అశ్వగంధ (ఆంగ్లం Ashwagandha) ఒక విధమైన ఔషధ మొక్క.దిన్నె విథనీయా సామ్నీఫెరా , ఇండియన్ గిన్సెన్గ్ అని కుడా వ్యవహరిస్థారు. అష్వగన్ద ఆయుర్వేదం వైద్యం లో చాలా ముఖ్యమైనది . దీనిని " king of Ayurveda" అంటారు . మహావృక్షాలు మొదలకుని గడ్డిపరకలదాకా ప్రకృతిలో మానవునికి కావలసిన ఔషధ వనరుల్ని సమకూర్చేవే. మానవ మనుగడకి దోహదం చేసేవే. అదీకాక ఈ వనరులన్నీ మనకి అందుబాటులో ఉన్నవే. అయితే చాలావాటిని మనం అశ్రద్ధ చేస్తున్నాం అనడంలో పొరపాటేమీ లేదు. ప్రతి మొక్కనీ మనం ఇష్టపూర్వకంగా శ్రద్దగా పెంచితే 'పెరటి చెట్టు వైద్యానికి పనికిరాకుండా పోదు. అనేక రకాల మొక్కల్లో కొన్ని పొదలమాదిరిగా పెరుగుతాయి. అటువంటిదే అశ్వగంధ. దీని శాస్త్రీయనామం విథానియా సోమ్నిఫెరా. ఇది సొలనేసీ కుటుంబానికి చెందిన మొక్క. ఇది కేవలం 35-75 సెంటీమీటర్ల ఎత్తులో అంటే, 1.25 మీటర్ల ఎత్తులో గుబురుగా పొదలా పెరిగే మొక్క. దీని కాండం నుండి చిరుకొమ్మలు విశాలంగా పెరిగి, దట్టమైన ఆకులు పెరుగుతాయి. కాండం, కొమ్మలతో మొత్తం మొక్క నూగు వెంట్రుకల మాదిరిగా ఉంటుంది. దీని పువ్వులు ఆకుపచ్చరంగులో ఉండి, పండ్లు ఎరుపు, ఆరంజి రంగుల్లో ఉంటాయి. అశ్వగంధ మొక్క వేళ్ళు పొడవుగా, ఉండి చాలా ఔషధగుణాలు కలిగివుంటాయి. ఇది సాధారణంగా సమశీతోష్ణ ప్రాంతాల్లో విరివిగా పెరుగుతుంది. అందులోను మన భారతదేశంలో విస్తారంగా లభ్యమవుతుంది. దీనిని వ్యవసాయ రీతుల్లో మధ్యప్రదేశ్, పంజాబ్, సింధీ, రాజస్థాన్‌ల్లో విరివిగా పండి స్తున్నారు. దీనిని బెంగాలీలో అశ్వగంధ అనీ, గుజరాతీలో ఘోడాకూన్, ఆసన్, అసోడా అనీ, హిందీలో అస్‌గంధ్ అనీ, కన్నడలో అంగర్‌బేరు, అశ్వగంధి అని, మళయాళంలో అముక్కురమ్ అనీ, మరాఠీలో అస్కంథ అనీ, తమిళంలో అముక్కిర, అసువగంధి అనీ, తెలుగులో పెన్నేరుగడ్డ , పన్నీరు, పులివేంద్రం, వాజిగంధి అనీ వ్యవహరిస్తూవుంటారు.
అశ్వగంధను ప్రతి రోజు తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలకు పొందవచ్చని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం..
1. అశ్వగంధ ఒత్తిడి తగ్గిస్తుంది:
మానసిక సమస్యలు, ఒత్తిడి, డిప్రెషన్ తో బాధపడేవారు ప్రతి రోజు అశ్వగంధను వాడితే ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ విషయం కొన్ని కంట్రోల్డ్ క్లినికల్ ట్రైల్స్ ద్వారా కూడా నిరూపితమైంది. మనస్సును ప్రశాంతంగా మార్చి ఆందోళనను తగ్గించే గుణాలు అశ్వగంధలో ఉంటాయి. అందువల్ల ఈ పొడిని నిత్యం తీసుకుంటే మానసిక ప్రశాంతత కలుగుతుంది.
2. ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తుంది:
అశ్వగంధలో ఉన్న యాంటీ-ఇంఫ్లమేటరీ గుణాల వల్ల ఈ మూలిక ఇన్‌ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. పైగా శరీరంలో ఇన్‌ఫెక్షన్స్ తో పోరాడే ఇమ్యూన్ సెల్స్ ని ప్రమోట్ చేస్తుంది.
3. బ్లడ్ షుగర్ ని తగ్గిస్తుంది:
అశ్వగంధ ఇన్సులిన్ సెన్సిటివిటీ ని అభివృద్ధి చేసి ఇన్సులిన్ విడుదలని పెంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. డయబెటిస్ పేషెంట్స్‌లోనే కాదు, మామూలు వాళ్ళలో కూడ బ్లడ్ షుగర్ ని తగ్గిస్తుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు నిత్యం అశ్వగంధను తీసుకుంటే షుగర్ లెవల్స్ తగ్గుతాయని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. ముఖ్యంగా అశ్వగంధ వల్ల ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవల్స్ బాగా తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు.
4. గుండె ఆరోగ్యానికి మంచిది:
కొలెస్ట్రాల్‌ని, బ్లడ్ ప్రెజర్ నీ తగ్గించడం ద్వారా అశ్వగంధ గుండెకి మేలు చేస్తుంది. జంతువుల మీద చేసిన పరిశోధనల్లో ఈ మూలిక టోటల్ కొలెస్ట్రాల్ నీ ట్రైగ్లిసరైడ్స్ నీ గణనీయంగా తగ్గిస్తుందని తెలిసింది. హై ట్రైగ్లిసరైడ్స్ హార్ట్ డిసీజెస్ కీ స్ట్రోక్ కీ కారణమవుతాయి. అశ్వగంధ చూర్ణాన్ని రోజూ తీసుకోవడం వల్ల రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
5. కాన్సర్ తో పోరాడుతుంది:
అశ్వగంధ కొన్ని రకాల కాన్సర్లు రాకుండా చేస్తుంది. వాటిలో బ్రెస్ట్, కలోన్, లంగ్, బ్రెయిన్, ఒవేరియన్ కాన్సర్లు ఉన్నాయి. జంతువుల మీదా చేసిన పరిశోధనల్లోనూ, టెస్ట్-ట్యూబ్ స్టడీస్ లోనూ ఈ మూలిక ట్యూమర్ గ్రోత్ ని అరికట్టగలదని తెలిసింది.
6. బ్రెయిన్ ఫంక్షన్‌ని ఇంప్రూవ్ చేస్తుంది:
ఈ ఆయుర్వేద మూలిక బ్రెయిన్ ఫంక్షన్ ని పెంచడమే కాక జ్ఞాపకశక్తి ని అభివృద్ధి చేసి పనితీరుని మెరుగుపరుస్తుందని పరిశోధనలు చెబున్నాయి.
అశ్వగంధ చూర్ణం రోజువారీ ఆరోగ్య సమస్యలకు కూడా అద్భుతంగా పని చేస్తుంది..
*శరీరంలో వాతాన్ని తగ్గించడంలో దీనికిదే సాటి
*ప్రతి రోజు అశ్వగంధను వాడేవారికి వృద్ధాప్యం దరిచేరదు.
*శరీర కాంతిని పెంచుతుంది.
*నిద్ర లేమి సమస్యలతో బాధపడేవారికి ఇది దివ్యౌషధంగా పని చేస్తుంది.
*అనేక రకాల వ్యాధుల వలన శరీరం బలహీనంగా అయిన వారు ఈ అశ్వగంధని ఆవు నెయ్యితో కలిపి వాడటం వలన బలవంతంగా తయారవుతారు.
*పక్షవాతంతో బాదపడుతున్న వారు అశ్వగంధ చూర్ణాన్ని ఉదయం, సాయంత్రం రెండుపూటలా తీసుకోవడం వలన నరాలకు పునరోత్తేజం కలుగుతుంది.
*అశ్వగంధ పొడిని నిత్యం తీసుకోవడం వల్ల పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. అంగస్తంభన సమస్యలు పోతాయి. వీర్యం వృద్ధి చెందుతుంది. దీంతో సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఆయుర్వేదంలో ప్రాథమికంగా వాడే మూలకాలలో అశ్వగంథ ప్రధానమైనప్పటికీ దీని వాడకం వల్ల దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఈ కథనంలో వివరిస్తున్నాం.
ముమ్మాటికీ అశ్వగంథ వాడకం సురక్షితమే, ఒత్తిడిని నియంత్రించడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. శారీరకంగానే గాక మానసికంగా కూడా దీని వాడకం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. అయితే ఎంత పరిమాణంలో తీసుకుంటున్నామన్న దానిపై ఇది సురక్షితమా కాదా అనేది చెప్పవచ్చు. మోతాదుకు మించి తీసుకోవడం మంచిది కాదు. అవేంటో ఈ కథనంలో విపులంగా తెలుసుకుందాం.
అశ్వగంధ వల్ల కలిగే దుష్ప్రభావాలు:
1.అలెర్జీలు రావడం:
అశ్వగంధ వాడకం వల్ల చర్మంపై దద్దుర్లు రావడం, మండినట్లుగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో నొప్పి వంటి అలెర్జీలను ఎదుర్కొన్నట్లు కొంత మంది తెలిపారు. దీనిపై ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉంది. ఇది సొలనేసి(నైట్‌షేడ్) కుటుంబానికి చెందింది కాబట్టి, ఈ మొక్కల పట్ల అలెర్జీ ఉన్నవారు దీనిని వాడక పోవడమే మంచిది.
2. రక్తస్రావం అవడం:
అశ్వగంధ వాడకం వల్ల కొన్ని సార్లు రక్తస్రావం జరిగినట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి రక్తస్రావ రుగ్మత ఉన్నవారు లేదా సర్జరీ చేసుకున్న వారు దీని వాడకానికి దూరంగా ఉండటం ఉత్తమం.
3. రక్తంలో చక్కెర స్థాయులు తగ్గడం:
అశ్వగంధనుపయోగించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు గణనీయంగా పడిపోతున్నట్లు కొన్ని అధ్యయనాలు తెలిపాయి. కాబట్టి మధుమేహా వ్యాధి ఉన్నవారికి ఇది అంత ప్రయోజనకరం కాదు. రక్తంలో చక్కెర స్థాయులు తగ్గడం అనేక సమస్యలకు దారి తీస్తుంది. సరైన సమాచారం లేకున్నప్పటికీ, ఇది రక్తపోటుపైనా దుష్ప్రభావాలు చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
4. ఉదర సంబంధిత సమస్యలు:
దీని వల్ల ఉదర సంబంధిత సమస్యలు సైతం తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి కడుపులో అల్సర్లు ఉన్నవారు దీనిని వాడకూడదు. అశ్వగంధను తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య కూడా వచ్చే అవకాశం ఉందని ఒక అధ్యయనంలో తేలింది. దీని వల్ల అతిసారం(డయేరియా), కడుపు నొప్పి కూడా రావచ్చు.
5. మగతగా లేదా మత్తుగా అనిపించడం:
అశ్వగంధకున్న లక్షణాల వల్ల వ్యక్తులకు మగతగా లేదా మత్తుగా అనిపిస్తుంది. కాబట్టి మత్తునిచ్చే ఇతర ఔషధాలైన ఆల్ఫ్రాజోలమ్, లోరా జెపమ్, జోల్పిడెమ్ లాంటి వాటితో కలిపి దీనిని తీసుకోవడం ప్రమాదకరం. మత్తునిచ్చే ఇతర ఔషధాలతో కలిపి దీనిని తీసుకున్నప్పుడు అతినిద్రా వ్యాధి కూడా రావచ్చు.
6. నోరు పొడిబారినట్లనిపించడం:
మోతాదుకు మించి వాడకం వల్ల కొంతమంది వ్యక్తులలో నోరు పొడిబారినట్లవుతుంది. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వైద్యుడిని సంప్రదించడం మంచిది.
7. అంగస్తంభన సమస్యలు:
శ్రీలంక లోని రుహునా విశ్వవిద్యాలయం వారి అధ్యయనం ప్రకారం అశ్వగంధ వాడకం ఒక్కోసారి పురుషులలో అంగస్తంభన సమస్యలు తీసుకొచ్చి, వారి లైంగిక పటుత్వాన్ని దెబ్బ తీసే అవకాశం కూడా ఉంది. అయితే దీనిపై ఇంకా స్పష్టమైన అధ్యయనాలు జరగాల్సి ఉంది.
8. కాలేయ సమస్యలు:
అశ్వగంధను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల కొన్ని సార్లు కాలేయ సంబంధిత సమస్యలు రావచ్చు. అయితే దీనిపై ఇంకా పరిశోధనలు జరగాల్సింది.
9. జ్వరం రావడం:
అశ్వగంధ వాడకం వల్ల శరీర ఉష్ణోగ్రతలు పెరిగి వారం లేదా రెండు వారాలపాటు జ్వరం వచ్చినట్లుగా ఉంటుంది. ఆ తర్వాత సాధారణ పరిస్థితి ఉంటుంది. ఒకవేళ అలా లేకపోతే వైద్యుడిని సంప్రదించండి.
అశ్వగంధ వల్ల గర్భవతులుకు కొన్ని సమస్యలు ఏర్పడతాయి. అమెరికాలోని స్లోన్-కెటరింగ్ మెమోరియల్ క్యాన్సర్ సెంటర్ వారి అధ్యయనం ప్రకారం ఒక్కోసారి గర్భస్రావం(అబార్షన్) అయ్యే అవకాశాలున్నాయి. అంతేగాక శిశువులకు పాలు పట్టే సమయంలోనూ దీని వల్ల కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నదని ఒక సమాచారం. కాబట్టి గర్భవతులు, బాలింతలు దీనికి దూరంగా ఉండటం ఉత్తమం.
11. హైపర్ థైరాయిడిజం మరింత జఠిలం అయ్యే అవకాశం:
అశ్వగంధ శరీరంలో థైరాయిడ్ గ్రంధి ద్వారా ఉత్పత్తయ్యే హార్మోన్‌ల ప్రభావాన్నిపెంచుతుంది. కాబట్టి హైపర్ థైరాయిడిజం ద్వారా బాధ పడేవారికి ఇది అంత ప్రయోజనకరం కాదు. అయితే హైపో థైరాయిడిజంతో బాధ పడే వారు దీని వాడకానికి ముందు వైద్యులను సంప్రదించి తీసుకుంటే వారి సమస్యకు ఉపశమనం లభంచే అవకాశం ఉంది.
12. ఆటో ఇమ్యూన్ వ్యాధులు మరితంగా పెరిగే అవకాశం:
అశ్వగంధ ప్రధానంగా వ్యక్తి యొక్క రోగ నిరోధక శక్తిని మరింత మెరుగుపరుస్తుంది. అయితే కీళ్ల వ్యాధులు(రుమాటాయిడ్ ఆర్థరైటీస్), లూపస్, మల్టీపుల్ స్క్లీరోసిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బాధ పడుతున్న వారికి దీని వాడకం సమస్యలను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వ్యాధులకు చికిత్స తీసుకుంటున్నప్పుడు వాటితో కలిపి అశ్వగంధను వాడితే రోగ నిరోధక శక్తి మందగించే ప్రమాదం ఉంది. సరైన జాగ్రత్తలు తీసకున్నట్లయితే అశ్వగంధ వాడకం మంచి ప్రభావాల్నే చూపిస్తుంది.
*అశ్వగంధ చూర్ణాన్ని రోజూ ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. 1 లేదా 2 టీస్పూన్ల అశ్వగంధ చూర్ణాన్ని ఒక గ్లాస్ నీరు లేదా పాలలో కలిపి తీసుకోవచ్చు. లేదా నెయ్యి, తేనెలతోనూ దీన్ని తీసుకోవచ్చు
No comments:
Post a Comment