మారేడు ఆధ్యాత్మికంగానూ, ఔషధగుణాలపరంగానూ ఈ వృక్షానికి ఎంతో ప్రత్యేకత ఉంది. మారేడు లేదా బిల్వము (Bael). ఈ కుటుంబము లోనికి చెందినదే 'వెలగ' కూడాను. ఈ బిల్వపత్రి పత్రి బిల్వ వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రపూజ క్రమములో ఈ ఆకు రెండవది.
శివుని పూజలో పువ్వులతో పాటు కొన్ని ఆకులను ఉపయోగిస్తారు. వాటిలో బిల్వపత్రం (మారేడాకు) ప్రధానమైంది. బిల్వ ఆకులతో పూజ శ్రేష్టమైనది. ఇక పవిత్ర వృక్షాల్లో ఒకటి. శివునికి ప్రీతికరమైన ఈ మారేడు ఆకులతో శివపూజ చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. మారేడు దళం మూడు భాగాల్లో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శివుడు కొలువుంటారు. మారేడు దళం ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తికి సంకేతం. ఇవి మూడు శివ స్వరూపం.
మారేడు ఆకులు సుగంధ భరితంగా ఏదో దివ్యానుభూతిని కలుగజేస్తూ ఉంటాయి. దీని పువ్వులు ఆకుపచ్చ రంగుతో కూడిన తెలుపు రంగులో ఉండి, కమ్మని వాసనని కలిగి ఉంటాయి. మారేడు కాయలు గట్టిగా ఉంటాయి. విత్తనాలు చాలా ఉంటాయి. మారేడు గుజ్జు కూడా సువాసనగా ఉంటుంది.
మారేడు పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది. ఇది అతిసార వ్యాధికి, మొలలకు, చక్కెర వ్యాధి రోగాల నివారణకు ఉపయోగపడుతుంది. మారేడు ఆకులలో, పళ్లలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. మారేడు ఆకులలో ఖనిజాలు, విటమినులు, చాలా ఉంటాయి. కాల్షియం, ఫాస్పరస్, ఇనుము, కెరోటిన్, బి-విటమిన్, సి-విటమిను ముఖ్యమైనవి.
బిల్వపత్రాలు గాలిని, నీటిని శుభ్రపరుస్తాయి. ఈ చెట్టు నుంచి వచ్చే గాలి శరీరానికి సోకడం ద్వారా ఆరోగ్యానికి మేలే జరుగుతుంది. జబ్బులు అంటవు. అంతర కణాలకు మంచిది.
దేహాన్ని శ్రేష్ఠంగా వుంచుతుంది. బిల్వ పత్రాలను నూరి రసం తీసి.. శరీరానికి పూసుకుంటే చెమట వాసన రాదు. మారేడు వేరు రసం తీసి, తేనెతో రంగరించి తాగితే వాంతులు వెంటనే తగ్గుతాయి. ఈ రసాన్ని రోజూ సేవిస్తే అనారోగ్యాలు దరిచేరవు. బిల్వపత్రాలను దంచి కళ్లపై లేపనంగా వేసుకుంటే కంటి దోషాలు ఏమైనా వుంటే నశిస్తాయి. బిల్వ చూర్ణం అతిసారాన్ని తగ్గిస్తుంది.
☆ మారేడు లో అన్ని భాగాలు ఔషధ గుణాలు :
మారేడు పండ్లు, కాయలు, బెరడు, వేళ్ళు, ఆకులు, పూవులు ఆన్నీ కూడా ఔషధములుగా ఉపయోగపడతాయి. బిల్వ వృక్షములో ప్రతి భాగము మానవాళికి మేలు చేసేదే.
• మారేడుదళము గాలిని, నీటిని దోషరహితము చేస్తుంది. ఉపయోగాలు
• మారేడు పండ్లు, కాయలు, బెరడు, వేళ్ళు, ఆకులు, పూవులు ఆన్నీ కూడా ఔషధములుగా ఉపయోగపడతాయి.
• అతిసార వ్యాధికి దీని పండ్ల రసం చాలా మంచి మందు.
• ఆయుర్వేదములో వాడు దశమూలము లలో దీని వేరు ఒకటి.
• మొలలకు ఇది మంచి ఔషధము.
• దీని ఆకుల రసము చక్కెర వ్యాధి నివారణకు చాలా మంచిది.
• బిల్వ ఆకులు జ్వరాన్ని తగ్గిస్తాయి . . . బిల్వ ఆకుల కషాయము తీసి అవసరము మేరకు కొంచం తేనె చుక్కలు కలిపి తాగితే జ్వరము తగ్గుతుంది .
• కడుపు లోను, పేగుల లోని పుండ్లు తగ్గించే శక్తి బిల్వ ఆకులకు, ఫలాలకు ఉన్నది,
• మలేరియాను తగ్గించే గుణము బిల్వ ఆకులకు, ఫలాలకు ఉన్నది,
• బిల్వ ఫలం నుండి రసం తీసి దానికి కొద్దిగా అల్లం రసం కలిపి తాగితే రక్తసంబంధిత ఇబ్బందులనుండి ఉపశమనం కలుగుతుంది .
• బిల్వ వేరు, బెరడు, ఆకులను ముద్దగా నూరి గాయాల మీద అద్దితే త్వరగా మానుతాయి.
• క్రిమి, కీటకాల విషానికి విరుగుడుగా పనిచేస్తుంది .
* మారేడు ఉపయోగాలు :
• మారేడు పండ్లు, కాయలు, బెరడు, వేళ్ళు, ఆకులు, పూవులు ఆన్నీ కూడా ఔషధములుగా ఉపయోగపడతాయి. అతిసార వ్యాధికి దీని పండ్ల రసాయనం చాలా మంచి మందు. ఆయుర్వేదములో వాడు దశమూలము లలో దీని వేరు ఒకటి. మొలలకు ఇది మంచి ఔషధము. దీని ఆకుల రసము చక్కెర వ్యాధి నివారణకు చాలా మంచిది.
• మారేడు పండ్ల వాసన చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దీనిని శరీరానికి చల్లదనాన్నిచ్చే గుణం ఉంది. అలాగే విరేచనకారిగా కూడా పనిచేస్తుంది.
• సగం పండిన పండు జీర్ణ శక్తిని పెంచుతుంది. బాగా పండిన పండులోని గుజ్జు రోజూ తింటే దీర్ఘకాలికంగా మలబద్ధ సమస్యతో సతమతమయ్యే వారికి ఎంతో ఉపయోగపడుతుంది.
• మారేడు గుజ్జుని పాలు, పంచదారతో కలిపి తీసుకుంటే వేసవి పానీయంగా కూడా బావుంటుంది. ప్రేవులను శుభ్రపరచడమే కాకుండా, వాటిని శక్తివంతంగా కూడా తయారుచేస్తుంది.
• మారేడులో ఉన్న విచిత్రం ఏమిటంటే బాగా పండిన పండు విరేచనకారిగా ఉపయోగపడితే, సగంపండిన పండు విరేచనాలు ఆగటానికి ఉపయోగపడుతుంది.
• జిగురు విరేచనాలవుతున్నా సగం పండిన మారేడు పండు ఎంతో ఉపకరిస్తుంది.
• విరేచనాలు తగ్గడానికి గుజ్జుగా కంటే ఎండబెట్టి, పొడుముగా చేసినది బాగా ఉపకరిస్తుంది.
• మారేడు ఆకుల కషాయాన్ని కాచుకుని తాగితే హైపవర్ ఎసిడిటీ లాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి.
• మారేడు ఆకుల కషాయాన్ని నువ్వుల నూనెతో కలిపి కాచి, దానిని తలస్నానానికి ముందుగా రాసుకుంటే తలస్నానం చేసిన తర్వాత జలుబు, తుమ్ములు వచ్చేవారికి బాగా ఉపయోగపడుతుంది.
☆ మారేడుతో ఉన్న ఇతర ఉపయోగాలు :
1. మారేడు పండ్ల వాసన చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దీనిని శరీరానికి చల్లదనాన్నిచ్చే గుణం ఉంది. అలాగే విరేచనకారిగా కూడా పనిచేస్తుంది.
2. సగం పండిన పండు జీర్ణ శక్తిని పెంచుతుంది. బాగా పండిన పండులోని గుజ్జు రోజూ తింటే దీర్ఘకాలికంగా మలబద్ధ సమస్యతో సతమతమయ్యే వారికి ఎంతో ఉపయోగపడుతుంది.
3. విరేచనాలు తగ్గడానికి గుజ్జుగా కంటే ఎండబెట్టి, పొడుముగా చేసినది బాగా ఉపకరిస్తుంది.
No comments:
Post a Comment