Thursday, September 24, 2020

🌱 ఆయుర్వేదం - జిల్లేడు



జిల్లేడును ‘ అర్క’ అని అంటారు. ఒక పాలు గల చిన్న మందు మొక్క. దీనిలో ఎరుపు, తెలుపు రకాలున్నాయి. ఈ భేదాన్ని పూవుల రంగులను బట్టి నిర్ణయిస్తారు. జిల్లేడు చెట్టు చూడటానికి గుల్మంలాగా ఉంటుంది. జిల్లేడుచెట్టు మీద ఏ భాగంలో గాటుపెట్టినా పాల లాంటి ద్రవం స్రవిస్తుంది. దీని కాండం తెలుపు ధూళిరంగులో ఉంటుంది. ఆకులు అండాకారంలో ఉంటాయి. పువ్వులు పత్ర కోణాలనుంచి వస్తాయి. ఫలం రెండువైపులా సన్నగా ఉండి కేప్సూల్‌లాగా కనిపిస్తుంది. గింజలు నలుపు రంగులో ఉండి, దీనిపై సన్నని తెలపు పట్టు తంతువులలాగా ఉంటుంది. ఇందులో విషం ఉంటుందని చాలామంది ఈ మొక్కలకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా జిల్లేడు పాలు కళ్ళలో పడితే చూపు పోతుందని భయపడతారు.కానీ గమ్మత్తేమిటంటే ఈ మొక్కలో ఉన్న విషంతో ఆయుర్వేదంలో దివ్యమైన ఔషధాలు తయారుచేస్తున్నారు. జిల్లేడు మొక్కలు అధికంగా ఉన్న ఊళ్ళో పంటలు బాగా పండుతాయంటారు.

ఈ మొక్క మానవాళికి ఉపయోగపడే అత్యంత అద్భుతమైన మొక్క.


ఔషధ గుణాలు:


జిల్లేడు పాలలో పసుపు పిండి పేస్టులాగా చేసి ముఖం మీద లేపనంగా రాసుకుంటే ముఖం మీది మచ్చలు తగ్గుతాయి.

జిల్లేడు వేరు పట్టను నూరి లేపనం చేసి వేసుకున్నా, పట్టు వసుకున్నా బోదకాలు తగ్గుతుంది. 

జిల్లేడు ఆకుల రసాన్ని తీసుకుని అందులో ఆవనూనెను, పసుపును కలిపి పైపూతగా రాసుకుంటే చర్మవ్యాధులు తగ్గుతాయి. 

జిల్లేడు ఆకులను వెచ్చజేసి, వాటినుండి రసం తీసి చెవిలో వేస్తే చెవిపోటు తగ్గుతుంది. చీము కారడం కూడా తగ్గుతుంది.

జిల్లేడు వేరు బెరడును కల్కం చేసి పట్టు వేసుకుంటే వరిబీజం తగ్గుతుంది. జిల్లేడు ఆకులకు ఆముదం రాసి, వెచ్చజేసి, కాపడం పెట్టుకున్నా, పైన వేసి కట్టుకున్నా మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. 

జిల్లేడు పువ్వులను ముద్దగా నూరి కట్టు కట్టు కున్నా నొప్పులు తగ్గుతాయి. జిల్లేడు పూలను ఎండించి, మెత్తగా చూర్ణం చేసి, కలకండలో కలిపి తీసుకుంటే గనేరియా వ్యాధి తగ్గుతుంది.

జిల్లేడు ఆకులకు ఆముదం రాసి వెచ్చ జేసి మొలల మీద కట్టుకుంటే మొలలు హరిస్తాయి.


జిల్లేడులో రెండు రకాలు గలవు. 

1. ఎర్ర జిల్లేడు.

2. తెల్ల జిల్లేడు.


1.ఎర్ర జిల్లేడు :  



ఎర్ర జిల్లేడు ఆకులో ఆయుర్వేదిక్ మందుల్లో వివిధ రకములైన తయారీలో వాడుతారు. వాంతులు,చర్మసంభధిత వ్యాధులలో , కషాయంమూల తయారీలో , వాత , పిత్త దోష వ్యాధులలో కూడా వినియోగిస్తున్నారు .  మలేరియా , కీళ్ల నొప్పులు , చెవుల సంభందిత వ్యాధులలో కుడా ఉపయోగిస్తారు.


తెల్లజిల్లేడు :



తెల్ల జిల్లేడును 'శ్వేతార్కం' అంటారు. వృక్షజాతిలో ఈ తెల్ల జిల్లేడు విశిష్టమైంది. తెల్ల జిల్లేడు వేళ్ళ మీద గణపతి నివసిస్తాడని హిందువుల విశ్వాసం. ఈ వేళ్ళు కొన్ని సార్లు ఆకృతిలో సైతం గణేశుని పోలి ఉంటాయి. ఈ విధంగా ఉన్న వేళ్ళను స్వయంభూ శ్వేతార్క గణపతి అని వ్యవహరిస్తారు.  



ఈ తెల్ల జిల్లేడును దొరికించుకుంటే మహాశివుడు, విఘ్నాదిపతుల దయ మనమీద ప్రసరిస్తుందట. తెల్ల జిల్లేడు వేళ్ళ మీద గణపతి నివసిస్తాడు. తెల్ల జిల్లేడు దూదితో దీపాలను వెలిగించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.ఈ వేళ్ళు కొన్నిసార్లు ఆకృతిలో సైతం గణేశుని పోలి ఉంటాయి. అందుకే చాలామంది తెల్ల జిల్లేడును పరమ పవిత్రంగా భావించి, తులసి మొక్కలా ఇంట్లో నాటుతారు. ఈ మొక్క గనుక ఉంటే ధన ధాన్యాలు పుష్కలంగా లభిస్తాయట. ఆలోచనల్లో పరిపక్వత వస్తుందని, ఎవరైనా హాని తలపెట్టినా అలాంటివి దుష్ప్రభావం చూపకుండా, వారి ప్రయోగాలే నశిస్తాయని ప్రతీతి. ఇళ్ళలో జిల్లేడు మొక్కలు ఉండకూడదు అనేది ఒక అపోహ మాత్రమే. నిజానికి శ్వేతార్కం లేదా తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి దారిద్ర్యం అంటే ఏమిటో తెలీదట.


•తెల్లజిల్లేడు  పువ్వుతో శివుడిని ఆరాధించేటప్పుడు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చేసిన పాపాలు క్షమించబడతాయి.



అర్క పత్రి వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు ఇరవయ్యవది.


దీర్ఘకాలిక ఆస్తమా దగ్గుటకు :

తెల్ల జిల్లేడు పువ్వులు పూర్తిగా ఎండబెట్టి, మొత్తం 15 గ్రాముల బరువున్న పౌడర్‌గా తయారుచేయాలి, 100 గ్రాముల బెల్లం (తెలుగులో బెల్లాం) తో 10 గ్రాముల వాం (తెలుగులో) పొడితో కలపాలి. 5 గ్రాముల మాత్రలు తయారుచేసి ఎండబెట్టాలి.రోజుకు ఒక మాత్ర లేదా రెండు తప్పనిసరిగా 40 రోజులు నీరు లేదా ఆవు పాలతో తీసుకోవాలి. తరువాత దీర్ఘకాలిక ఆస్తమా నయమవుతుంది. ఆయుర్వేదంలోని పుస్తకాలలో వ్రాయబడింది.




ప్రయోజనాలు


• పాము కరిస్తే విషప్రభావం తగ్గించడానికి దీని ఆకులు నమిలిస్తారు. దీని వేరు నుంచి తీసిన రసాన్ని పాము కాటేసిన చోట వేస్తారు.

దీని ఆకుల నుంచి తీసిన రసాన్ని తేనెలో కలిపి త్రాగితే జ్వరం తగ్గిపోతుంది.

దీని రసం త్రాగితే కడుపులో ఉండే నులి పురుగులు చనిపోతాయి.

ప్రేవులలో ఉండే పుండ్లు (ULCER) తగ్గడానికి దీని ఆకులను ఎండబెట్టి పొడిచేసి పాలలో కలిపి తాగిస్తారు.

దీని రసం విరేచనం అవడానికి మలబద్దకం పోవడానికి వాడుతుంటారు.

కీళ్లనొప్పులు పోవడానికి వీటి ఆకుల నుండి వచ్చే పాలను పూస్తారు.

నరాల బలహీనతకు, అస్థమాకి, రక్తప్రసరణకి మరియు చర్మవ్యాధులకు కూడా ఇది ఉపయోగపడుతుంది.



జిల్లేడు ఆకుల పాలు కళ్లలో పడకుండా జాగ్రత్త వహించాలి. అలాగే, బాలింతలు ఈ ప్రయోగానికి దూరంగా ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.


No comments:

Post a Comment

🌱 ఆయుర్వేదం - శతావరి

ఆయుర్వేదవైద్యం లో పేర్కొన్న పురాతనమైన మూలికలలో ‘ శతావరి ’ ఒకటి. శతావరి గురించిన ప్రస్తావనలు భారతదేశపు అత్యంత పురాతన వైద్య గ్రంధా...