Monday, October 26, 2020

🌱 ఆయుర్వేదం - వాము


వాము లేదా ఓమను సంస్కృతంలో దీప్యక అని, హిందీలో అజ్వైన్ అని అంటారు. ఇoగ్లీషులో బిషప్ సీడ్స్ అనీ, థైమాల్ సీడ్స్ అనీ పిలుస్తారు.దీని శాస్త్రీయ నామము ట్రాకీస్పెర్మమ్ కాప్టికమ్. ఇది ఈజిప్టులో పుట్టిoదని, అతి ప్రాచీనకాలoలోనే భారత ఉపఖoడoలోనూ, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లలోనూ. ఇటలీ రోములలోనూ బాగా వ్యాప్తి చెoదిoదని చరిత్రకారుల అభిప్రాయo.


వాము  లోoచి తీసిన సారాన్ని  థైమాల్ అoటారు. మనo వాoపువ్వు అoటాo. వాoపువ్వు పెద్ద కిరాణా దుకాణాల్లో దొరుకుతుoది. పావుగ్లాసు  నీళ్ళలో  రెoడు పలుకులు  వాoపువ్వు  వేసుకొని తాగితే  సరిపోతుoది. జీర్ణశక్తి  పెoచుతుoది. కడుపులో నులినొప్పి, గ్యాసు తగ్గిపోతాయి. అజీర్తి విరేచనాలు, నీళ్ళవిరేచనాలు తగ్గుతాయి. పళ్ళకు, చిగుళ్లకు దీనిని పట్టిస్తే చిగుళ్ళు గట్టిపడతాయి. పoటిపోటు తగ్గుతుoది.  




వాము నూనెని మనమే తయారు చేసుకోవచ్చు, వాముని  నీళ్ళలో  వేసి మరిగిoచి,  చిక్కని  కషాయo కాచి  వడగడతారు.  దానికి సమానoగా మ౦చి  నువ్వులనూనెని కలిపి,  నీరoతా  ఆవిరయి, నూనె మాత్రమే మిగిలేవరకూ  మళ్ళీ మరిగిస్తే అదే వాము నూనె! కీళ్ళనొప్పులలో ఇది అమోఘoగా  పని చేస్తుoది. అన్నoలో కూడా కొన్ని రక్జాల కూరలు పచ్చళ్ళలో వేసుకొని తినవచ్చు. ఈ  నూనెలో  కొద్దిగా ముద్దకర్పూరo కలిపితే  దాన్ని కర్పూర తైలo అని  పిలుస్తారు. ఈ తైలాన్ని నొప్పి, వాపులున్న చోట పట్టిoచి ఉప్పు కాపు  పెడితే  నొప్పులు తగ్గుతాయి.


వాము వంటలలో ఉపయోగించే ఒక విధమైన గింజలు. వాము మొక్క మొత్తం సువాసన కలిగి ఉంటుంది. పువ్వులు గుత్తులు గుత్తులుగా ఉంటాయి. ఈ పువ్వులనుంచే విత్తులు వస్తాయి. వాము సాధారణంగా అన్ని ఇళ్లల్లో కనిపించేదే. వంటింట్లో ఇదో దినుసు. వాము గింజల నుండివాము ఆవశ్యక నూనెను స్టీము డిస్టిలేసను ప్రక్రియ ద్వారా సంగ్రహిస్తారు. వాము మాత్రమే కాదు, వాము మొక్క ఆకులు కూడా మనకు అద్భుతంగా ఉపయోగపడతాయి.



వాము ఆకులతో బజ్జీలు మాత్రమే చేసుకుంటారని అనుకుంటారు చాలా మంది నిజానికి సాధారణ జలుబు నుంచి ఉపశమనం పొందడానికి ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. వాము ఆకులతో చేసే రసం పెరుగు పచ్చడి రుచితో పాటు అనేక పోషకాలనీ అందిస్తాయి. కొత్త ఆకులను తెంపి వాడుకోవచ్చు అలా మొక్కలను పెంచుతూ నే ఆకులను నెలల తరబడి వాడుకోవచ్చు.వాము ఆకుల నుంచి వచ్చే సువాసనతో ఇంటి పరిసరాలన్నీ ఆహ్లాదకరంగా మారుతాయి.దీన్ని మిగతా ఆకు కూరలు మాదిరిగానే అన్ని వంటకాల్లో వాడుకోవచ్చు.


 వాము భారతీయులకు తెలిసిన గొప్ప ఓషధి. దీనిని భారతదేశమంతటా పండిస్తారు. ఎక్కువగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంతో సహా మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సాగుచేస్తారు. చలి వాతావరణంలో బాగా పెరుగుతుంది. ఇది తెల్లని పూలు కలిగిన చిన్న ఏక వార్షికపు మొక్క. దీని గింజల నుంచి సుగంధ తైలాన్ని డిస్టిలేషన్ విధానం ద్వారా వేరుపరిచి థైమాల్‌గా మార్కెట్ చేస్తుంటారు. సాధారణంగా మనం వామును చక్రాలు(జంతికలు, మురుకులు) చేసినపుడు వాడుతుంటాం. పూర్వంనుండీ వాడుతున్నారని వాడటమే తప్ప ఇందులోని సుగుణాలు చాలామందికి తెలీవు. వాము జీర్ణశక్తికి మంచిదని మాత్రం చాలామందికి తెలుసు. వాము జీలకర్రలా అనిపించినా చిన్నగా వుంటుంది. రుచి కొంచెం ఘాటుగా, కారంగా వుంటుంది. వీటిని పప్పులు, కూరలు, రొట్టెలు, పరోటాలు లేదా వేయించిన పకోడిలలో కూడా వేసి రుచిని ఆరోగ్యాన్ని కలిగించవచ్చు. రూపంలో చిన్నదైనా చేసే మేలులో పెద్ద స్థానాన్నే ఆక్రమించింది.'  


 ☆ వాములో ఉండే ఔషధ గుణాలు :




 • వాంతులు: వామును నీళ్లలో నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి.

• జ్వరం: వాము, ధనియాలు, జీలకర్ర - ఈ మూడింటినీ దోరగా వేయించి కషాయం చేసి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది.

• అజీర్ణం: వాము, మిరియాలు, ఉప్పు సమభాగాలుగా తీసుకుని, చూర్ణం చేసి ప్రతిరోజూ భోజనానికి ముందు సేవిస్తుంటే అజీర్ణం, ఉదరశూల తగ్గుతాయి.

• దంత వ్యాధులు: వామును త్రిఫలాలనే కరక్కాయ, ఉసిరికాయ, తానికాయ లతో కలిపి ముద్దగా నూరి దంతాల మూలాలలో పెట్టుకుంటే అన్ని రకాలైన దంత వ్యాధులు తగ్గుతాయి.

• వాత వ్యాధులు: వాము నూనె అన్ని వాత వ్యాధులకు ఎంతో ఉపయోగకారి.

• గొంతులో బాధ: వామును బుగ్గన పెట్టుకుని నమిలి చప్పరిస్తూ రసాన్ని మింగితే గొంతులో నొప్పి, గొంతులో గురగుర శబ్దాలు తగ్గుతాయి.

• మూత్రాశయంలో రాళ్ళు: వామును వివిధ అనుపానాలతో సేవిస్తే మూత్రపిండాలలో, మూత్రాశయంలో ఏర్పడే రాళ్లను కరిగిస్తుంది. వాము, వెనిగార్‌ లేక తేనెతో కలిపి వారం తీసుకుంటే మూత్రపిండాలలో ఉన్న రాళ్లు మూత్రం ద్వారా వెళ్లిపోతాయని ఆయుర్వేదం చెబుతోంది.

• చనుబాలు వృద్ధి: ప్రసవానంతరం స్త్రీలు వామును వాడితే చనుబాలు వృద్ధి అవుతాయి.

• జలుబు, తలనొప్పి: జలుబు, మైగ్రెయిన్‌ తలనొప్పికి ఇది మంచి మందు. వాము పొడిని ఒక గుడ్డలో కట్టి మెల్లగా వాసన చూస్తే సమస్య తీరిపోతుంది.

• ఆస్తమా: ఆస్తమా వ్యాధిగ్రస్తులు వాము, బెల్లం కలిపి తీసుకుంటే మంచిది.

• గుండె వ్యాధులు: గుండెవ్యాధులు రాకుండా నివారించడంలో వాము ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

• కీళ్ళ నొప్పులు: వామునూనె కీళ్లనొప్పులను తగ్గిస్తుంది.

• కాలిన గాయాలకు: కాలిన గాయాలకు ఇది మంచిదని వైద్యశాస్త్రం చెబుతోంది.

• దంత సమస్యలకు: పంటినొప్పికి వామును గోరువెచ్చని నీటితో నమిలి పుక్కిలించి చూడండి.

• దగ్గు: దగ్గు వచ్చినపుడు వేడినీటిలో కొద్దిగా వాము తీసుకుని నమలాలి. వాముకు తమలపాకు కలిపి రాత్రిపూట నమిలితే రాత్రి పొడిదగ్గు రాదు.


ఆయుర్వేదంలో వాము :-



• ఆకలి పెంచటానికి: వాము చూర్ణాన్ని, బిడా లవణాన్ని ఒక్కొక్కటి రెండు గ్రాములను అర గ్లాసు మజ్జిగకు కలిపి తీసుకుంటే ఆకలి పెరుగుతుంది. అరుగుదల పెరుగుతుంది. శరీరంలోపల పెరిగే బల్లలు కరిగిపోతాయి. (చరకసంహిత, వృందమాధవ).

అర్శమొలలు తగ్గించుటకు: వాము చూర్ణం, చిత్రమూలం వేరు చూర్ణం ఒక్కొక్కటి రెండేసి గ్రాముల చొప్పున ఒక గ్లాసు మజ్జిగకు కలిపి తీసుకుంటే అర్శమొలలు తగ్గుతాయి.

ఆహారం అరుగుదలకు: వాము, శొంఠి, చిరుబొద్ది, దానిమ్మ రసం, బెల్లం వీటిని ఉప్పు కలిపిన మజ్జిగతో తీసుకుంటే అరుగుదల పెరుగుతుంది.

కడుపునొప్పికి: వాము, సైంధవ లవణం, కరక్కాయ పెచ్చులు, శొంఠి వీటి చూర్ణాలను సమంగా కలిపి రెండు గ్రాముల మోతాదుగా అరకప్పు వేడి నీళ్లకు కలిపి తీసుకుంటే కడుపునొప్పి తగ్గుతుంది.

దద్దుర్లు తగ్గించుటకు: వామును బెల్లంతో కలిపి వారంపాటు తీసుకుంటే దద్దుర్లు తగ్గుతాయి.

కొండనాలుక వాపు తగ్గుటకు: వామును బుగ్గనుంచుకొని రసం మింగుతుంటే కొండనాలుక వాపు తగ్గుతుంది. ఇలా ఒక పగలు, ఒక రాత్రి నిరంతరమూ చేయాలి.

దంత సమస్యలకు: రాత్రిపూట వామును, వస కొమ్మును సమభాగాలను పలుకులుగా చూర్ణించి చిటికెడు మోతాదుగా నోట్లో ఉంచుకొని దంతాలమధ్య ఒత్తిపట్టి ఉంచుకుంటే దంత సంబంధ సమస్యలు తగ్గుతాయి.


ముక్కుదిబ్బడ, తల నొప్పి: 200నుంచి 250 గ్రాముల వామును పెనంమీద వేడి చేసి, మెత్తని పల్చని నూలుగుడ్డలో పోసి మూటగాకట్టి పెనంమీద వేడి చేసి బాగా గాఢంగా వాసన పీల్చితే తుమ్ములు వచ్చి ముక్కు దిబ్బడ, జలుబు, తలనొప్పి వంటివి తగ్గుతాయి.

ముక్కు దిబ్బడ: ఒక గుప్పెడు వామును కచ్చాపచ్చాగా దంచి ఒక నూలు గుడ్డలో మూటకట్టండి. దీనిని పిల్లలు పడుకునే దిండు పక్కన ఉంచండి. దీని నుంచి వచ్చే ఘాటు వాసనకు పసి పిల్లల్లో ముక్కుదిబ్బడ తొలగిపోతుంది.

• ఉబ్బసం, బ్రాంకైటిస్: ఒక గుప్పెడు వామును కాటన్ గుడ్డలో మూటగా చుట్టండి. దీనిని ఒక పెనం మీద వేడి చేయండి. సుఖోష్ణ స్థితిని తడిమి చూసి ఛాతిమీద మెడమీద ప్రయోగిస్తే ఉబ్బసం, బ్రాంకైటిస్ వంటి సమస్యలు తగ్గుతాయి.

జలుబు: పావు టీ స్పూన్ వాము చూర్ణాన్ని, ఒక టీ స్పూన్ పసుపును ఒక బొవెన్‌లో తీసుకోండి. ఒక టీ కప్పు వేడి నీళ్ళు కలపండి. దీనిని ఒక టేబుల్ స్పూన్ మోతాదుగా, ఒక టీ స్పూన్ తేనె కలిపి తీసుకుంటే జలుబు, జలుబువల్ల వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి.

కఫం: అర లీటర్ మరిగే నీళ్లకు ఒక టీ స్పూన్ వాము చూర్ణాన్ని, ఒక టీ స్పూన్ పసుపు చూర్ణాన్ని కలిపి చల్లార్చండి. దీనిని ఒక టేబుల్ స్పూన్ మోతాదుగా, ఒక టీ స్పూన్ తేనె కలిపి తీసుకుంటే, జలుబు ఛాతిలో కఫం పేరుకుపోవటం వంటి సమస్యలు తగ్గుతాయి.

దగ్గు: అర టీ స్పూన్ వామును, రెండు లవంగాలను, ఒక చిటికెడు ఉప్పును కలిపి చూర్ణించి అరకప్పు వేడి నీళ్లకు కలిపి కొద్దికొద్దిగా చప్పరిస్తూ తాగితే దగ్గు తగ్గుతుంది.

ఊపిరితిత్తుల మార్గం శుభ్రం: రెండు టీ స్పూన్ల వామును మెత్తగా దంచండి. ఒక గ్లాసు మజ్జిగకు కలిపి తీసుకుంటే కఫం పల్చబడి ఊపిరితిత్తుల్లోకి గాలిని చేరవేసే మార్గాలు శుభ్రపడతాయి.

తలనొప్పి, పడిసెం: వాము చూర్ణాన్ని రెండునుంచి మూడు గ్రాములు వేడి నీళ్లలో గాని లేదా వేడి పాలతో గాని రోజుకు రెండు లేదా మూడుసార్లు తీసుకుంటే జలుబు, తలనొప్పి, పడిశము వంటివి తగ్గుతాయి.


వాము దుష్ప్రభావాలు : - 



• వాము ఒక గర్భస్రావ కారకం. కాబట్టి, గర్భిణీ స్త్రీలు ఈ మూలికను నివారించాలని చెప్తారు.

ఆయుర్వేదం ప్రకారం, వాము శరీరం మీద వేడి ప్రభావాన్ని కలిగి ఉంది. కాబట్టి, మీరు వేడి శరీరం కలవారు ఐతే, వామును తక్కువగా వినియోగించడం ఉత్తమం.

పిల్లలు కోసం వాము యొక్క సరైన మోతాదు గురించి తెలియదు. కాబట్టి, మీ బిడ్డ కోసం వాము యొక్క సరైన మోతాదును నిర్ణయించడానికి మీ వైద్యుడిని అడగటం ఉత్తమం.

వాము రక్తాన్ని పల్చబరుస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మీరు ఒకవేళ శస్త్రచికిత్స చేయించుకోవాలనుకుంటే లేదా రక్తానికి సంభందించిన మందులు వాడుతుంటే, వామును తినకూడదు.

వాములో ప్రధాన థైమోల్ అను రసాయన పదార్దాన్ని కలిగి ఉంటుంది. థైమోల్ కొంతమందిలో తేలికపాటి చర్మ దద్దురుని కలిగిస్తుంది.అంతేకాక, థైమోల్ యొక్క అధిక వినియోగం కూడా కొంతమందిలో మైకము, వికారం మరియు వాంతులు వంటి పరిస్థితులకు కారణమవుతుంది. కాబట్టి, అధిక మొత్తంలో వామును తీసుకోకపోవడమే మంచిది.



No comments:

Post a Comment

🌱 ఆయుర్వేదం - శతావరి

ఆయుర్వేదవైద్యం లో పేర్కొన్న పురాతనమైన మూలికలలో ‘ శతావరి ’ ఒకటి. శతావరి గురించిన ప్రస్తావనలు భారతదేశపు అత్యంత పురాతన వైద్య గ్రంధా...