కుంకుమ పువ్వు ఒకరకమైన ఖరీదైన సుగంధ ద్రవ్యము. ఈ భూభాగంలో అత్యంత ఆకర్ణీయమైనది, ఖరీదైనది, అద్భుత ఔషధ గుణాలు కలిగినది కుంకుమపువ్వు. ఇది క్రోకస్ సాటివస్ అనే పువ్వు నుండి వస్తుంది. ఇరిడాసే కుటుంబానికి చెందిన కుంకుమ పువ్వును ప్రధానంగా శీతలీ ప్రదేశాల్లో పండిస్తారు. కుంకుమపువ్వులో ఉపయోగపడే భాగం - ఎర్ర కేసరాలు మాత్రమే. ఆ సేతుహిమాచలమే కాదు సీమాంతర భూములు లోను, అరబిక్ ఆచరణలోను, వేదకాలపు సంసృతిలోనూ ప్రాముఖ్యమైన సౌందర్యపోషణ ద్రవ్యమిది . నాటి రాచరికకాలపు దర్పణానికి చిహ్నం ఈ కుంకుమపువ్వు . క్రీ.పూ. 500 సం. ముందే దీని ప్రస్తావం ఉన్నది . కుంకుమ పువ్వును ఇంగ్లీషులో శాఫ్రాన్ ఫ్రాన్ అంటారు. ఇది జాఫరాన్ అనే అరబిక్ పదం నుంచి వచ్చింది. అరబిక్‌లో జాఫరిన్ అంటే పసుపు అని అర్థం. కుంకుమ పువ్వు కాస్త చేదుగా, తియ్యగా, మంచి సువాసన కలిగి ఉంటుంది. అందువల్ల దీన్ని అనేక వంటకాల్లో ఉపయోగిస్తుంటారు.
కుంకుమ పువ్వు అందించే మొక్కలను ప్రత్యేకంగా పెంచుతారు. పువ్వు మధ్య ఉండే రేణువులను తీసి కుంకుమ పువ్వు తయారు చేస్తారు. ఒక కిలో కుంకుమపువ్వు తయారు చేయాలంటే కనీసం రెండులక్షల పూలు అవసరమవుతాయి. అందుకే వీటి ధర చాలా అధికంగా ఉంటుంది. కుంకుమ పువ్వు రుచికి కొద్దిగా చేదుగా, తియ్యగా వుంటుంది.కుంకుమపువ్వు... ఈ పేరు వినగానే కాశ్మీర్ గుర్తుకొస్తుంది. ఎందుకంటే మనదేశంలో ఇది కేవలం అక్కడ మాత్రమే పండుతుంది. కానీ నిజానికి దీని స్వస్థలం దక్షిణ ఐరోపా. అక్కడ నుంచే వివిధ దేశాలకు విస్తరించింది. గ్రీసు, స్పెయిన్, ఇరాక్, ఇటలీ, సిసిలీ, టర్కీ, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో దీన్ని ఎక్కువగా పండిస్తారు. అయితే అన్నింటిలోకీ కాశ్మీరీ కేసర్ నాణ్యమైనది. మనదేశంలో ఉత్తరాది రాష్ట్రాలంతటా 'కేసర్' అంటారు.
కుంకుమ పువ్వును ఇరాన్ దేశం అత్యధికంగా పండిస్తుంది. భారతదేశంలో కుంకుమ పువ్వుని కాశ్మీర్లో పండిస్తారు. వర్షాకాలం చివరలో కుంకుమ దుంపలను దున్నిన భూమిలో నాటుతారు. ఎండాకాలం ఆరంభానికి కోత కోస్తారు. కుంకుమ పువ్వు పండాలి అంటే వాతావరణంలో అధిక తేమ ఉండరాదు, మట్టి గుల్లగా ఉండాలి, అత్యధికంగా ప్రకృతిసిద్ధమైన ఎరువులు వాడాలి, వర్షపాతం తక్కువగా ఉండాలి. దుంప నాటిన రెండు నెలలకే పుష్పాలు పూస్తాయి. శీతాకాలం చివరలో కుంకుమ పువ్వు పంట కోతకు వస్తుంది. కుంకుమ పువ్వును ఇంటివద్ద కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. కుండీ మట్టిలో కొబ్బరి పొట్టు, వానపాముల ఎరువు సమానభాగాలుగా ఉండాలి. కుంకుమపువ్వు మొక్కలను పూర్తి ఎండలోగాని, పాక్షిక ఎండలోగాని పెంచుకోవచ్చు. దక్షిణ భారతదేశంలో అయితే చలి ఎక్కువ ఉండే మెట్టప్రాంతాల్లో పండిచవచ్చు. అయితే దక్షిణ భారతదేశంలో కుంకుమ పువ్వు దుంపలను అక్టోబరు నెలలో నాటితే మంచిది. ఒక్క గ్రాము కాశ్మీర్ కుంకుమ పువ్వు కేసరాలు 230నుండి 240 రూపాయల వరకూ ధర పలుకుతుంది.
కుంకుమపువ్వు మొక్క చూడ్డానికి ఉల్లి లేదా ఎర్ర లిల్లీ మొక్కలా ఉంటుంది. చిన్న దుంపవేరు నుంచి ఆకులు పైకి వచ్చి వాటి మధ్యలో పూలు వస్తాయి. కాశ్మీర్‌లో పండించే కుంకుమపువ్వు మొక్కకి పైకి ఆకులు కూడా కనిపించవు. కేవలం వంగపండురంగు పువ్వు మాత్రం కనిపిస్తుంది. కాశ్మీర్‌లోని పాంపోర్ ప్రాంతంలోని నేలంతా అక్టోబరు - నవంబరులో విరబూసిన కుంకుమపువ్వుతో నిండిపోతుంది. ముందు మొగ్గ వచ్చి పువ్వు విచ్చుకుంటుంది. అదే కుంకుమపువ్వు అనుకుంటే పొరపాటే. అందులో ముచ్చటగా మూడే అండకోశాలు, రెండు కేసరాలు ఉంటాయి. కిందభాగంలో పసుపు, పైన ఎరుపురంగులో ఉండే ఈ అండకోశాలనే కుంకుమపువ్వుగా పిలుస్తారు. ఈ ఎరుపురంగు భాగమే ఘాటైన వాసననీ రుచినీ రంగునీ ఇస్తుంది. ఉదయాన్నే విచ్చుకునే ఈ పూలను వెంటనే కోసి అందులోని ఎరుపురంగులో ఉండే అండకోశభాగాలను తుంచి ఎండబెడతారు. అప్పుడే అవి మంచి వాసనతో ఉంటాయి. విచ్చుకున్న పూలను కొయ్యడంలో ఒక్కపూట ఆలస్యం చేసినా అవి వెంటనే వాడిపోతాయి. అండకోశాలు రంగునీ రుచినీ కోల్పోతాయి. అందుకే, పూసిన పూలన్నింటినీ ఉదయం పదిగంటలలోపే కోసేస్తారు. కిలో కుంకుమపువ్వు కావాలంటే సుమారు లక్షన్నర పూలను సేకరించాలి. అన్నింటి నుంచీ అండకోశాలను చేత్తోనే వేరుచేయాలి. ఇది ఎంతో శ్రమతో కూడిన పని. శాఫ్రాన్ అంత ధర పలకడానికి ఇదీ ఓ కారణమే. మనిషి వాడిన సుగంధద్రవ్యాల్లోకెల్లా మొదటి సుగంధద్రవ్యం ఇదేనట.
కుంకుమ పువ్వు అనగానే మనకు గుర్తొచ్చేది గర్భణీ స్ర్తీలు, అందంలో దాని వినియోగం. కానీ కుంకుమ పువ్వు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీన్ని ఎన్నో రకాల వ్యాధులను నయం చేసే మందుల్లో మన పూర్వీకులు ఉపయోగించేవారట. శాస్త్రీయంగా కూడా కుంకుమ పువ్వు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని స్టడీస్ చెబుతున్నాయి. కుంకుమ పువ్వులో క్రోసిన్, క్రోసిటిన్, పిక్రో క్రోసిన్ మొదలైన గ్లూకోసైడులు ఉన్నాయి. వీటితో పాటు బీటా, గామా కెరోటిన్ లు, లైకోఫీనులు ఉన్నాయి.
కుంకుమ పువ్వును ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లోఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా ఆయుర్వేదంలో కుంకుమ పువ్వును చరక సంహిత, సుస్రుత సంహిత వంటి ఆయుర్వేద చికిత్సలకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అంతే కాదు కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుందని ఆయుర్వేదం చెబుతోంది.
☆ కుంకుమ పువ్వు ఉపయోగాలు :-
• ఆకలి పెంచుతుంది :
కుంకుమ పువ్వులోని ఫ్లేవర్ వల్ల వివిధ రకాల వంటల్లో విరివిగా ఉపయోగిస్తుంటారు. దీని ధర కూడా ఎక్కువే. వంటల్లో వేయడం వల్ల ఆకలి పెరుగుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది .
• పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది :
కొన్ని కుంకుమ పువ్వు రేకులను అందంకోసం ఉపయోగిస్తే పిగ్మెంటేషన్ సమస్య నివారించుకోవచ్చు. ముఖ్యంగా స్కిన్ పిగ్మెంటేషన్ సమస్యలను, కళ్లక్రింద డార్క్ సర్కిల్స్ ను తగ్గిస్తుంది. తేనెలోనానబెట్టిన కుంకుమ పువ్వు రేకులతో కళ్లక్రింద మసాజ్ చేయాలి.
• నెలసరి సమస్యలు :
మహిళల్లో నెలసరి సమస్యలను నయం చేయడంలో బాగా సహాయపడుతుంది. హార్మోన్ లెవల్స్ ను, మహిళల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థను క్రమబద్దం చేస్తుంది. నెల సరి సమస్యలను, నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది.
• గ్లోయింగ్ స్కిన్ :
కుంకుమ పువ్వు ఒక్క ఆరోగ్యానికి మాత్రమే కాదు, అందాన్ని కూడా పెంచడంలో గొప్పది. అందుకే దీన్ని ఎక్కువగా ఫేస్ ప్యాక్స్ లో ఉపయోగిస్తుంటారు. ముఖంలో రక్తప్రసరణ పెరిగి, గ్లోయింగ్ స్కిన్ పొందాలంటే తేనె, కుంకుమ పువ్వు కాంబినేషన్ ఫేస్ ప్యాక్ వేసుకోవడం మంచిది .
• మొటిమలు నివారిస్తుంది:
కుంకుమ పువ్వులో యాంటీఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . మొటిమలు, మచ్చలు వంటి సమస్యలను నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది . తులసి, కుంకుమపువ్వు కాంబినేషన్ లో ఫేస్ ప్యాక్ వేసుకోవాలి . 15నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
• హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది:
కుంకుమ పువ్వు ఉపయోగించి హెయిర్ ఫాల్ తగ్గించుకోవచ్చు. ఒక చిటికెడు కుంకుపువ్వు వేసి అందులో లికోరైస్ పౌడర్ పాలు వేసి మిక్స్ చేయాలి. కురులు రాలిపోయిన చోట ఈ పేస్ట్ అప్లై చేసి కొద్దిసేపటికి తలస్నానం చేయాలి.
• మూత్రపిండాల్లో రాళ్లు తొలగిస్తుంది:
కుంకుమ పువ్వును పూర్వకాలం నుంచి ఉపయోగిస్తున్నారు. ఇది రక్తప్రసరణను పెంచుతుంది. ఈ చైనీస్ హెర్బ్ కడుపు నొప్పి, ఇతర మూత్రపిండాల్లో రాళ్లను తొలగిస్తుంది.
• సన్ టాన్ తొలగిస్తుంది:
ఎండలో ఎక్కువగా తిరడగం వల్ల చర్మం నల్లగా కమిలిపోతుంది. అలాంటి కమిలిన చర్మాన్ని నార్మల్ స్థితికి తీసుకురావడానికి కుంకుమపువ్వు గ్రేట్ గా సమాయపడుతుంది. కొన్ని నేచురల్ ప్యాక్స్ వల్ల సన్ టాన్ నివారించుకోవచ్చు. మిల్క్ లో రాత్రంతా నానబెట్టి, ఉదయం ప్యాక్ వేసుకోవాలి. ఆయుర్వేదం ప్రకారం చాలా తక్కువ రోజుల్లోనే ఎఫెక్టివ్ ఫలితాలను అందిస్తుంది.
• పెప్టిక్ అల్సర్ ను నయం చేస్తుంది:
స్టొమక్ అల్సర్, లేదా పెప్టిక్ అల్సర్ ను నివారించడంలో కుంకుమ పువ్వు గొప్పగా సహాయపడుతుంది. కుంకుమ పువ్వును వేడి పాలలో వేసి బాగా కలబెట్టి, గోరువెచ్చగా త్రాగాలి.
• గుండెలో మంట చల్లారుస్తుంది :
గుండెలో మంటి లేదా అసిడిక్ రిఫ్లెక్షన్ తో బాధపడే వారికి త్వరగా ఉపశమనం కలిగించడంలో కుంకుమపువ్వు గొప్పది.
• మెమరీ లాస్ తగ్గిస్తుంది:
కుంకుమ పువ్వులో జ్ఝాపకశక్తిని పెంచే లక్షణాలు మెండుగా ఉన్నాయి . ఇది కోల్పోయిన జ్జాపకశక్తిని తిరిగి తీసుకొస్తుంది .
• చర్మరంగును మార్చుతుంది:
జిడ్డు చర్మానికి లేదా ఇన్ఫెక్షన్ అయిన చర్మానికి కుంకుమ పువ్వుతో తయారుచేసిన ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ఇది నేచురల్ టోనర్ గా పనిచేస్తుంది. అందులో రోజ్ వాటర్ మిక్స్ చేసి ప్యాక్ వేసుకోవడం వల్ల మురికి తొలగించి చర్మ రంగు మార్చుతుంది.
• శ్వాస సమస్యలు నయం చేస్తుంది:
ఈ విషయంలో మ్యాజిక్ అనే అనవచ్చు. శ్వాససమస్యలు, దగ్గు, ఇతర తీవ్ర శ్వాస సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో కుంకుమపువ్వు పాలు గొప్పగా సహాయపడతాయి. వేడి పాలలో వేసి కుంకుమపువ్వు తాగడం వల్ల ముక్కుదిబ్బడ నుంచి ఉపశమనం కలుగుతుంది.
• దాంపత్యజీవితం బాగుంటుంది:
కుంకుమపువ్వు ఆఫ్రోడియాసిక్, ఇది శీఘ్రస్కలన సమస్యను నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది. కామేచ్చను పెంచడానికి ఆయుర్వేదం ప్రకారం కుంకుమ పువ్వు గ్రేట్ గా సహాయపడుతుంది.
• క్యాన్సర్ ను కంట్రోల్ చేస్తుంది:
ఈ ముదురు పసుపు వర్ణం గల నేచురల్ మూలిక పసిపిల్లల్లో దంతాల నొప్పిని తగ్గిస్తుంది . ఆయుర్వేదం ప్రకారం థెరఫియాటిక్ లక్షణాలను కలిగి ఉండటం వల్ల క్యాన్సర్ ప్రమాదంను తగ్గిస్తుంది.
☆ Note : గర్భిణులు పాలలో కుంకుమపువ్వు కలిపి తాగితే పుట్టే బిడ్డ నల్లగా కాక ఎర్రగా, తెల్లగా పుడతుందని నమ్మకం. అయితే శాస్త్రీయంగా ఇది సరైనది కాదని వైద్యులు చెప్తున్నారు. తల్లిదండ్రుల ఒంటిరంగును బట్టి, వారి జీన్స్ లో నిక్షిప్తమయిన సమాచారం సహాయంతో శరీరంలో వున్న "మెలనో సైట్స్ "నుండీ ఉత్పత్తి అయ్యే "మెలనిన్ "పరిమాణాన్ని బట్టి ఒంటి రంగు నిర్ణయమవుతుందే తప్ప కుంకుమపువ్వుకు ఈ విషయంలో ఏ ప్రభావం ఉండదని చెప్తున్నారు.
☆ కుంకుమ పువ్వు దుష్ప్రభావాలు : –
కుంకుమ పువ్వు యొక్క రోజువారీ వినియోగం మీ ఆరోగ్యానికి మంచిదని విస్తృతంగా నమ్మబడింది. అయితే, కుంకుమ పువ్వు అలెర్జీ కలిగిన వ్యక్తులు, ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వికారం, మరియు ఆందోళనవంటి దుష్ప్రభావాలు కలిగిఉండవచ్చు. ఈ దుష్ప్రభావాలు అరుదుగా కనిపించినప్పటికీ, జాగ్రత్తగా ఉండటం మంచిది.
• గర్భదారణ యొక్క చివరి దశలో కుంకుమ పువ్వు యొక్క వినియోగం ప్రయోజనకరమైనదని కనుగొనబడినప్పటికీ, ఒకవేళ మహిళలు వారి మొదటి 20 వారాల గర్భధారణ సమయంలో కుంకుమ పువ్వును ఎక్కువ పరిమాణంలో వినియోగిస్తే, వారికి గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మరొక అధ్యయనం చూపించింది. కుంకుమ పువ్వు వలన సంభవించే గర్భాశయ సంకోచం మరియు రక్తస్రావం, ఈ ప్రభావానికి ప్రధాన కారణాలుగా పరిగణించబడుచున్నాయి.
☆ నకిలీ కుంకుమ పువ్వు :
దానిమ్మ పూరేకుల్నీ బీట్‌రూట్ తురుముల్నీ కూడా శాఫ్రాన్‌గా అమ్మేవాళ్లూ ఉన్నారు. కొనేది మంచిదా కాదా అన్నది చూడాలంటే ఓ రేకుని కాసిని గోరువెచ్చని నీళ్లు లేదా పాలల్లో వేయాలి. అవి వెంటనే రంగు మారితే అది కచ్చితంగా నకిలీదే. స్వచ్ఛమైన కుంకుమపవ్వు కనీసం 15 నిమిషాలు నానిన తరువాతగానీ అందులోనుంచి రంగు దిగదు. అప్పుడే వాసన కూడా మొదలవుతుంది. పొడిరూపంలో కేసర్‌ని అస్సలు కొనకూడదు. ఇందులో మోసం మరింత ఎక్కువ.
No comments:
Post a Comment