వెన్నులను నూరి తేలు కుట్టినచోట దళసరిగా పట్టించిన బాధ మరియు మంట తగ్గును. పాము కరిచిన చోట పట్టించిన దాని విషం హరించును . జెర్రీ కుట్టినచోట పట్టించిన మంట నివారణ అగును.
* ఉత్తరేణి చెట్టు సమూల భస్మం తేనెతో కలిపి ఇచ్చిన దగ్గులు , ఉబ్బసం హరించును . మోతాదు 2 గ్రాములు . రోజుకు రెండుపూటలా ఇవ్వవలెను.
* ఉత్తరేణి చెట్టు సమూల భస్మంలో హరిదళం వేసి నూరి నూనె కలిపి పూసిన వ్రణములు , పులిపిరికాయలు హరించును . * ఉత్తరేణి చెట్టు సమూల భస్మం నువ్వులనూనె లో కలిపి ఉదయం , సాయంత్రం 2 చుక్కలు చెవుల్లో వేసిన కర్ణరోగములు మానును .
* ఉత్తరేణి చెట్టు సమూల రసంలో దూది తడిపి పుప్పిపంటిలో పెట్టిన పుప్పి పన్ను వల్ల వచ్చు నొప్పి మానును .
* ఉత్తరేణి చెట్టు విత్తనాలు గాని ఆకు గాని నూరి కట్టిన శరీరం పైన లేచు గడ్డల మంట , పక్క నొప్పి ( Pleurodynia ) నివారణ అగును.
* ఉత్తరేణి ఆకుల రసం లోపలికి ఇచ్చిన సర్పవిషం హరించును . * ఉబ్బసం దగ్గుతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఉత్తరేణి చెట్టు ఎండిన ఆకులను నిప్పులపైన వేసి ఆ పొగ పీల్చిన దగ్గు, ఆయాసం తగ్గును.
* ఉత్తరేణి ఆకు నీడన ఎండించిన చూర్ణం పుచ్చుకొనిన రక్తగ్రహణి తగ్గును.
* ఉత్తరేణి చెట్టు పచ్చి ఆకులలో కొద్దిగా మిరియాలు , కొద్దిగా వెల్లుల్లిపాయలు చేర్చి నూరి గచ్చకాయ అంత సైజు మాత్రలు చేసి చలిజ్వరం రాక మునుపు ఇచ్చుచుండిన చలిజ్వరం , వరసగా వచ్చు జ్వరం నివారించును.
☆ ఔషధ ఉపయోగాలు :
1. ఉత్తరేణి ఆకుల రసం కడుపునొప్పికి, అజీర్తికి, మొలలకు, ఉడుకు గడ్డలకు, చర్మపు పొంగుకు మంచి మందుగా ఉపయోగపడుతుంది. దీని వేరులతో పళ్లు తోమితే చిగుళ్లు, పళ్లు గట్టిపడతాయి.
2. భారత దేశంలో ఎక్కువగా కనిపించే ఈ ఉత్తరేణీని గుండ్రని కాండాన్ని, అభి ముఖ ప్రత విన్యాసంతో దీర్ఘ వృత్తాకారంలో, లేదా వృత్తాకార ఆకులని కలిగి ఎరుపు, తెలుపు రంగులున్న పొడువాటి కంకులని కలిగి ఉంటుంది. ఈ మొక్కని ఆయుర్వేద మందుల తయారీకి వాడుతారు.
3. ఉత్తరేణి ఆకుల రసాన్ని గాయాలు తగిలినప్పుడు పూస్తే రక్త స్రావం కాకుండా చూస్తుంది.
4. అలాగే దురదలు, పొక్కులు, శరీరం పై పొట్టు రాలటం జరుగుతుంటే ఈ రసం శరీరానికి పట్టిస్తే ఆ వ్యాధులు తగ్గుతాయి.
5. అలాగే కందిరీగ లు, తేనెటీగలు, తేళ్లు తదితరాలు కుట్టినప్పుడు ఆయా ప్రాంతాలలో ఈ ఆకులను ముద్దగా నూరి పెడితే నొప్పి, దురద తగుతాయి.
6. ఉత్తరేణి గింజల్ని పొడిచేసి, ఉప్పు, పటిక పొడి, వంట కర్పూరం కల్పిన మిశ్రమం వాడితే పంటి నొప్పులు, చిగుళ్ల నుండి రక్తం కారటం తదితర సమస్యలు తగ్గి దంతాలు మెరుస్తుంటాయి.
7. ఈ మొక్క లని కాల్చిన తరువాత వచ్చే బూడిదకు కాస్త ఆముదం కల్పి గజ్జి, తామర, తదితరాలపై లేపనంగా పూస్తే తగ్గుతాయి.
8. అలాగే ఈ బూడిదని తేనెలో కల్పి తీసుకుంటే ఉబ్బసం, దగ్గు తదితరాలతో పాటు గుండెకు సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తులలోని శ్లేష్మం తగ్గుతాయి.
9. మజ్జిగలో కల్పి తీసుకుంటే రక్త విరేచనాలు తగ్గుతాయి. పురుషుల్లో వచ్చే పౌరుష గ్రంథి వాపు సమస్యకు ఉత్తరేణీ చూర్ణానికి ఆవునెయ్యి కల్పి తీసుకుంటే ఫలితం ఉంటుంది.
10. ఉత్తరేణీ వేళ్లను కాల్చి చూర్ణంగా చేసి, అందులో మిరియాల పొడి కల్పి రెండు పూటలా చిన్న చిన్న మాత్రలుగా చేసి తీసుకుంటే చర్మ రుగ్మతలు సమసి పోతాయి.
11. నువ్వుల నూనెలో ఉత్తరేణీ రసాన్నిపోసి బాగా మరిగించాక ఆ నూనెని ప్రతి రోజూ పొట్టపై మర్ధన చేసుకుంటే కొవ్వుకరిగి సాధారణ స్ధితికి వస్తారు.
No comments:
Post a Comment