ధనియాలు ఒక విధమైన వంటలో ఉపయోగిం8చే గింజలు. వీటిని కొరియాడ్రం సటైవం. దీనిని మరో రకంగా సీలెంట్రో అని కూడా అంటారు. ఈ మొక్కలు ఎక్కువగా మధ్యధరా దేశాల్లో కనిపించే వార్షిక మొక్క. ఉష్ణోగ్రత తగినంత వేడి ఉన్న ప్రదేశాలలో పెరగడం ఇష్టపడతాయి. ఈ మొక్కలు మంచి సువాసన కలిగి ఉంటాయి.ఇవి పెరిగె ప్రదేశాల నుండి కొన్ని మీటర్ల దూరం వరకు సువాసన వెదజల్లుతుంది. కాండం 3 అడుగుల పొడవ వరకు ఉండవచ్చు.కాండం సన్నగా వుండి ఆకులతో వుంటుంది.కొమ్మల దగ్గర పువ్వులు గుంపుగా ఉండి ఊదా రంగులో ఉంటాయి.
ధనియాలను ఇంగ్లీష్‌లో కొరియాండర్ అనీ, ల్యాటిన్‌లో కొరియాండ్రమ్ సెటైవం అనీ పిలుస్తారు. సాధారణంగా ధనియాలను సుగంధంకోసం వంటల్లో వాడుతుంటారు. ధనియాల గింజలను కూరపొడి, సాంబారు పొడి తయారీలకు, కూరల తాళింపుకోసం వాడటం ఆనవాయితీ.అయితే కేవలం వంటింటి దినుసుగానే కాకుండా ధనియాలను ఔషధంగా కూడా వాడవచ్చు.
ధనియాలలోని ఔషధ గుణాల గురించి మనకు అంతగా అవగాహన ఉండదు. .ధనియాలను సంస్కృతంలో ధన్యాకమని, హిందీలో ధనియ అని అంటారు. దీని మొక్క 30 సెంటీమీటర్ల వరకూ పెరుగుతుంది. ఆకులు చిన్నగా ఉండి, సువాన కలిగి ఉంటాయి. పువ్వులు గుత్తులు గుత్తులుగా ఏర్పడుతాయి. దీని కాయ రెండు దళాలుగా ఉంటుంది. ఈ రెండింటిలోనూ రెండు బీజాలు ఉంటాయి. ధనియాలు మొక్క దశలో ఉన్నప్పుడు దానిని మనం కొత్తిమీర అని వ్యవహరిస్తాము. దీనిని కూడా వంటలలో తరచుగా ఉపయోగిస్తాము. ధనియాలు తీపి, వగరు రుచులు కలిగి ఉంటాయి. ఎక్కిళ్లు, జ్వరా లను తగ్గిస్తాయి. కడుపులో మంటను తగ్గిస్తాయి. రుచిని పెంపొంది స్థాయి. ఆకలిని పెంచుతాయి. సుఖ నిద్ర కలుగజేస్తాయి.
☆ ధనియాలు ఔషథోపయోగాలు :
• ధనియాలను వేయించి పొడి చేసి పూటకు సగం చెంచా చొప్పున క్రమం తప్ప కుండా తింటే శరీర దౌర్బల్యం తగ్గుతుంది.
• ధనియాలను కషాయంగా కాచుకుని అందులో పంచదార కలిపి తాగితే అతి దాహం తగ్గుతుంది.
• ధనియాలు చూర్ణం, పంచదార కలిపి బియ్యపు కడుగు నీటితో తీసుకుంటే శ్వాస, కాసలు తగ్గుతాయి.
• ధనియాలు, శొంఠి కలిపి కషాయం తీసుకుని సేవిస్తే అజీర్ణం తగ్గుతుంది.
• ధనియాల కషాయంలో పంచదార కలిపి తాగితే మంచి నిద్ర వస్తుంది.
• ధనియాలు, జీలకర్ర, మిర్చి, కరివేపాకులను నేతిలో వేయించి, ఉప్పు కలిపి భద్రపరిచి ప్రతిరోజూ అన్నంతో తింటే రుచి పెరుగుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది.
• ధనియాల కషాయానికి సమంగా తేనె కలిపి ఒక కప్పు మోతాదుగా సేవిస్తే మూత్రం ద్వారా జరిగే ఇంద్రియ నష్టం తగ్గుతుంది.
• ధనియాలను పేస్టులాగా మెత్తగా నూరి తలమీద పట్టు వేసుకుంటే తలనొప్పి, వేడి తగ్గుతాయి.
• ధనియాలు, బార్లి గింజలు సమంగా నూరి వాపు ఉన్నచోట లేపనంగా వేస్తే వాపు తగ్గుతుంది.
☆ ఆయుర్వేదిక్ వినియోగము గృహ చికిత్సలు :
• ధనియాలను బరకగా నూరి, దాని తూకానికి ఆరు రెట్లు చన్నీళ్లుపోసి రాత్రంతా ఉంచాలి. ఉదయం పంచదార కలుపుకొని తాగితే శరీరంలో మంట, వేడి తగ్గుతాయి.
• ధనియాలును, చెదుపొట్ల ఆకులను కషాయం తయారుచేసుకొని తాగితే జ్వరంలో ఆకలి పెరుగుతుంది. సుఖ విరేచనమై జ్వరం దిగుతుంది.
• జ్వరంలో ఆకలిని పెంచడానికి, ఉష్ణోగ్రత తీవ్రతను తగ్గించడానికి 2 భాగాలు ధనియాలను, 1 భాగం శొంఠిని నీళ్లకు కలిపి కషాయం తయారుచేసుకొని తీసుకోవాలి.
• శిశిరంలో వచ్చే జ్వరాలను తగ్గించుకోవడానికి ధనియాలు, శొంఠితో కషాయం తయారుచేసుకొని, నిమ్మరసాన్ని, పంచదారనూ కలిపి తీసుకోవాలి. నీళ్ల విరేచనాలు (అతిసారం)
• ధనియాలు, శొంఠి, మారేడుపండు గుజ్జు వీటితో కషాయం తయారుచేసుకొని తాగితే ఆమం పచనం చెందుతుంది. కడుపునొప్పి, మలబద్ధకం తగ్గి ఆకలి పెరుగుతుంది. జ్వరం దిగుతుంది.
• ధనియాలు, నెయ్యి, నీళ్లు- వీటిని 1:4:16 నిష్పత్తిలో తీసుకొని ధృతపాకం (నీరంతా ఆవిరయ్యేలా మరిగించటం) చేసుకొని వాడుకోవాలి. దీనిని ధాన్యక ఘృతం అంటారు. దీనిని వాడితే విరేచనాల్లో కనిపించే పైత్యపు నొప్పి తగ్గి ఆకలి పెరుగుతుంది. అరుగుదల కూడా మెరుగవుతుంది.
• అజీర్ణం ధనియాలు, శొంఠితో కషాయం తయారుచేసుకొని తాగితే అరుగుదల పెరుగుతుంది. ఇది మూత్రాన్ని కూడా జారీచేస్తుంది.
• అర్శమొలలు ధనియాలకు నేలవాకుడు (ములక/కంటకారి) మొక్కను సమూలంగా గాని లేదా శొంఠిని గాని కలిపి కషాయం కాచి తీసుకుంటే అరుగుదల పెరిగి వాయువునుంచి ఉపశమనం లభిస్తుంది.
• గుల్మం (శరీరంలో పెరుగుదలలు) ధనియాలను కషాయం రూపంలో తీసుకుంటే శరీరంలో అంతర్గతంగా తయారైన పెరుగుదలలు శుష్కించిపోతాయి.
• వాంతులు ధనియాల కషాయానికి నిమ్మరసం, ఉప్పుకలిపి తీసుకుంటే వాంతులు ఆగిపోతాయి. ధనియాల పొడి, వెలగ పండు గుజ్జు, త్రికటు చూర్ణం వీటిని కలిపి బియ్యం కడుగు నీళ్లతో తీసుకుంటే వాంతులు, వికారం వంటివి తగ్గుతాయి.
• విపరీతమైన దప్పిక ధనియాలను నలగ్గొట్టి చన్నీళ్లకు కలిపి హిమం రూపంలో పంచదార, తేనె చేర్చి తీసుకుంటే దప్పిక తీరుతుంది.
• ఆమవాతం (రుమటాయిడ్ ఆర్తరైటిస్) ధనియాలు, శొంఠి, ఆముదం వేరు- వీటి మిశ్రమాన్ని కషాయం రూపంలో తీసుకుంటే ఆమవాతంలో కనిపించే జాయింట్ల నొప్పి, వాపులనుంచి ఉపశమనం లభిస్తుంది.
• వాత రక్తం (గౌట్) 10గ్రాముల ధనియాలు, 20గ్రాముల జీలకర్ర, తగినంత బెల్లం... వీటిని కలిపి ఉడికించి లేహ్యం మాదిరిగా తయారుచేసుకొని తీసుకుంటే వాత రక్తంలో ఉపశమనం లభిస్తుంది. ధనియాల పొడిని, శొంఠి పొడిని పాలకు కలిపి తీసుకుంటే వాత రక్తంలో హితకరంగా ఉంటుంది.
• పిల్లల్లో దగ్గు, ఆయాసం ధనియాల పొడి (చిటికెడు), మిశ్రీ (చిటికెడు) వీటి మిశ్రమాన్ని బియ్యం కడుగు నీళ్లతో ఇస్తే చిన్న పిల్లల్లో వచ్చే దగ్గు, ఆయాసం వంటివి ఉపశమిస్తాయి.
• కడుపునొప్పి అజీర్ణంవల్ల కడుపునొప్పి వస్తున్నప్పుడు ధనియాలు, పచ్చి మిర్చి, కొబ్బరి తురుము, అల్లం, గింజలు తొలగించిన నల్లద్రాక్షతో పచ్చడి చేసుకొని తీసుకుంటే కడుపునొప్పి తగ్గుతుంది.
• ఉదరంలో గ్యాస్ తయారవటం జీర్ణక్రియ జరిగే సమయంలో నొప్పి రావటం, ఉదరంలో గ్యాస్ తయారవటం, అజీర్ణం వంటి సమస్యల్లో తేనె కలిపిన ధనియాల కషాయం తీసుకుంటే ఉపయుక్తంగా ఉంటుంది.
• మూత్రంలో మంట ధనియాల కషాయానికి చిటికెడు రేవలచిన్ని పొడిని కలిపి తీసుకుంటే మూత్రంలో చురుకు తగ్గుతుంది.
• శరీరంలో స్థానికంగా వాపు తయారవటం ధనియాల కషాయం తీసుకుంటే మూత్రం జారీ అవటం మూలాన వాపు తగ్గుతుంది. దీంతోపాటు 2 భాగాల పసుపును, 1 భాగం సైంధవ లవణాన్ని కలిపి మెత్తగా నూరి నీళ్లుకలిపి జారుడుగా చేసి స్థానికంగా- వాపుమీద పట్టువేసుకోవాలి.
• తల తిరగటం ధనియాలు, చందనం, ఉసిరి పెచ్చులు వీటిని సమాన భాగాలు తీసుకొని చన్నీళ్లలో నానబెట్టి హిమం తయారుచేసుకొని వాడితే తల తిరగటం, కళ్లు బైర్లుకమ్మటం వంటి సమస్యలు తగ్గుతాయి.
• కంటి సమస్యలు : కళ్ల మంటలు 20గ్రాముల ధనియాలను ఒక గ్లాసు నీళ్లలో వేసి మరిగించి, పరిశుభ్రమైన నూలుగుడ్డతో వడపోసి, ఒక్కో కంట్లో రెండేసి చుక్కల చొప్పున వేసుకోవాలి. కళ్ల కలక, కళ్లమంటలు, కళ్ల దురదలు, కళ్లనుంచి నీళ్లుకారటం వంటి కంటికి సంబంధించిన సమస్యల్లో ఇది చాలా లాభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజూ ధనియాలతో తయారుచేసిన తాజా కషాయంతో కళ్లను శుభ్రపరచుకుంటుంటే కంటి సమస్యలు ఇబ్బంది పెట్టవు. కంటి వాపు ధనియాలు, బార్లీ గింజలను సమాన భాగాలుగా తీసుకొని మెత్తగా నూరి కళ్లపైన పట్టుగా వేసుకుంటే కంటివాపు తగ్గుతుంది.
• గొంతు నొప్పి ప్రతిరోజూ ఉదయం సాయంకాలాలు 5-10 ధనియాల గింజలను నమిలి రసం మింగుతుంటే గొంతు నొప్పి ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది.
• వేడివల్ల తలనొప్పి రావటం ధనియాలు, ఉసిరికాయలను సమాన భాగాలు తీసుకొని రాత్రంతా చల్లని నీళ్లలో నానబెట్టి ఉదయం మెత్తగా రుబ్బి, రసం పిండి పంచదార కలుపుకొని తాగితే వేడివల్ల వచ్చిన తల నొప్పి తగ్గుతుంది.
• అధిక బహిష్టుస్రావం ఆరు గ్రాముల ధనియాలను అర లీటర్ నీళ్లకు కలిపి సగం నీళ్లు మాత్రం మిగిలేంతవరకూ మరిగించాలి. దీనికి మిశ్రీని (పటిక బెల్లం) చేర్చి గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఇలా మూడునాలుగు రోజులు చేస్తే బహిష్టు సమయాల్లో జరిగే రక్తస్రావాధిక్యత తగ్గుతుంది.
• దద్దుర్లు ధనియాల కషాయాన్ని తాజాగా తయారుచేసి తీసుకుంటూ బాహ్యంగా కొత్తిమీర రసాన్ని ప్రయోగిస్తే దద్దుర్లనుంచి ఉపశమనం లభిస్తుంది.
• చిన్న పిల్లలు పక్క తడపటం ధనియాలు, దానిమ్మ పూవులు (ఎండినవి), నువ్వులు, తుమ్మబంక (ఎండినది), కలకండ.. వీటిని సమాన భాగాలు తీసుకొని చూర్ణంచేసి చెంచాడు మోతాదుగా రాత్రిపూట ఇస్తే చిన్నారుల్లో పక్కతడిపే అలవాటు తగ్గుతుంది.
• కొలెస్టరాల్ ఆధిక్యత ధనియాల పొడి కొలెస్టరాల్‌ని నియంత్రణలో ఉంచుతుంది. రెండు చెంచాలు ధనియాలను నలగ్గొట్టి ఒక గ్లాసు నీళ్లకు చేర్చి మరిగించి చల్లారిన తరువాత వడపోసుకొని తాగాలి. ఇలా రెండుపూటలా కొన్ని నెలలపాటు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇది కిడ్నీలను ఉత్తేజపరిచి మూత్రాన్ని జారిఅయ్యేలా చేస్తుంది కూడా.
☆ కొత్తిమీర :
ధనియాల మొక్కలే ఈ కొత్తిమీర. కొత్తిమీర మొక్క కాండంలోనూ, ఆకుల్లోనూ, గింజల్లోనూ సుగంధ తత్వాలూ, ఔషధ తత్వాలూ అనేకం ఉంటాయి. వంటకాలలో విరివిగా వాడతారు.తెలుగు వారు దాదాపు ప్రతి కూరలో దీనిని వేస్తారు.అంతేకాక కొత్తిమీరతో పచ్చడి కూడా చేస్తారు. మనం తీసుకునే అన్ని రకాల ఆకుకూరలు ,కాయగూరల వంటకాలలో విరివిగా వేసి తీసుకోవచ్చు. కొత్తిమిరి నిండా విటమిన్లు ,ఖనిజ లవణాలు ఉన్నాయి . అంతేకాదు సమృద్ధి గా ఐరన్ కుడా లభిస్తుంది. ఇది చాలా సున్నితమైనది. దాన్లో పోషకాలు పూర్తిగా అందాలంటే… కూర వండిన తర్వాతే కొత్తిమీర దానిపై చల్లాలి. అంతే తప్ప… కూర వండుతున్నప్పుడు… కొత్తిమీరను అందులో వేస్తే… ఆ ఆకులు అతి వేడికి ఉడికిపోయి… వాటిలో పోషకాలు ఆవిరి రూపంలో బయటకు పోతాయి.
• కొత్తిమీరలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అవి మన శరీర కణాలను కాపాడతాయి. కణాలను ఫ్రీ రాడికల్స్ దెబ్బతియ్యకుండా చేస్తాయి. కడుపులో మంటల వంటివి తగ్గాలంటే కొత్తిమీర వాడాలి. కాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే… కొత్తిమీర వాడాలి.
• కొత్తిమీర చాలా యాంటీ-ఆక్సిడేంట్స్’ని కలిగి ఉండటము వలన శరీరంలోని కొవ్వు పదార్థాల స్థాయిలను సమన్వయ పరుస్తుంది. కొత్తిమీర ఆకులు హానికరమైన కొవ్వు పదార్థాలను తగ్గించి, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచుతుంది.
• గుండె సంబంధిత జబ్బులు రాకుండా కొత్తిమీర కాపాడుతోంది. హైబీపీని కంట్రోల్‌లో ఉంచుతూ, కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని క్రమబద్ధీకరిస్తుంది. శరీరంలో అధికంగా ఉండే సోడియంను బయటకు పంపేస్తుంది.
• కీళ్ళ నొప్పులతో భాధపడుతున్నారా? అయితే ఆహారంలో ఎక్కువగా కొత్తిమీర తీసుకోండి. దీనిలో ఎక్కువ యాంటీ-ఆక్సిడెంటట్స్ ఉండటం వలన కీల్లనొప్పులను తగ్గించటమే కాకుండా, రుచిని కూడా పెంచుతుంది.
• హైబీపీ క్రమంగా టైప్ 2 డయాబెటిస్ వచ్చేందుకు కారణమవుతుంది. ధనియాలు, కొత్తిమీర, ధనియాల నూనె వంటివి… బీపీని తగ్గిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిల్ని తగ్గించే విషయంలో కొత్తిమీర అద్భుతంగా పనిచేస్తోందని పరిశోధనల్లో తేలింది. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంలో కూడా కొత్తిమీర బాగా పనిచేస్తోంది.
• చర్మాన్ని కాపాడటానికి వాడే రసాయనానికి మందులలో కొత్తిమీర ఆకులను వాడతారు. ముఖం పైన ఉండే మొటిమలకు, పొడి చర్మం, నల్లటి మచ్చలను తగ్గిస్తుంది. చర్మాన్ని కాపాడుటకు వాడే మిశ్రమాలలో కొత్తిమీర నుండి తీసిన ద్రావాలను కలపడం వలన, మిశ్రమం యొక్క ప్రభావం రెట్టింపు అవుతుంది.
• మన మెదడు చాలా సున్నితమైనది. రకరకాల వ్యాధులు దాన్ని నాశనం చెయ్యడానికి ఎదురుచూస్తూ ఉంటాయి. ముఖ్యంగా మతిమరపు, పార్కిన్‌సన్స్, అల్జీమర్స్ వంటివి ఏజ్ పెరుగుతున్న దశలో మెదడుపై దాడి చేస్తాయి. సరిగ్గా ఆ టైమ్‌లో కొత్తిమీర తీసుకుంటే… ఇక ఆ వ్యాధులు మన బ్రెయిన్ దరిచేరవు. నాడీ వ్యవస్థ దెబ్బతినకుండా కొత్తిమీర కాపాడుతుంది.
• విటమిన్స్, మినరల్స్ విషయంలో కొత్తమీర వీటిని అధికంగా కలిగి ఉంది. ఎముకలు బలంగా ఉండటానికి కావలసిన విటమిన్ ‘K’ కొత్తిమీరలో పుష్కలంగా ఉన్నాయి. మరియు జింక్, కాపర్, పొటాషియం వంటి మినరల్స్’ని కలిగి ఉంది.
• సూక్ష్మక్రిములతో పోరాడే లక్షణాలు కొత్తిమీరకు ఉన్నాయి. తినే ఆహారం కల్తీ అయితే… మన ప్రాణాలకే ప్రమాదం. అలాంటి సమయంలో… కొత్తిమీర తీసుకోవడం ద్వారా చాలా వరకూ ప్రాణాలు కాపాడుతుంది. అందులోని డోడెసెనాల్ అనే పదార్థం… బ్యాక్టీరియాతో పోరాడుతుంది. ఫుడ్ పాయిజనింగ్‌కి కారణమయ్యే సాల్మొనెల్లా బ్యాక్టీరియాకి కొత్తిమీర తగిలిందంటే… ఇక అది గిలగిలా కొట్టుకొని చస్తుంది.
• కొత్తిమీర బ్లడ్ ఫ్యూరిఫైయర్ అంతే కాదు, బ్లడ్ బిల్డర్ కూడా. కొత్తిమీరలో పోషకాలతో పాటు, ఐరన్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల ఇది రక్త హీనతను తగ్గిస్తుంది.
☆ కొత్తిమీర/ధనియాల నూనె :
కొత్తిమీర ఆకులనుండి లేదా ధనియాలనుండి నూనెను స్టీము డిస్టిలేసన్ (ఆవిరి స్వేదన క్రియ) పద్ధతి ద్వారా సంగ్రహిస్తారు. రంగులేని లేదా లేత పసుపు రంగులో వుండు పారదర్శక ద్రవం. ఆకులనుండి నూనెను తాజా ఆరబెట్టిన ఆకులనుండి తీస్తారు.
• ఫంగస్ సోకిన కాలి వేళ్లకు ఆయింట్ మెంట్ లో 6% కొత్తిమీర నూనెను కలిపి ఉపయోగిస్తారు.
• పరిమళద్రవ్యాలలో, సబ్బులలో ఉపయోగిస్తారు.
• వీర్యవృద్ధికరమైనమందుగా ఉపయోగిస్తారు.
• బాక్టిరీయా/ సూక్ష్మజీవి/క్రిమి సంహారకంగా ఉపయోగించవచ్చును.
• వాయుహరమైన ఔషధముగా, జీర్ణకారిగా ఉపయోగిస్తారు.
• బాధానివారక ఔషరంగా ఉపయోగిస్తారు.
• ప్రేరకం/ ఉత్తేజకంగా పనిచేయును.
• శూలహరముగా పనిచేయును.
No comments:
Post a Comment