Saturday, October 31, 2020

🌱 ఆయుర్వేదం - శ్రీగంధం

శ్రీగంధం లేదా చందనము ఒక విశిష్టమైన సుగంధాన్నిచ్చే వృక్షం. దీని శాస్త్రీయనామం శాంటాలమ్ ఆల్బమ్ (Santalum album). ఇది శాంటాలేసియా కుంటుంబానికి చెందినది. చందనము వ్యాధి నిరోధక శక్తిని, మేధస్సును పెంచే గుణము కలది. దీన్ని సిరి గందం చెట్టు అని కూడా అంటారు. బాగా ముదిరిన ఈ చెట్టు కర్ర మంచి సువాసన కలిగి వుంటుంది. అటు వంటి కర్రలను రాతి బండలపై నీళ్లు చిలకరిస్తూ రుద్దుటుంటే గందం వస్తుంది. దీని దేవునికి పూస్తారు.


పెళ్లిళ్లలో పేరంటాలలో అతిథులను గౌరవించటానికి చందనమలదుతారు వచ్చిన వారందరికి ఆడ ,మగ అనే భేదం లేకుండా. స్త్రీలకి మెడ భాగానికి, పురుషులకి అర చేతుల వెనుక భాగానికి మంచి గంధం పూయటం ఈ నాటికీ నిలిచి ఉన్న ఆచారం. అసలు శుభ లేఖ మీద ఉండేదే "మదర్పిత చందన తాంబూలాలను స్వీకరించి" అని. అంటే నేను చేసే అతిథి మర్యాదలు స్వీకరించమని అర్థం. ఎవరినైనా సత్కరించాలన్నా, సన్మానించాలన్నా గంధం పూస్తారు. భారతదేశంలో గంధాన్ని అరగదీసి చేసిన లేపనాన్ని శుభకార్యాలలో, దైవపూజలో ఉపయోగిస్తారు. ఆడ వారు సాధారణంగా గంధాన్ని మెడకి, కొన్ని ప్రాంతాలలో దవడలకి రాసుకుంటారు. సాధారణంగా చెమట పట్టి చికాకు కలిగించే ప్రాంతాలు ఇవే. కంఠం ముడి ఉండే ప్రదేశంలో విశుద్ధి చక్రం ఉంటుంది. రెండు వేళ్ళతో ఆ ప్రాంతంలో గంధం పూయటం వల్ల విశుద్ధి చక్రానికి కాపుదల ఉంటుంది. ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మికతని సంప్రదాయంలో మిళితం చేసిన సంస్కృతి మనది


షోడశోపచార పూజలో చందనం సమర్పించటం ఒక ఉపచారం. లఘువుగా పంచోపచారాలు చేసినా అందులో గంధం ఉంటుంది. అన్ని సుగంధ ద్రవ్యాలు సమర్పించ లేక పోయినా మంచి గంధం ఒక్కటి సమర్పిస్తే చాలునన్న మాట.శివుడి అభిషేక ద్రవ్యాలలో గంధం కూడా ఒకటి. సింహా చలంలోని శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి వారు ఎప్పుడూ చందనపు పూతతో దర్శన మిస్తూ ఉంటారు. అక్షయ తదియ నాడు చందనోత్సవం జరుపుతారు.లలితా దేవి నామాలలో "చందన ద్రవ దిగ్ధాంగీ" అని ఒకటి ఉంది. మొత్తం శరీరమంతా చందన ద్రవంతో ముంచెత్తినది అని అర్థం. అంటే అమ్మవారికి చందనం అంటే అంత ఇష్టం అన్నమాట.



తిరుమల లోని శ్రీ వేంకటేస్వరాలయంలో ఈ విధంగా గందం తీయడానికి ఒక గది ఉంది(గందపు గది). అలంకార ప్రియుడైన విష్ణు మూర్తికి చందనం తయారు చేయటానికి పెద్ద వ్యవస్థే ఉంది. చందనం అంటే గంధపు చెక్కని అరగదీస్తే వచ్చే కలికం. ఇది మన వంటి కలికాలంలో ఉన్న మనుషులకి మాత్రమే. గంధపు చెక్క అరగదీయగా వచ్చిన గంధం మూలం. దానిలో కాలానుగుణంగా మరెన్నో పరిమళ ద్రవ్యాలు చేరుతుంటాయి. అసలు అరగదీసేప్పుడే మామూలు నీరు కాక పన్నీరు పోస్తారు. అందులో వేసవి కాలం అయితే పచ్చ కర్పూరం మొదలైన వాటిని అధికంగా చేర్చుతారు. చలి కాలం అయితే కస్తూరి ఎక్కువగా చేర్చటం ఉంటుంది. పునుగు, జవ్వాది, వట్టి వేళ్ళు, బావంచాలు మొదలైన సుగంధ ద్రవ్యాలు గంధంలో చేర్చ బడుతూ ఉంటాయి. సంధర్భాన్ని పట్టి వీటి పాళ్ళు మారుతూ ఉంటాయి.విష్ణువు ఉపయోగించే చందనం చాలా ప్రత్యేక మైనది, విలక్షణమైనది. అంటే లేపనాలు తయారు చెయ్యటం ఒక ప్రత్యేకమైన విద్య. ఏదో మొక్కు బడిగా గంధపు చెక్కని అరగదీయటం కాదు.



చందనం అమూల్యమైన మూలిక. ఆహ్లాదకరమైన వాసన కలిగిఉంటుంది. దుర్గంధాన్ని పోగొడుతుంది. రక్త దోషాన్ని, పైత్యాన్ని తగ్గిస్తుంది. ఇది విషాన్ని హరిస్తుంది. క్రిమిహరం కూడా! చల్లగా ఉంటుంది. చల్లదనాన్ని కలిగిస్తుంది. అని చాలా మందికి తెలుసు. అంతే కాదు చందనం అంతస్తాపాన్ని కూడా హరిస్తుంది. ఆ కారణంగానే చందనాన్ని ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగిస్తారు. చందనాది వటి, చందనాసవం మొదలైన ఔషధాలు తయారు చేస్తారు. చాందినీ అత్తరు, సబ్బులు మొదలైన సౌందర్య సాధనాలకి మూలం చందనం. ఈ చెట్లు ఎక్కువగా నల్లమల అడవులో పెరుగు తాయి. తిరుమల కొండ పైన ఈ చెట్లు విస్తారంగా కనిపిస్తాయి. ఇక్కడ గందపు చెక్కలను కూడా బజారులో అమ్ముతుంటారు. ఇవి చాల విలువైనవి. అందు చేత వీటిని స్మగ్లర్లు దొంగ రవాణ చేస్తుంటారు. చందనం తాలూకు గుణాలు మహత్తరమైనవి. రూపసౌందర్యాలకూ, చందనానికీ అవినాభావసంబంధం ప్రాచీనకాలం నుంచీ ఉంది. చాలా మంది పురుషులు చందనపు బొట్టు పెట్టుకోవటం మనకు తెలుసు. శరీరానికి చందనలేపనం చేసుకోవటం గురించీ వింటుంటాం. సుకోమలమైన చర్మం, అందానికి ప్రతీక. అలాగే చందనం నుంచి వెలువడే సుగంధాలు ఆరోగ్యానికీ నిదర్శనం. ఈ కారణాల చేతనే చందనాన్నిసౌందర్యసాధనాల్లో నేడూ వాడుతున్నారు.


గంధం నూనె :-



గంధం నూనె ఒక పరిమళమైన, అహల్లదకరమైన సువాసన కల్గి ఉంది.నూనె లేత పసుపు లేదా బంగారు రంగులో వుండును. చందన తైలాన్ని సుగంధ ద్రవ్యాలలో, కాస్మోటిక్స్ అలాగే సబ్బులతయారీలో, ఇతర అత్తరు లలో మిశ్రమం చేసి ఉపయోగిస్తారు.అంతే కాకుండా చందన తైలాన్ని ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు. గంధం నూనెను కాండంతో పాటు వేర్లనుండి కూడా సంగ్రహిస్తారు.గంధం నూనెయొక్క విశిష్టమైన పరిమళం కారణంగా దీనిని ఎక్కువగా పరిమళ ద్రవ్యంగా ఉపయోగిస్తారు. అంతేకాదు హిందు, జైన, బుద్ధ, జొరాస్ట్రియన్ మతంలో చందన నూనెను పవిత్ర నూనెగా భావిస్తారు. గంధం నూనెను పరిమళ ద్రవ్యాలలోను, సౌందర్య సాధనలలోను, పవిత్ర లేపనాలలోను ఉపయోగిస్తారు.



కొన్ని రకాల పెర్‌ఫ్యూమ్‌లలోనూ చందనం వుంటుంది. ఆధ్యాత్మికమానసికారోగాల కోసం కూడా చందనం వాడకం ఉంది. వేదాల్లో దేవరాజైన ఇంద్రుని నందనోద్యానంలో చందనవృక్షం వున్న ప్రసక్తి ఉంది. దాని సువాసనలతో దేవలోకం మొత్తం గుబాళించిందట. అక్కడున్న దివ్యదేవతలతో పాటు అప్సరలందరి సౌందర్యానికీ అతిముఖ్యకారణం చందనమేననీ, ఆ తరువాతి కాలంలో చందనం భూలోకంలోకి వచ్చినప్పుడు, సహజసౌందర్యోద్ధరణ కోసం స్త్రీలందరూ చందనాన్ని వాడారనీ ప్రతీతి. చందనం ఒక సంపూర్ణమూ, సహజమూ అయిన సౌందర్యవర్ధకసాధనం. కోమలత, కమనీయత నిలిచి వుండటానికి చందనం తోడ్పడుతుంది. మాయిశ్చరైజింగ్‌ ఏజెంట్‌గానూ పని చేసేది చందనమే. చర్మంలో నుంచి పోయిన తేమను తిరిగి తీసుకురాగలగిన చక్కని సాధనం. అంతే కాకుండా, చర్మంలోని అదనపు జిడ్డును కూడా చందనం తొలగిస్తుంది. అందుకనే సంపూర్ణమైన స్కిన్‌ కేర్‌ ప్రాడక్ట్‌గా చందనాన్ని నేటి వారూ భావిస్తున్నారు. 


• చందనాన్ని ముల్తానీ మట్టి, పన్నీరు కలిపి, పేస్ట్‌లా చేసి, ముఖం, మెడ మీద రాసుకుంటే ఈ లేపనం చర్మాన్ని స్నిగ్ధం చేస్తుంది. చాలా శుష్కంగా వుండే చర్మానికి కూడా చందనం మేలు చేస్తుంది. 

• స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కల చందనతైలాన్ని వేసుకోవాలి. శరీరమంతటా చందనలేపనం చేసుకుని, ఆ తరువాత చందనతైలం వేసుకున్న నీటితో స్నానం చేస్తే బలే మజాగా వుంటుంది. చర్మంలోని శుష్కత పూర్తిగా పోతుంది. చందనం మేలైన స్క్రబ్‌గానూ ఉపయోగపడుతుంది.

• చర్మం జీవం లేకుండా, వాడిపోయినట్లుగా కనిపిస్తే, లేదా చర్మంలోని మృతకణాలు సౌందర్యానికి బాధకాలుగా నిలిస్తే, స్నానం చేసే ముందు, కాస్త బరకగా వుండే చందనం పొడిని ముఖం, మెడ, చేతులూ, కాళ్లకు రాసుకోవాలి. దాంతో చర్మం మీదుండే మృతకణాల పొర తొలగిపోతుంది. చర్మానికి కొత్త కాంతి వస్తుంది.

• సెన్సిటివ్‌ చర్మానికి చందనం లాభాలు కలుగజేస్తుంది. క్రీమ్‌ రూపంలో, ఫేస్‌ ప్యాక్‌లాగా చందనాన్ని వాడుకుంటే సరిపోతుంది. ఈ వస్తువుల వాడకంతో చర్మం మచ్చలు లేనిదిగా, సుందరంగా తయారవుతుంది.



ఫేస్‌ క్లెన్జర్‌గానూ, ఎండకు కమిలిన చర్మం మీదా చందనం తన చల్లని ప్రభావాన్ని చూపుతుంది. చందనం గల సబ్బులూ, చందనం పేస్ట్‌తో రోజూ చర్మాన్ని శుభ్రపరచుకుంటే, కొద్ది రోజుల్లోనే చర్మం వికసించి, సహజకాంతితో మెరుస్తుంటుంది. అరోమా బాత్‌, పెర్‌ఫ్యూమ్‌ల రూపంలో చందనాన్ని వాడుకోవచ్చు.

• రోజూ చందనతైలాన్ని కొన్ని చుక్కలు వాడుకోవటం వల్ల, చెమట వల్ల ఏర్పడే దుర్గంధం పోతుంది. 

• గంధాన్ని కొంచెం కొబ్బరినీళ్లలో కాని,మంచి నీళ్ళలో కాని కలుపుకుని తాగితే వెర్రి దాహం తగ్గుతుంది.

• చందన తైలం శరీరానికి చలవ చేస్తుంది. రోజుకి ఒక చుక్క చాలు. సాధారణంగా చక్ర కేళి అరటి పండులో ఒక చుక్క వేసుకుని తింటూ ఉంటారు.

• జ్వరం చాలా ఎక్కువగా ఉంటే అధిక ఉష్ణోగ్రతని తగ్గించటానికి కణతలకు మంచి గంధం రాస్తారు. 

• వేసవి కాలంలో ఒళ్ళు పేలకుండా ఉండటానికి గంధం పూత ఎంతగానో తోడ్పడుతుంది.

• ఎన్నో చర్మ వ్యాధులకు, కీళ్ల వాపులకు, జుట్టు రాలటానికి, ఇంక మరెన్నో వ్యాధులకు ఉపశమనం కలిగిస్తుంది గంధపు అనులేపనం.

• భ్రమను పోగొట్టి, స్మృతిని కలిగిస్తుంది. చెమటను, దుర్గంధాన్ని పోగొట్టి మనస్సుకి ఉల్లాసాన్ని కలిగిస్తుంది. 

• నుదుటిమీద రాసుకుంటే తలలో వేడి చేరకుండా తల నొప్పి రాకుండా రక్షణ నిస్తుంది. 

• గుండెలపై రాసుకోవటం వల్ల హృదయానికి మేలు చేసి,గుండే జబ్బులు రాకుండా చూస్తుంది.


* మరి కొన్ని లాభాలు చందనవృక్షం తాలూకు ఆకులు, వేళ్లు, చెక్క అన్నిటిలోనూ చందనానికి వుండే సుగుణాలు ఉన్నాయి. చందనంతోపాటు ఈ వేసవిలో ప్రత్యేకంగా లభించే మల్లెలను కలిపి చికిత్స చేస్తే.. శరీరంపై పడే అతివేడి ప్రభావం నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు. 



• అరగదీసిన గంధం, బాదం పొడి, మల్లె పువ్వుల గుజ్జు, కలబంద గుజ్జు చెంచా చొప్పున తీసుకోవాలి. అన్నింటినీ కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. పదినిమిషాలయ్యాక కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖంపై నలుపు తగ్గి క్రమంగా ప్రకాశవంతంగా మారుతుంది. ఎండలో వెళ్లినా కూడా చర్మం అంత త్వరగా నల్లగా మారదు. 

• జిడ్డు, మొటిమల సమస్య ఉన్నప్పుడు.. చెంచా అరగదీసిన గంధం, తులసి పొడి పావు చెంచా, తేనె, మల్లెపువ్వు గుజ్జు చెంచా చొప్పున తీసుకుని అన్నింటినీ బాగా కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. జిడ్డు చర్మతత్వం ఉన్నవారికి ఈ పూత చక్కగా పనిచేస్తుంది. వేసవిలో గనుక ఈ పూతను తరచూ వేసుకుంటే.. చర్మం చాలా తేటగా కనిపిస్తుంది.

•  ఎండలో తిరిగినప్పుడు చర్మం కమిలినట్లు అవుతుంది. మంట, దురద, చెమట పొక్కులు బాధిస్తార. అలాంటివారు... రెండు చెంచాల గంధంపొడి, పుదీనా రసం, ముల్తానీమట్టి, కలబంద గుజ్జు చెంచా చొప్పున తీసుకుని అన్నింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసుకుని పదినిమిషాలయ్యాక కడిగేయాలి. ఇలా రోజూ రెండుసార్లు చేస్తే ఎంతో మార్పు ఉంటుంది. చర్మం మెరుపును సంతరించుకుంటుంది.

• చందనం సున్నిపిండి... ఈ కాలంలో సున్నిపిండి వాడితే చర్మం తాజాదనంతో మెరిసిపోతుంది. అయితే దీన్ని ప్రత్యేకంగా తయారు చేసుకోవాలి. పెసలు, సెనగలు, బియ్యం పావుకేజీ చొప్పున, యాభై గ్రాముల పసుపు కొమ్ములు, వంద గ్రాములు ఎండబెట్టిన కమలాఫలం చెక్కులు తీసుకుని అన్నింటినీ పిండి పట్టించాలి. ఆరు చెంచాల సున్నిపిండికి చెంచా మంచి గంధం పొడి కలపాలి. వాడుకునేటప్పుడు సగం నిమ్మచెక్క రసం కూడా కలిపి శరీరానికి రుద్దుకోవాలి. చర్మం తాజాదనంతో మెరుస్తుంది. మృదువుగానూ ఉంటుంది. 

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చర్మం నల్లబడి, ఎర్రగా కందిపోయి.. మంటగా అనిపిస్తుంటే నిర్లక్ష్యం చేయకూడదు. అది ఇతర సమస్యలకు కారణం కావచ్చు. అలాంటప్పుడు ఈ చికిత్స ప్రయత్నిస్తే.. కాంతులీనే చర్మం మీ సొంతమవుతుంది.

మల్లె, కలబంద సుగుణాలున్న మిశ్రమంతో చర్మాన్ని శుభ్రపరచాలి

మంచిగంధం జాస్మిన్‌ గ్రాన్యువల్స్‌తో చేసిన నలుగుతో ఐదునిమిషాలు మర్దన

మంచిగంధం, తామర క్రీంతో ఏడెనిమిది నిమిషాలు మర్దన

మల్లెల గుజ్జు, గులాబీ జెల్‌ రాసి పదినిమిషాలు ఉంచాలి.

తరువాత జాస్మిన్‌ సిరమ్‌ వేసి ఏడు నిమిషాలు డెర్మోసోనక్‌ చికిత్స

జాస్మిన్‌, క్రిస్టల్‌ పూత వేసి ఇరవై నిమిషాల తరువాత తొలగించాలి.



చందనం పొడి, పసుపు సమపాళ్లలో కలిపి నీళ్లతో మెత్తని పేస్టులా చేసి ముఖంపై మొటిమలున్న చోట రాసుకోవాలి. చందనం చల్లదనాన్ని ఇస్తే, పసుపు యాంటీ బయోటిక్‌లా పనిచేస్తుంది. ఇందులో చిటికెడు కర్పూరం కలిపినా మంచిదే. దీనిని రాత్రి పడుకోబోయే ముందు రాసుకుని, ఉదయం లేచాక శుభ్రం చేసుకుంటే సరి. మొటిమలు మరీ బాధిస్తే చందనానికి రోజ్‌వాటర్‌ కలిపి రాసుకుంటే తగ్గుతాయి.

•  టాన్‌కి విరుగుడు: నాలుగు టీ స్పూన్ల చందనం పొడికి, రెండు టీ స్పూన్ల కొబ్బరినూనె, రెండు స్పూన్ల బాదం నూనె కలిపి ముఖానికీ మెడకీ చేతులకీ రాసుకుని పావుగంటయ్యాక గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

•  చర్మం నునుపు కోసం: ఒక స్పూను బాదం పొడి, ఒక స్పూను గంధం పొడి, పాలు కలిపి ముఖానికీ మెడకీ రాసుకోవాలి. ఇలా తరచూ చేస్తే, చర్మం రంగు తేలుతుంది. ఎర్ర చందనం పొడిని రాసుకుంటే ముఖం మీద చారలూ, గీతలూ ఉంటే పోతాయి. మార్కెట్లో దొరికే గంధం నూనెతో ముఖాన్ని మర్దన చేసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. 


 ☆ గంధం నూనె ఉపయోగాలు

• గంధపు తైలాన్ని శారీరక, మానసిక రుగ్మతల యొక్క రెండు చికిత్సల కొరకు ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తారు.

గంధం నూనె ఎక్కువ ఖరీరైన తైలం అయినప్పటికి ఛాతీ, మూత్ర కోశ సంబంధ జబ్బులను నయం చేయుటకు ఉపయోగపడును.గంధం నూనె మానసిక ఆందోళన, అద్రిక్తతను, ఆతురతను తగ్గించును. 

రాత్రిళ్లు సరిగ్గా నిద్రపట్టనివారు.. స్నానం చేసే నీటిలో మూడు చుక్కల గంధపు నూనెను వేసుకుంటే.. ఎంతో మార్పు ఉంటుంది.


☆ గంధం నూనె విష స్వాభావాం లేని నూనె, అలాగే నాన్ఇ రిటంట్ నూనె. ఎటువంటి ప్రధాన పార్శదుష్ప్రభావాలు లేనప్పటికి కొందరిలో చర్మం పై ప్రకోప ప్రభావం చూపించవచ్చు.అలాగే పలు అలెర్జీ జబ్బులతో బాధ పాడేవారు, గర్భంతో వున్నవారు ఈ నూనెను ఔషధంగా లేదా ఆరోమాతేరపిలో ఉపయోగించునపుడు తగు సూచనన మేరకు మాత్రమే ఉపయోగించుట మంచిది..




No comments:

Post a Comment

🌱 ఆయుర్వేదం - శతావరి

ఆయుర్వేదవైద్యం లో పేర్కొన్న పురాతనమైన మూలికలలో ‘ శతావరి ’ ఒకటి. శతావరి గురించిన ప్రస్తావనలు భారతదేశపు అత్యంత పురాతన వైద్య గ్రంధా...