పొడపత్రి ఒక రకమైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయనామం 'జిమ్నిమాసిల్విస్టర్'., అపోసైనేసి కుటుంబానికి చెందినది. ఇది భారతదేశంలో ప్రకృతి సిద్ధంగా అరణ్యాలలో పెరుగుతంది. దీనిని సంస్కృతంలో "మేషశృంగి" అని పిలుస్తారు. అంతే కాకుండా "పుట్టభద్ర" / "మధునాశని" అని కూడా అంటారు. జింనిమా సిల్విస్ట్రి అనేది ఒక ప్రఖ్యాతమైన మొక్క. ఈ మొక్కని గుర్మర్ అని అంటారు.గుర్మర్ అంటే హిందీ వాడుకంలో మధుమేహాన్ని చంపేది అని అర్దం.వీటి ఆకులు ధీర్ఘవృత్తాకారంలో,సన్నగా ముక్కల వలె వుంటాయి.ఆకులు మృదువుగా వుంటాయి.పువ్వులు లేత పసుపు రంగులో,గుండ్రాటి ఆకారంలో వుంటాయి.పువ్వులు ఏకనాభిలో పక్కగా ఎర్పడి వుంటాయి.ఏకనాభి యొక్క కాడ పొడుగుగా వుంటాయి. రక్షక పత్రాలు పొడుగుగా,గుండ్రంగా వుంటాయి.
పొడపత్రి తీగజాతికి చెందిన బహువార్షిక మొక్క. ఇది ప్రకృతి సిద్ధంగా అడవుల్లోనూ, పొలాల్లోనూ పెరుగు తుంది. పెరట్లోనూ దీన్ని పెంచుకోవచ్చు. పొడపత్రి పొదలు పైకి పాకి కనిపిస్తాయి. చిన్న పసుపుపచ్చని పుష్పాలు గుత్తులుగా పూస్తాయి. కాయలు 5 నుంచి 7 సెం. మీ. పొడవు కలిగి ఉంటాయి. ఒకేచోట రెండు జంటగా మేక కొమ్ముల మాదిరిగా అమరి ఉంటాయి. పొడపత్రి ఆకులు చాలా చేదుగా ఉంటాయి. నమిలిన 3-4 గంటల వరకు కూడా చేదు అలాగే ఉంటుంది. అయితే.. మధుమేహం లేని వారికి మాత్రమే చేదు రుచి తెలుస్తుంది. ఉన్నవారికి చప్పగా అనిపిస్తుంది.
పొడపత్రి మధుమేహానికి దివ్యౌషధం. ఆకులను నమలవచ్చు లేదా కషాయంగా చేసుకుని తాగొచ్చు. రోజూ పొడపత్రి కషాయం తీసుకుంటే మధుమేహులు రక్తంలో గ్లూకోస్‌ని అదుపులో ఉంచుకోవచ్చు.
ఉపయోగాలు :
• పొడపత్రి ఆకులలో జిమ్నిమిక్ ఆమ్లం ఉంటుంది. ఇది తీపి రుచిని నివారిస్తుంది.
• దీనిని మూత్ర వర్ధకంగాను, ఉత్తేజకారిగాను, జీర్ణకారిగాను, మలబద్ద నివారిణిగాను ఉపయోగిస్తారు.
• ఇది గుండెను, ప్లీహాన్ని ఉత్తేజపరుస్తుంది. దీనిని మధుమేహంలో, జ్వరం, ఉబ్బసము నివారణ కోసం వాడుతారు.
• ఈ మొక్క నుండి వొచిన సారం ప్రాచీన ఆయుర్వేద మందుగా ఇండియా,జపాన్, ఆస్ట్రేలియా దేశాలలో ఉపయోగిస్తారు.
• ఈ మొక్క యొక్క ఆకులు ద్వారా మధుమేహం అనే వ్యాధిని దూరం చేయవచ్చు.
ప్రత్యేక జాగ్రత్తలు & హెచ్చరికలు:
గర్భం మరియు తల్లి పాలివ్వడం: మీరు గర్భవతిగా ఉంటే లేదా తల్లి పాలివ్వడం వల్ల జిమ్నెమా తీసుకోవడం యొక్క భద్రత గురించి తగినంత నమ్మదగిన సమాచారం లేదు. సురక్షితమైన వైపు ఉండండి మరియు వాడకుండా ఉండండి.
డయాబెటిస్: జిమ్నెమా డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. తక్కువ రక్తంలో చక్కెర (హైపోగ్లైసీమియా) సంకేతాల కోసం చూడండి మరియు మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే మీ రక్తంలో చక్కెరను జాగ్రత్తగా పరిశీలించండి మరియు జిమ్నెమా వాడండి.
శస్త్రచికిత్స: జిమ్నెమా రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది మరియు శస్త్రచికిత్సా సమయంలో మరియు తరువాత రక్తంలో చక్కెర నియంత్రణకు ఆటంకం కలిగిస్తుంది. షెడ్యూల్ చేసిన శస్త్రచికిత్సకు కనీసం 2 వారాల ముందు జిమ్నెమా వాడటం మానేయండి.
No comments:
Post a Comment