తేనెటీగలు పువ్వులనుండి సేకరించే తియ్యటి ద్రవ పదార్థాన్నే 'తేనె' అంటారు. స్వచ్ఛమైన తేనె ఎన్నటికి చెడిపోదు, ఎందుకంటే పంచదార కన్నా రెండు రెట్లు ఎక్కువ తీపిగా ఉండే తేనె క్రిమి సంహారక గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకే ఇది బ్యాక్టీరియాని చంపే స్తుంది. తేనెలో 14 నుంచి 18 శాతం వరకు తేమ ఉంటుంది. ఇందులో నీటి శాతం కూడా తక్కువగా ఉండటంతో పులియడం, పాడవడం జరగదు. 18 శాతంకన్నా తక్కువ తేమ ఉన్న పదార్థాల్లో సూక్ష్మ జీవులు కానీ ఏ ఇతర జీవులు కానీ పెరగలేవు. కానీ పిల్లలకు హాని కలిగించేంత మొత్తంలో సూక్ష్మ క్రిములు ఉండడానికి అవకాశం ఉంది. పంచదార కనిపెట్టకముందు మనిషి తొలిసారిగా తీపి రుచిని తెలుసుకుంది దీని ద్వారానే. మొట్టమొదటగా మద్యాన్ని తయారుచేసిందీ తేనెతోనే. ప్లేటో, అరిస్టాటిల్, డిమొక్రటిస్... లాంటి తత్త్వవేత్తలంతా తేనె వైశిష్ట్యాన్ని తమ గ్రంథాల్లో పేర్కొన్నారు. మన ఆయుర్వేదానికి తేనె ప్రాణం లాంటిది. శుశ్రుతసంహిత తేనెను తాగేమందుగా వర్ణించింది, శ్వాసకోశవ్యాధులకు మధువును మించిన దివ్యౌషధం లేదని చెప్పింది.
తేనె వల్ల చాలా లాభాలున్నాయి. తేనే ప్రకృతి సిద్దం గా దొరికే అపురూపమైన ఔషధము . తేనెటీగలు రకరకాల పుల మకరందాలను పోగు చేసి తేనే రూపము లో మనకి (వాటికోసమే అనుకోండి) అందిస్తున్నాయి. రోజు వారిగా గాని, ఇతర పదార్థాలతో గాని సేవిస్తూ ఉంటే ఆరోగ్య పరంగా ఎంతో మేలు.
•రోజూ 1/4 గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో రెండు చెంచాల తేనే కలుపుకు తాగితే బరువు తగ్గుతారు. రాత్రి వేళల్లో పాలు తేనే కలుపుకొని తాగితే చక్కటి నిద్ర వస్తుంది.నిమ్మ రసం లో తేనే కలుపుకొని తీసుకుంటే కడుపు ఉబ్బరం , ఆయాసం తగ్గిపోతుంది. తేనే లో కొంచెం మిరియాలపొడి కలుపుకొని తీసుకుంటే జలుబు తగ్గుతుంది .
వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది.
•తేనే లో ఉన్న విటమిన్స్... శరీర వ్యాధి నిరోధక శక్తిని పెంపొందుతుంది. నిమ్మ రసము తో కలిపి సేవిస్తే దగ్గు , గొంతు నొప్పులకు బాగా పని చేస్తుంది. యాంటీ బ్యాక్టరీయా, యాంటి సెప్టిక్ గుణాలున్నందున చర్మము పై పూస్తే గాయాలు మానుతాయి.
•రెండు చెంచాల తేనే లో కోడిగుడ్డు లోని తెల్లనిసోన , కొంచెంశనగపిండి కలుపుకొని ముఖానికి మర్దన చేసుకుంటే చర్మం కాంతి పెరుగుతుంది . తేనే లో పసుపు , వేపాకు పొడి కలిపి రాస్తే పుల్లు మానుతాయి .
•తేనేను శుద్ది చేయకుండా వాడకూడదు . దీనిలో అనేక సుక్ష్మ జీవులు ఉంటాయి . తేనే లో ఉండే 'బొటులినియం ఎన్దోసపొర్స్" చిన్నపిల్లలకు హాని చేస్తాయి. ఒక సంవత్సరం లోపు పిల్లలకు వాడకూడదు. తుతిన్ అనేది విషపదార్దము శరీరానికి మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు.
•తేనె (15 భాగాలు), దాల్చిన చెక్క పొడి (1 భాగం)... ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ రాత్రి పూట 2 వారాలపాటు మొటిమలపై మర్దన చేస్తే తగ్గుతాయి.
•రెండు చెంచాలు తేనెను కప్పు దాల్చిన చెక్క కషాయానికి కలిపి సేవిస్తే కీళ్లనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. 1 లీటరు వేడి నీళ్లకు 1 కప్పు తేనెను, అరకప్పు నిమ్మ రసాన్ని చేర్చి నూలు గుడ్డను ముంచి నొప్పి, వాపు ఉన్నచోట కీలుమీద రాస్తే ఉపశమనం లభిస్తుంది.
•తేనె (4 భాగాలు), పిప్పళ్ల పొడి (1 భాగం), మిరియం పొడి, లవంగాల పొడి, జీలకర్ర పొడి కలిపి గొంతు తగిలేలా పుక్కిట పడితే గొంతునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
•రెండు భాగాల తేనెకు 1 భాగం మీగడను, నాలుగైదు చుక్కలు రోజ్ వాటర్‌ని కలిపి పెదవుల మీద ప్రయోగిస్తే పెదవుల పగుళ్లు తగ్గి నున్నగా తయారవుతాయి.
•పిల్లల్లో అతిగా విరేచనాలు అవుతుంటే తేనెకు జాజికాయ పొడిని కలిపి తాగిస్తే తగ్గిపోతాయి.
•తేనె(3 భాగాలు), దాల్చిన పొడి (1 భాగం), ఆలివ్ నూనె (తగినంత)... ఈ నిష్పత్తిలో కలిపి తలమీద ప్రయోగించి పావుగంట తరువాత శుభ్రపరుచుకోవాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే ఎలోపీషియా (ఇంద్రలుప్తం)లో చక్కని ప్రయోజనం కనిపిస్తుంది.
•వ్యాధి నిరోధకశక్తి పెరగడానికి
మూడు భాగాల తేనెకు 1 భాగం దాల్చిన చెక్క పొడిని కలిపి పుచ్చుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
•చెంచాడు దాల్చిన చెక్క పొడిని 2 గ్లాసుల నీళ్లకు చేర్చి అరగ్లాసు కషాయం మిగిలేంత వరకూ మరిగించాలి. దీనికి మూడు టీస్పూన్లు తేనెను కలిపి ఆహారానికి అరగంట ముందు రెండు పూటలా సేవిస్తే స్థూలకాయంలో మంచి ఫలితం కనిపిస్తుంది.
•ముఖంమీద మంగు మచ్చలు
తేనెకు తగినంత పాల పొడి కలిపి ఫేస్‌మాస్క్ మాదిరిగా పెట్టుకుంటుంటే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
•చర్మం పగుళ్లు
మోచేతులు, పాదాల వంటి భాగాల్లో చర్మం పగిలి ఇబ్బందిని కలిగిస్తుంటే తేనె, నిమ్మరసం ఆలివ్ నూనె కలిపి పేస్టులా చేసి పెట్టుకోవాలి. ఇలా చేస్తే చర్మంపై వచ్చే పగుళ్లు తగ్గిపోతాయి.
•రక్తహీనత
ఎర్ర రక్తకణాలు తక్కువగా ఉన్నవారు, హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉన్నవారు తేనెను వాడి ప్రయోజనం పొందవచ్చు. తాజా ఆకుకూరల మీద తేనెను పరిచి తీసుకుంటుంటే బాగుంటుంది. రక్తహీనత క్రమంగా దూరమవుతుంది.
•నోటి దుర్వాసన
ఒక బాటిల్లో మూడువంతులు సిడర్ వెనిగార్‌ని నింపి, కప్పు తేనెను కలపాలి. బాగా గిలకొట్టాలి. దీనిని ఆహారం తర్వాత మౌత్‌వాష్‌గా పుక్కిట పట్టాలి. చివరగా నీళ్లతో పుక్కిలించాలి. దీంతో నోటి దుర్వాసన దూరమవుతుంది.
•పొడి దగ్గు
చెంచాడు అల్లం రసానికి చెంచాడు తేనెను కలిపి మూడు పూటలా తాగుతుంటే దగ్గునుంచి ఉపశమనం లభిస్తుంది.
•కాలిన గాయాలు
స్టౌవద్ద కాలిన గాయాలకు, వేడి నీళ్లుపడటం వల్ల కాలిన గాయాలకు తేనెను నేరుగా ప్రయోగించవచ్చు. గాటుపడకుండా గాయం మానుతుంది.
తేనె వాడకూడని సందర్భాలు:
మధుమేహ వ్యాధిగ్రస్తులు యథేచ్ఛగా తేనెను వాడకూడదు. ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే తేనెను వాడాలి. తేనెను వేడి పదార్థాలతో కలిపి వాడకూడదు. అలాగే పిప్పళ్లు, మిరియాలు వంటి వాటితో కలిపి నేరుగా వాడకూడదు.
•మరిగించకూడదు:
తేనెను మరిగించకూడదు. తేనె ఉష్ణ వీర్య పదార్థం కాబట్టి తేనెను నేరుగా మంటపైన వేడిచేయకూడదు. తేనెను వేడి వాతావరణంలోనూ, ఎండాకాలంలో పరిమితంగానే వాడాలి. (తేనెలో రకరకాల పువ్వుల మకరందాలుంటాయి. వీటిల్లో విష పుష్పాలు సైతం ఉంటాయి).
•మద్యంలో తేనెను కలుపుకోని తాగకూడదు:
మసాలా పదార్థాలతోనూ, మద్యంతోనూ, ఆవనూనె వంటి పదార్థాలతోనూ కలపకూడదు.తేనెను వర్షం నీళ్లతో కలిపి వాడకూడదు.
•ఫ్రిజ్ లో ఉంచకూడదు:
తేనెను ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఫ్రిజ్‌లో ఉంచితే పంచదార స్పటికాలు తయారవుతాయి. అలాంటి సందర్భాల్లో ఎండలో ఉంచితే సరిపోతుంది. లేదా తేనె సీసాను వేడి నీళ్లలో పెట్టి పరోక్షంగా వేడిచేస్తే తేనె స్పటికాలు కరిగి తిరిగి తేనె తయారవుతుంది.
•శారీరక వాంఛలు తగ్గుతున్నాయి:
ఇక ప్రస్తుతం మగవారిలో రోజురోజుకి శారీరక వాంఛలు మందగించే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ కాసింత సేపు కూడా విశ్రాంతి లేకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. శరీరానికి, మనస్సుకి కాసింత కూడా విశ్రాంతి ఇవ్వడం లేదు. దీంతో వారి దాంపత్య జీవితాన్ని సరిగ్గా అనుభవించలేకపోతున్నారు.
•శృంగార సామర్థ్యం తగ్గిపోతుంది:
ఒకప్పటితో పోల్చుకుంటే ప్రస్తుతం ఉన్న మగవారిలో శృంగార సామర్థ్యం తగ్గిపోతుంది. భారతదేశంలో ఇలాంటి సమస్య ఎక్కువగా ఉంది. మగవారిలో లైంగిక సామర్థ్యం తగ్గి సంతాన సమస్యలు కూడా తలెత్తున్నాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే మగవారు శారీరక శక్తిని పెంచే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి.
•టెస్టోస్టిరాన్ స్థాయి:
తేనెకు టెస్టోస్టిరాన్ స్థాయిలను పెంచే గుణం ఉంది. దీనిలో బోరోన్ అనే మినరల్ మగవారిలో చక్కగా అంగస్తంభన జరిగేట్లు ఉపయోగపడుతుంది. మీరు రోజూ తేనెను తీసుకుంటే అది మీలో సెక్స్ సామర్థ్యం పెంచుతుంది. తేనెను తాగితే వయాగ్రా కన్నా ఎక్కువ శక్తినే మగవారు పొందుతారు.
తేనె స్వచ్చంగా ఉందని తెలుసుకోవటానికి మార్గాలు:
ఉదయం నుంచి డిన్నర్ వరకు తేనెను అనేక వంటలలో ఉపయోగిస్తాం. ఆహార నియంత్రణ చేసే వారికి తేనె చాలా మంచిది. పంచదారకు బదులుగా తేనెను ఉపయోగించవచ్చు. తేనె స్వచ్ఛమైనదని ఎలా తెలుసుకోవాలి ? స్వచ్ఛత పొందడానికి ఏవైనా ఉపాయాలు ఉన్నాయా ? అవును, మీ తేనె స్వచ్ఛమైనదని తెలుసుకోవటానికి ఖచ్చితంగా కొన్ని మార్గాలు ఉన్నాయి. అయితే,చాలా మంది కొనుగులు తర్వాత చూస్తారు. కనీసం మీరు ఆ దుకాణం నుండి తేనె కొనుగోలు చేయరాదని తెలుసుకోవాలి లేదా దానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయవచ్చు. మీకు మీ తేనె స్వచ్ఛంగా ఉందని తెలుసుకోవటానికి ఏదైనా ఆలోచన ఉందా?
లేబుల్ తనిఖీ చెయ్యండి:
అవును, ఇది మీ తేనె స్వచ్ఛంగా ఉందని తెలుసుకోవటానికి ఒక మార్గం. మీరు పరిశీలన పద్ధతులు తర్వాత దరఖాస్తు చేయవచ్చు. కానీ కొనుగోలు సమయంలో మాత్రం జాగ్రత్తగా లేబుల్ తనిఖీ చేయాలి. మీరు ఏవైనా అదనపు పదార్ధాలను కనుగొంటే అది కొనుగోలు చేయకూడదు.
నీటి పరీక్ష :
ఇది మీ తేనె స్వచ్ఛమైనదని తెలుసుకోవటానికి సమర్థవంతమైన మార్గాలలో ఒకటి. ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ తేనెను వేయాలి. అది కరిగితే స్వచ్చమైన తేనే కాదని అర్ధం. నీటి లోకి పోసిన వెంటనే స్వచ్ఛమైన తేనె ఎల్లప్పుడూ గడ్డలుగా ఏర్పడుతుంది.
ఫైర్ టెస్ట్ :
ఈ విధమైన పరీక్ష చేసినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే తేనే మండే వస్తువు. ఒక కొవ్వొత్తి తీసుకొని వెలిగించి కాటన్ విక్ ని తేనేలో ముంచి కాల్చండి. కాటన్ విక్ బర్న్ మొదలవుతుంది, అప్పుడు తేనె స్వచ్ఛమైనది. లేకపోతే, తేనెలో నీరు ఉందని అర్ధం.
పేపర్ టెస్ట్ :
ఈ టెస్ట్ కోసం బ్లాటింగ్ పేపర్ అవసరం. ఈ పేపర్ మీద ఒక డ్రాప్ తేనె వేయాలి. ఏవైనా కల్మషాలు ఉంటే, కాగితం తేనెను గ్రహిస్తుంది. స్వచ్ఛమైన తేనె కాగితం మీద ఉంటుంది. ఇది మీ తేనె స్వచ్ఛమైనదని తెలిసి కోవటానికి ఉపయోగకరమైన మార్గాలలో ఒకటి.
క్లాత్ టెస్ట్ :
ఒక వస్త్రం మీద కొన్ని చుక్కల తేనెను పోయాలి.మలినాలు ఉంటే తేనె శోషించబడుతుంది. మీరు మరొక విధంగా కూడా స్వచ్ఛత కోసం ప్రయత్నించవచ్చు.వస్త్రం నుండి తేనెను కడిగినప్పుడు ఎటువంటి మరక లేకపోతే,మీ తేనె స్వచ్ఛమైనది.
ఆల్కహాల్ టెస్ట్ :
ఒక గ్లాస్ లో తేనె మరియు ఆల్కహాల్ లేదా స్పిరిట్ ను సమాన నిష్పత్తిలో తీసుకోవాలి. అది మలినాలతో ఉంటే పలుచగా చేయబడుతుంది. అయితే స్వచ్ఛమైన తేనె అయితే ఖచ్చితంగా గడ్డలూ ఏర్పరుచుకుంటుంది. తేనె మలినాలతో ఉంటే కనుక మీ ప్రయోగం తర్వాత ఒక మిల్కీ వైట్ ద్రవాన్ని కనుగొంటారు.
హీట్ టెస్ట్ :
మీరు తేనెకు వేడి అవసరం లేదని విని ఉండవచ్చు. వేడి తేనెను విషపూరితం చేయవచ్చు. అయితే దీనికి ఎటువంటి శాస్త్రీయ నిరూపణ లేదు. కాబట్టి, తేనెను కొద్దిగా వేడి చేయవచ్చు. మీకు మలినాలతో ఉంటే ఒక బుడగను చూడవచ్చు. అయితే స్వచ్ఛమైన తేనె కారమేలైజ్డ్ చేయబడుతుంది.
గడియారం టెస్టు :
ఇది చాలా ఆసక్తికరముగా ఉంది. నిజానికి ఈ ప్రయోగంలో గడియారంతో సంబంధం లేదు. కానీ అనేక మంది ఈ పద్ధతిని నమ్మారు. ఒక సీసా లోని తేనెను ఒక కుండ లో పోయటం ప్రారంభించండి.తేనె సవ్య దిశలో వచ్చినట్లయితే, ఇది స్వచ్ఛమైనదని భావించబడుతోంది.
బ్రెడ్ టెస్టు:
అల్పాహారం సమయంలో దీనిని ప్రయత్నించండి.స్వచ్ఛమైన తేనె ఎల్లప్పుడూ బ్రెడ్ ను హార్డ్ చేస్తుంది.తేనెలో కలుషితాలు ఉంటే, బ్రెడ్ తడిగా మారి మునిగిపోతుంది. ఎందుకంటే తేమ ఎక్కువ అవుతుంది.
వాసన సాదారణంగా తేనె స్వచ్ఛమైనది కాకుంటే పుల్లటి వాసన వస్తుంది. అంతేకాక మీరు తెలుపు నురుగు పదార్ధంను కనుగొంటారు. దానిని వెంటనే మానివేయటం ఉత్తమం. స్వచ్ఛమైన తేనె మీ భావాలకు అనుగుణంగా సున్నితమైన, తేలికపాటి వాసనను కలిగి ఉంటుంది. ఈ మార్గాల ద్వారా చాలా సమర్థవంతంగా మీరు స్వచ్ఛమైన తేనెను తెలుసుకోవచ్చు.
No comments:
Post a Comment