వట్టివేర్లు ఇండియాలోనే పుట్టాయి. వీటినే ఖుస్ అంటారు కూడా. ఇవి ఓ రకమైన సువాసన వచ్చే పొడవైన గడ్డి మొక్క వేర్లు. సంప్రదాయ పద్ధతుల్లో ఈ గడ్డి మొక్క వల్ల చాలా ఉపయోగాలున్నాయి. మొక్క కంటే... వేర్ల వల్ల ప్రయోజనాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. శ్రీశైలం లాంటి చోట్ల ఇలాంటి వట్టి వేర్లను అమ్ముతుంటారు. అయితే చాలా మందికి ఈ వేర్లు గొప్పవనీ, మంచివనీ తెలుసు గానీ... వీటిని ఎలా వాడాలో సరిగా తెలియదు. అదెలాగో తెలిస్తే... కచ్చితంగా వీటిని కొంటారు. ఇదేమీ పెద్ద సీక్రెట్ కాదు.
వట్టి వేర్లు... నీటిని చల్లబరుస్తాయి. అంతేకాదు... శరీరంలో వేడిని తగ్గిస్తాయి. చలవ చేస్తాయి. ఇవి సహజసిద్ధంగా విష వ్యర్థాలు, విష సూక్ష్మక్రిములతో పోరాడతాయి. శరీరంలో వేడిని తగ్గించడమే కాదు... బాడీకి ఉపశమనం కలిగిస్తాయి. మానసికంగా కూడా హాయిగా ఉంటుంది. బుర్ర చల్లగా ఉంటుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు రాకుండా... కూల్ కూల్‌గా ఉంటుంది. కోపం, ఆవేశం, గొడవల వంటి వాటి జోలికి వెళ్లకుండా ఉంటారు. కొన్ని కంపెనీలు ఈ వేర్లను మ్యాట్స్ (పరుపులు) తయారీకి వాడుతున్నాయి. ఈ పరుపులపై పడుకుంటే... చల్లగా మనస్శాంతిగా ఉంటుంది. ఆక్సిజన్ లెవెల్స్ కూడ పెరుగుతాయి.
ఆయుర్వేద ఔషధాల్లో ఎక్కువగా వినియోగించే వట్టివేర్లని ఉషీరా, ఖస్, నన్నారి అనికూడా పిలుస్తారు. వీటి నుంచి తీసే తైలం చలువ చేస్తుంది. ఇందులో యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి. ఈ ఆయిల్‌ని చర్మం, జుట్టుకి వాడినప్పుడు... ఇది మొత్తం క్లీన్ చేస్తుంది. జ్వర తీవ్రతను తగ్గిస్తుంది. వీటితో కషాయం, షర్బత్ కూడా తయారుచేసుకోవచ్చు. ఈ వేర్లలో ఇనుము, మాంగనీస్, విటమిన్-బి6 పుష్కలంగా ఉంటాయి.
ఖస్ సిరప్...
కావాల్సినవి: వట్టివేర్లు- 40 గ్రా, నీళ్లు- 5 కప్పులు, తాటిబెల్లం లేదా పటిక బెల్లం- 300 గ్రా. నిమ్మకాయలు- 2
తయారీ: వట్టివేర్లను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా చేసుకుని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం మిక్సీలో వేసి గ్రైండ్ చేసి వచ్చిన రసాన్ని వడకట్టి వేడిచేయాలి. బెల్లంపాకం పట్టి దాంట్లో ఈ రసం వేసి కలిపి చివరగా నిమ్మరసం పిండాలి. లేదా బెల్లంపాకం పట్టుకుని బజారులో దొరికే ఖస్ సిరప్‌ను కలిపినా సరిపోతుంది. ఇది నెలరోజులపాటు నిల్వ ఉంటుంది.
ఖస్ సిరప్‌ను గర్భిణులకు కూడా ఇవ్వొచ్చు. కళ్ల మంటలను నియంత్రిస్తుంది.
* జ్వర తీవ్రతను తగ్గిస్తుంది. హృద్రోగులకు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవాళ్లకు మంచిది.
* ఈ సిరప్‌ను అన్ని రకాల పండ్ల రసాల్లో వేసుకుని తాగొచ్చు.
•చెమట కాయలు రాకుండా:వట్టివేర్ల తైలాన్ని చెమట పొక్కులు, గడ్డలు వచ్చినప్పుడు పైపూతగా వాడతారు. ఈ తైలాన్ని వేడినీళ్లలో వేసుకుని పుక్కిలిస్తే జ్వరం తగ్గుతుంది. నోటి దుర్వాసన, పుండ్లు తగ్గుతాయి.
•మనసు తేలిగ్గా: వీటి నుంచి వచ్చే సువాసన మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది. వేర్లలోని సుగంధతైలాలు రుచికరంగా ఉంటాయి.
•వడదెబ్బ తగలకుండా: ఈ వేర్లతో తయారుచేసిన కషాయాన్ని తాగితే వడదెబ్బ తగలడం వల్ల వచ్చే దుష్ప్రభావాలు, దురదలు తగ్గుతాయి. అధికంగా చెమట పట్టేవాళ్లకు ఉపశమనం కలుగుతుంది. మూత్రంలో మంట ఉంటే తగ్గుతుంది. నెలసరిలో వచ్చే అధిక రక్తస్రావ సమస్య అదుపులో ఉంటుంది.
•రోగనిరోధకశక్తిని పెంచి: పానకంలా తయారుచేసి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నిజానికి తులసి కంటే దీంట్లో ఔషధ గుణాలెక్కువ.
No comments:
Post a Comment