Friday, October 2, 2020

🌱 ఆయుర్వేదం - కలబంద



అలోవెరా” గా పిలువబడే కలబంద గొప్ప ఔషధగుణాలు గల్గిన మొక్క లేక మూలిక. దీన్నే “మంచి కలబంద”గా కూడా వ్యవహరిస్తారు. ప్రపంచంలోని ప్రతి ఇంటా కనిపించే ఈ కలబంద మొక్క అంతటి ప్రసిద్ధిని పొందడానికి ఇదో గొప్ప ఆహారపదార్థం కావడమే కారణం. అనేకమందికి సౌందర్య రహస్యంగా ఉపయోగపడుతున్న "మిస్టరీ ప్లాంట్" లేక “అద్భుత మొక్క” కలబంద. వాస్తవానికి, ఇది భారతదేశంలో “ఘ్రిత్కుమారి” అని కూడా ప్రసిద్ది చెందింది. ఆయుర్వేద పరిశోధకుల ప్రకారం, సంస్కృతంలో దీనిని "కుమారి" అని పిలుస్తారు, ఎందుకంటే స్త్రీలకు ఇది వారి ఋతుచక్ర క్రమబద్దీకరణకు మరియు దోషరహిత చర్మం పొందడానికి ఎంతో ఉపకరిస్తుంది గనుక. మీరు గమనించే ఉంటారు కలబంద ఆకులు ఎప్పుడూ తాజాగానే గోచరిస్తుంది . అందుకే దోషరహితమైన చర్మానికిదో కానుక అని ఆయుర్వేద పరిశోధకులంటారు. అది ఆయుర్వేదం కావచ్చు లేదా మరేదైనా పాశ్చాత్య వైద్యపధ్ధతి అయినా కావచ్చు, ఆయా  సంప్రదాయిక ఔషధ-వైద్య పద్ధతుల్లో కలబందకు విశిష్ఠ స్థానం ఉంది.



రసం, కండపుష్టి దండిగా కల్గిన మొక్క కలబంద. చాలా దళసరిగా, గుజ్జును కల్గి ఉండే తన ఆకులను మరియు కాండాన్ని కలబంద నీటిని నిల్వ చేసుకునేటందుకు ఉపయోగిస్తుంది. కలబంద ఒక ఆసక్తికరమైన మొక్క. లేతగా రసపుష్టిని (టెండర్, జ్యుసి) కల్గి ఉంటుందిది. ఆయుర్వేదంలో, ముఖ్యముగా పేగులు మరియు కాలేయ ఆరోగ్యానికి సంబంధించి, కలబంద యొక్క ప్రయోజనకర ప్రభావాలను ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది.కలబందను కుష్టు వ్యాధికి వ్రణాలచికిత్సలో ఉపయోగించవచ్చు. కలబంద యొక్క ప్రఖ్యాత  నామమైన “అలోవెరా” అరబిక్ శబ్దం, “అల్లొహ్” నుండి వచ్చింది. అల్లొహ్ అంటే “మెరిసే చేదు పదార్ధం” అని అర్థం. “వెరా” అనేది లాటిన్ పదం. “వెరా” కు అర్థం ‘నిజం’ అని.


కలబంద యొక్క ఆరోగ్య ప్రయోజనాలు– 




ఆరోగ్యకరమైన చర్మం కోసం ఒక నమ్మకమైన  ఔషధం కోసం చూస్తున్నట్లయితే, సహజ రూపంలో ఉండే  కలబంద జెల్లీని ఉపయోగించడం ఎంతో మంచిది.
ప్రేగు వాపు వ్యాధిలో కలబంద ఉపయోగకరంగా ఉంటుందని కనుగొనబడింది. అదనంగా, మలబద్దకాన్ని చికిత్స చేయడానికి కలబంద గుజ్జును తినడం మంచిదని సూచించబడింది, ఎందుకంటే ఇది చాలా మంచి భేదిమందు.
ఆరోగ్యకరమైన మరియు మెరిసే చర్మం వలెనే దంతారోగ్యంతో కూడిన నోటి పరిశుభ్రత కూడా చాలా ముఖ్యం. యాంటిబయోటిక్ మందులక్కూడా లొంగని నోటి వ్యాధుల పెరుగుదలతో మంచి నోటి పరిశుభ్రతను నిర్వహించడానికి కలబంద ఒక సహజ ప్రత్యామ్నాయం.
కలబందలో  అనామ్లజని మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. క్రిమికారకాల వలన వచ్చే చర్మ వ్యాధులతో పోరాడటానికి కలబంద సహాయపడుతుంది.
కలబందలోని ఔషధగుణాలు రక్తంలోని చక్కర స్థాయిల్ని గణనీయంగా తగ్గించి మధుమేహ రోగులకు మేలు చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.
కలబందలో ఉండే తేమ గుణాలు కేవలం చర్మ ప్రయోజనాలకే కాక నుదురు మరియు వెంట్రుకలకి కూడా మేలును చేకూరుస్తాయి .

మెరిసే చర్మసౌందర్యానికి కలబంద జెల్లీ : - 

సహజంగా తయారు చేసుకున్న కలబంద జెల్లీ ఎటువంటి దుష్ప్రభావాలనూ కల్గించదు.  దిననిత్యం తినే మీ ఆహారంలో కలబందను కూడా కలిపి తీసుకుంటే చర్మంపై దద్దుర్లతో కూడిన మార్కులు (rashes),  అకాలంగా దాపురించే వృద్ధాప్య చిహ్నాలు మటుమాయం అవుతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కలబందను చర్మలేపనంగా ఉపయోగించినప్పుడు, దీనికి సహజమైన తేమగుణం ఉండడం చేత చర్మంపై తన ఉద్దీపనాప్రభావం చూపిస్తుంది. కలబంద చర్మాన్ని ఎండిపోనీయదు, తేమను కల్పిస్తుంది. అలా తేమతో కూడిన చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది. మరి ఇలాంటి చర్మాన్నే గదా అందరూ కోరుకునేది.  కలబందను నిత్యం, నిరంతరం ఉపయోగించడం వల్ల అది చర్మాన్ని ఎల్లప్పుడూ చెమ్మపూరితంగా ఉండేట్జు చేసి చర్మ కణాలు వేగంగా పెరగడానికి తోడ్పడుతుంది. పెరిగిన చర్మకణాల కారణంగా చర్మం యొక్క స్థితిస్థాపకత  మెరుగుపడుతుంది.
కలబంద జెల్లీ వృద్ధాప్య-వ్యతిరేక కార్యకలాపాలకు (anti-aging activities)  మాత్రమే కాకుండా, మరెన్నో ప్రయోజనాలను కూడా కలిగి ఉంది.


• కలబంద గాయాలను త్వరగా మాన్పుతుంది: 

కలబంద హార్మోన్లు కొత్త చర్మం పునరుత్పత్తికి మరియు గాయం మానేందుకు సహాయపడే “ఫైబ్రోబ్లాస్టుల”నబడే చర్మ కణాలతో మిళితమై గాయం/పుండు చుట్టూ కొత్త చర్మ కణాలు పెరిగేందుకు తోడ్పడతాయి. కలబంద యొక్క పైపూత పదార్థాలు మరియు లోనికి పుచ్చుకునే ఔషధ, పానీయాది రూపాల్లో కూడా ఈ మానిపే (healing) లక్షణాలు సమానంగా ఉన్నాయని అధ్యయనాలు కనుగొన్నాయి. 

కాలిన బొబ్బల్ని నయం చేయడంలో కలబంద  ప్రభావశాలి: 

 కాలిన బొబ్బలు (first and second degree burns), ఎండతీవ్రత వల్ల ఏర్పడిన దద్దుర్లు, కాలిన గాయాల (బర్న్స్) చికిత్స కోసం ఆయుర్వేద వైద్యులు కలబంద జెల్లీని సూచిస్తున్నారు. కలబంద జెల్లీని సాధారణంగా ప్రభావిత ప్రాంతాల్లో, అంటే కాలిన బొబ్బలపైనా, గాయాలపైనా నేరుగా పూయడం ద్వారా వాడబడుతోంది. 

ఎండకు కమిలిన చర్మానికి ఔషధము: 

 ఎండకు కమిలిన చర్మం లేదా బొబ్బలేర్పడ్డపుడు ఎవరికైనా తటాలున గుర్తుకొచ్చే మొట్టమొదటి గృహచిట్కా మందు బహుశా కలబందేనని చెప్పచ్చు. ఇప్పటికే పేర్కొన్న చర్మ-సంబంధమైన   వైద్యప్రయోజనాలే కాకుండా, కలబంద జెల్లీ పైపూత వల్ల ఎండతీవ్రత కారణంగా కలిగే బొబ్బలు, చర్మం కమిలిపోవడానికి తక్షణ ఉపశమనకారిగా పని చేస్తుంది. పైగా దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు.

కలబంద రేడియోధార్మికత యొక్క దుష్ప్రభావాలను తగ్గిస్తుంది: 

కీమోథెరపీ రోగులలో రేడియో ధార్మికతకు సంబంధించిన చికిత్స కోసం అలోయి వేరా ప్రభావవంతంగా ఉపయోగించగలదని రోగి సర్వే-ఆధారిత ఆధారాలు చెబుతున్నాయి. 
కడుపులో వచ్చే అంటువ్యాధులు మరియు మలబద్ధకానికి – 
 ప్రేగు ఇన్ఫ్లమేటరీ  వ్యాధి (IBS) చికిత్సకు అలోయి వేరా యొక్క ప్రభావాన్ని అంచనా వేయడానికి ఇటీవల జరిపిన ఒక అధ్యయనం జరిగింది, ఇది చికిత్స చేసిన ఎర్రబడిన ప్రేగుల వ్యాధులలో కలబంద వేరా ఉపయోగకరంగా ఉంటుందని కనుగొనబడింది. అదనంగా, ఇది మలవిసర్జనకు చికిత్స చేయడానికి కలబంద రబ్బరును తినడానికి సూచించబడింది ఎందుకంటే ఇది చాలా మంచి భేదిమందు. 



ఆరోగ్యకరమైన చిగుళ్ళు మరియు దంతాల కోసం : - 

మంచి ఆరోగ్యకరమైన చిగుళ్ళు మరియు బలమైన పళ్ళు కలిగి ఉండాలని మనందరం కోరుకుంటాం. ఆరోగ్యకరమైన మరియు మెరిసే చర్మం వలెనే దంతారోగ్యంతో కూడిన నోటి పరిశుభ్రత కూడా చాలా ముఖ్యం. యాంటిబయోటిక్ మందులక్కూడా లొంగని నోటి వ్యాధుల పెరుగుదలతో మంచి నోటి పరిశుభ్రతను నిర్వహించకలబంద డానికి సహజ ప్రత్యామ్నాయం అవసరం. ఏవైనా దుష్ప్రభావాలు లేకుండా దంతఫలకాలు మరియు జింజివైటిస్ తగ్గించడంలో జెల్ చాలా ప్రభావవంతమైనదని ఆయుర్వేదలో ఇటీవల జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు పేర్కొన్నాయి. నోటి సమస్యలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపడం ద్వారా ఇది జరుగుతుంది. అదనంగా, కలబంద జెల్లీని పూయడం వల్ల కూడా నోటి పూతలను వేగంగా మరియు సమర్థవంతంగా నయం చేసుకోవచ్చు.

అనామ్లజని మరియు యాంటీ బాక్టీరియల్  : - 

కలబందలో  అనామ్లజని మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు  కలిగి ఉంది. క్రిమికారకాలతో వచ్చే చర్మ వ్యాధులతో పోరాడటానికి కలబంద సహాయపడుతుంది. సంప్రదాయకంగా, మొటిమలు, చుండ్రు మరియు ఇతర సాధారణ బాక్టీరియాకారక చర్మ వ్యాధుల చికిత్సలో కలబండను ఉపయోగిస్తారు. 

మధుమేహం(చక్కెరవ్యాధికి) :-
 
చక్కెరవ్యాధి రోగులు కలబంద రాసా న్ని(juice) సేవించడం వల్ల వారిలోని చక్కర స్థాయిలు గణనీయంగా తగ్గినట్లు పరిశోధనలు తేల్చాయి. 

కేశవర్ధినిగా(జుట్టు ఆరోగ్యానికి) :- 
కలబందలో ఉండే తేమ ప్రభావాలు కేవలం చర్మ ప్రయోజనాలకే కాక తలపై చర్మానికి మరియు వెంట్రుకలకి కూడా మేలును చేకూరుస్తుంది. దీన్ని కేశవర్ధినిగా (హెయిర్ కండీషనర్గా) ఉపయోగించినప్పుడు ఇది జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి సహాయపడుతుంది. తలమీది చర్మం యొక్క ఆరోగ్యాన్ని కాపాడి జుట్టు రాలిపోకుండా జుట్టుకు మెరుపును, నాజూకుతనాన్ని తెచ్చి పెడుతుంది. కలబంద విటమిన్లు మరియు ఫేనకద్రవాల్ని (ఎంజైమ్లను) పుష్కలంగా కల్గి ఉంది. జుట్టు కుదుళ్లను బలపరిచి వెంట్రుకలు వేగంగా పెరిగేందుకు తోడ్పడుతుంది.

కలబంద జెల్ మరియు కలబందసారంలో సోమం లేదా సెలీనియం (selenium), జింకు ఖనిజాలు, విటమిన్లు, రసాయనిక ఆమ్లద్రవాలు వంటి అనామ్లీకరణ పదార్థాలుండడం చేత శరీరంలో గడ్డలు కట్టడానికి దోహదం చేసే కణాల పెరుగుదలను వేగంగా పెరక్కుండా (as an antitumor medicine) అడ్డుకుంటాయి. 

కొవ్వును (కొలెస్ట్రాల్) తగ్గించడానికి : 

మన శరీరంలో రక్తంలో చోటు చేసుకునే తక్కువ-సాంద్రత కొలెస్ట్రాల్ (LDL) లేదా చెడు కొలెస్ట్రాల్ను కలబంద తగ్గిస్తుందని, శరీరంలో "మంచి" లేదా అధిక సాంద్రత కలిగిన కొలెస్ట్రాల్ (HDL) ను పెంచుతుందని దీనిపై నిర్వహించిన విస్తృతమైన పరిశోధన తేల్చి చెబుతున్నాయి.  రక్తంలో చెడ్డ కొలెస్ట్రాల్ ను తొలగించి అథెరోస్క్లెరోసిస్ (ధమనులలో రక్తప్రసారానికి అవరోధమయ్యే కొవ్వు నిల్వలు) వంటి వ్యాధులను కలబంద అరికట్టి ఆరోగ్యకరమైన హృదయాన్ని ప్రోత్సహిస్తుంది. రక్తంలో తక్కువ సాంద్రత కల్గి ఉండే LDL కొలెస్ట్రాల్ (చెడు కొలెస్ట్రాల్) కారణంగా మన శరీరం సులభంగా బరువును కోల్పోవటానికి దారి తీస్తుంది. 


కలబంద మొక్కను ఉపయోగిస్తున్న రీతులు


కలబంద విస్తృతమైన ఉపయోగాలను కలిగి ఉంది, కానీ దీన్ని ముఖ్యంగా చర్మసౌందర్యానికి, చర్మంవ్యాధులకు  మరియు పేగు-సంబంధ ప్రయోజనాలకు ఉపయోగించడం జరుగుతోంది.
కలబంద నుండి రెండు ప్రధాన పదార్థాలను పొందుతున్నాం:

జెల్: దళసరిగా ఉండే కలబంద ఆకు లోపలి భాగం నుండి పొందే వాసన లేని పదార్ధం. స్పష్టమైన పారదర్శకతను కల్గి ఉంటుందిది.  

లేటెక్స్ లేదా జ్యూస్ (రబ్బరులా సాగేటువంటి జిగట రసం): ఆకు యొక్క బయటి భాగం నుండి పొందిన పసుపు పదార్ధం.





ఇంట్లోనే కలబంద జెల్లీని తయారు చేయడం :-


కలబంద జెల్లీని ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేయవచ్చు. కలబంద మొక్క నుండి ఒక ఆకును కట్ చేసి ఇపుడు ఒక గిన్నెలో కత్తిరించిన కలబంద ఆకు (కత్తిరించిన భాగం కిందికి ఉండేలా చూసుకుని)ను ఉంచండి. దళసరిగా ఉండే  కత్తిరించిన కలబంద ఆకునుండి పసుపురంగు ద్రవం గిన్నెలోకి స్రవించడం ప్రారంభిస్తుంది. ఆకు నుండి ద్రవం కారడం ఆగిన తర్వాత ఆకును కడగాలి. కడిగిన కలబంద ఆకుపైన ఉండే తొక్కను (పైపోర) ఓ కత్తితో తీసేయండి. ఇపుడు మీకు స్పష్టమైన, పారదర్శకతతో కూడిన కలబంద జెల్లీ/జెల్ సిద్ధమైంది. మీరు దీన్ని వెంటనే ఉపయోగించుకోవచ్చు లేదా తదుపరి  వినియోగానికి ఫ్రీజర్లో భద్రపరచనూవచ్చు. ఈ జెల్ ఫ్రీజర్లో ఒక వారం వరకు ఉంటుంది.


కలబంద మోతాదు

కలబంద జెల్లీని నొప్పి లేదా పుండ్లున్న చోట్లలో ఎవరైనా సరే పైపూతగా పూయవచ్చు. దీనివల్ల ఎక్కువ దుష్ప్రభావాలు సామాన్యంగా ఉండవు. చర్మలేపనంగా ఉపయోగించే కలబంద క్రీములు, లోషన్లు మరియు ద్రవాహారంగా  తీసుకునే కలబంద పానీయాలు మొదలైనవాటి మోతాదు ఆయా ఉత్పత్తిలో కలబంద ఎంత ప్రమాణంలో (quantity) ఉందన్న దానిపై ఆధారపడి ఉంతుంది. కలబంద రసం లేదా పానీయం విషయానికొస్తే, సాధారణంగా, రోజువారీగా ఒక ఔన్స్ లేదా రెండు టేబుల్ స్పూన్లు మోతాదును కడుపులోకి పుచ్చుకోవడం సురక్షితమైందిగా భావిస్తారు. అయితే కలబందను పుచ్చుకునేవారి వయస్సు, లింగం మరియు వారి ఒంటి లక్షణాలు వంటి కారకాల మీద కూడా కలబంద మోతాదు ఆధారపడి ఉంటుంది. కాబట్టి, మీ ఆహారంతో పాటుగా కలబందను కూడా సేవించాలనుకునేందుకు ముందుగా, లేదా కలబంద లేపనాదుల్ని ఉపయోగించేందుకు ముందు అర్హుడైన ఆయుర్వేద వైద్యుడ్ని అడిగి సలహా సంప్రదింపులు తీసుకోవడం ఉత్తమం.


కలబంద దుష్ప్రభావాలు : -



కలబందలో ఉండే రబ్బరులాంటి గుజ్జును నిరంతరంగా సేవించడం జీర్ణశయాంతర సమస్యలకు (gastrointestinal problems)   కారణమవుతుంది.

కలబందను వాడే విషయంలో కొంతమంది చాలా సున్నితంగా ఉంటారు, అలాంటివారు కలబందను ఏరూపంలోనైనా సరే తీసుకోవటానికి ముందు వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవడం ఉత్తమం.
కలబంద జెల్లీని 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు లోనికి సేవించేందుకు ఇవ్వకూడదు, ఎందుకంటే అది పొట్టలో అసౌకర్యం కలుగజేసి అతిసారానికి కారణమవుతుంది.
గర్భిణీ స్త్రీలకు కలబందసేవనం సురక్షితం కాదు. ఎందుకంటే కలబందను సేవించిన కారణంగా గర్భస్రావాలు సంభవించినట్లు రిపోర్టులు ఉన్నాయి.
ఎండలోకి బయలుదేరివెళ్లే ముందు కలబంద జెల్లీని ముఖలేపనాదులకు వాడటం మూలంగా  దద్దుర్లు ఏర్పడడం, చర్మం కమిలిపోవడం (సన్ బర్న్స్) జరగొచ్చు.
మీరు ఇప్పటికే కొన్ని సూచించిన మందులను వాడుతూ ఉంటే గనుక మీ ఆహారంలో కలబందను కూడా జోడించి తినాలనుకుంటున్నట్లైన, ముందుగా వైద్య నిపుణుడి సలహా పొందండి. ఎందుకంటే ఇది ఇప్పటికే మీరు తీసుకుంటున్న ఔషధాల ప్రభావానికి అంతరాయం కలిగించే అవకాశయముంది.


No comments:

Post a Comment

🌱 ఆయుర్వేదం - శతావరి

ఆయుర్వేదవైద్యం లో పేర్కొన్న పురాతనమైన మూలికలలో ‘ శతావరి ’ ఒకటి. శతావరి గురించిన ప్రస్తావనలు భారతదేశపు అత్యంత పురాతన వైద్య గ్రంధా...