Tuesday, December 22, 2020

🌱 ఆయుర్వేదం - శతావరి


ఆయుర్వేదవైద్యంలో పేర్కొన్న పురాతనమైన మూలికలలో ‘శతావరి’ ఒకటి. శతావరి గురించిన ప్రస్తావనలు భారతదేశపు అత్యంత పురాతన వైద్య గ్రంధాలలో కనిపిస్తాయి. “చరక సంహిత” మరియు “అష్టాంగ హృదయ్యం” అనే వైద్యగంథాలు రెండింటిలోను శతావరిని "ఆడ టానిక్" (female tonic) గా పిలవడం జరిగింది. కాబట్టి శతావరి ఓ బలవర్ధకౌషధం అన్నమాట.   నిజానికి, శతావరి అనే మాటకున్న అర్థం మీలో కుతూహలాన్ని రేపవచ్చు. “శతావరి” అంటే “వంద భర్తలను కలిగి ఉన్నది" అని అర్థం. కనుకనే ఇది స్త్రీ పునరుత్పాదక వ్యవస్థ యొక్క మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో తిరుగులేని మూలికగా శతావరి ప్రసిద్ధి చెందింది. ఆయుర్వేదం ప్రకారం, శతావరిని "నూరు  వ్యాధుల్ని మాన్పునది" అని కూడా అంటారు.  అదనంగా, శతావరికి ఉన్న “ఒత్తిడి-వ్యతిరేకతా” (అడాప్తోజేనిక్) గుణం మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఒత్తిడి-సంబంధిత సమస్యలకు పరిణామకారి ఔషధీ. ఇది ముసలి వయస్సు-సంబంధిత వ్యాధులకు కూడా ఉపశమనకారిగా పని చేసే చాలా ప్రభావవంతమైన మూలిక. శతావరి మూలికకున్న ప్రాముఖ్యం అంతటిది కాబట్టే ఆయుర్వేదవైద్యం దీనిని "మూలికల రాణి" (queen of herbs)  గా పిలుస్తోంది. హిమాలయపర్వతాల్లో మరియు ఆ పర్వత పాదప్రాంతాల్లో పెరుగుతున్న అడవిమొక్కలలో కనిపించేదే “శతావరి” అనే మూలిక. 



☆ శతావరి గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలు: 

ఔషధీశాస్త్ర నామం (బొటానికల్ పేరు): అస్పరాగస్ రసిమోసస్

కుటుంబం: లిలియాసియా / ఆస్పరాగసేయే

సాధారణ పేరు: శతావరి, ఆస్పరాగస్ రూట్, ఇండియన్ ఆస్పరాగస్

సంస్కృతం పేరు: శతావరి, శట్ములి/శతములి

ఉపయోగించే భాగాలు: వేర్లు మరియు ఆకులు

స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక పంపిణీ: భారత ఉపఖండంలోని ఉష్ణమండల ప్రాంతాలు శతావరికి నిలయంగా ఉన్నాయి, కానీ ఇది భారతదేశ హిమాలయ ప్రాంతాలలో కూడా విస్తారంగా పెరుగుతుంది. శతావరి శ్రీలంక మరియు నేపాల్ ప్రాంతాల్లో కూడా కనిపిస్తుంది.

శక్తిశాస్త్రం: శరీరానికి శీతలీకరణాన్ని మరియు తేమను కల్గించే గుణం శతావరికి ఉంది. ఆయుర్వేదంలో శతావరి గురించి ప్రస్తావించి, వాత, పిత్త దోషాలను సమతుల్యం చేస్తుందని చెప్పారు.


శతావరి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు : - 



• మహిళలకు శతావరి ప్రయోజనాలు :

మహిళల ఆరోగ్య కోసం ఒక విజేతలాగా పని చేసే మందు అంటే అది శతావరి మాత్రమే. శతావరి సేవనం మహిళల్లో అధిక లైంగిక శక్తిని పెంచడమే కాక వారి గర్భాశయం సమగ్ర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆడవారి శరీరంలో హార్మోన్లను సమతుల్యం చేయడానికి మరియు మహిళల సంతానోత్పత్తిని శతావరి మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, శతావరి కారణంగా మహిళల్లో హార్మోన్ల సమతుల్య వ్యవస్థ ఏర్పడడం వల్ల వారికి పొత్తి కడుపులో వచ్చే నొప్పి లేక తిమ్మిరి కూడా తక్కువై నొప్పి లేని ఋతుచక్రం వారి సొంతమవుతుంది.

• పురుషులకు శతావరి ప్రయోజనాలు :

ఆడవారికి బాగా ఉపయోగపడే  సుప్రసిద్ధ మూలికలలో శతావరి ఒకటి. కానీ ఈ మూలిక  సామర్థ్యం కేవలం ఒక్క ఆడవారికి మాత్రమే పరిమితం కాదు. శతావరి నుండి తీసిన జల-మద్యపాన (hydro-alcoholic) మరియు నీటి సారం పురుషులక్కూడా ఒక కామోద్దీపనంగా చాలా సమర్థవంతంగా పని చేస్తుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఆయుర్వేదంలో చెప్పిన ప్రకారం, ఏ మూలికయినా లేదా మరేదైనా మందైనా సరే స్త్రీ పురుషుల లైంగిక పనితీరును మరియు లైంగికశక్తిని (లిబిడో) మెరుగుపర్చడానికి ఉపయోగించినట్లైనా దాన్ని కామోద్దీపకమైన మందు లేకా వీర్యవృద్ధికర మందు అని అంటారు. 

• బాలింత తల్లులకు శతావరి ప్రయోజనాలు :

ఆయుర్వేదలో, శతావరిని చనుబాలసంవర్ధిని (galactagogue)గా  పిలుస్తారు, అంటే స్తన్యపానమిచ్చే తల్లులలో (బాలింతల్లో) చనుబాల ఉత్పత్తిని శతావరి  పెంచుతుందని మరియు ఆయుర్వేద వైద్యులు బాలింతలైన ఆడవారిలో చను పాలు ఎక్కువగా వృద్ధి కావడానికి శతావరిని సేవించమని సూచించారు. బాలింత స్త్రీలకు ఈ మూలికను సేవించేందుకు ఇచ్చేటందుకు ముందుగా మీ ఆయుర్వేద డాక్టర్తో సంప్రదించడం మంచిది.

• ఒత్తిడిని తగ్గించేందుకు శతావరి :

ఒత్తిడిని తగ్గించే ప్రసిద్ధ మందులలో శతావరి కూడా ఒకటని ఆయుర్వేదం ఉటంకించింది. అంటే, శతావరిలో ఒత్తిడికి వ్యతిరేకంగా పని చేసే బలవర్ధక లక్షణాలున్నాయన్నమాట. శతావరిని సేవించడం మూలంగా మెదడుకు గల మార్గంపై ఇది ప్రభావవంతంగా పనిజేసి శరీరంలోని ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్లను తగ్గిస్తుందని తద్వారా ఒత్తిడి లేని ప్రశాంతమైన మనసు ఏర్పడుతుందని ఇటీవలి పరిశోధనలు సూచిస్తున్నాయి. 

• అనామ్లజనిగా శతావరి :

శరీరంలో స్వేచ్ఛా రాశులు కల్గించే హానికి వ్యతిరేకంగా పని చేసి మన శరీర ఆరోగ్యానికి దోహదపడే సహజ రక్షణ వ్యవస్థే అనామ్లజనకాలు. ఈ “స్వేచ్ఛా రాశులు” అంటే ఏమిటబ్బా అని మీరు ఆశ్చర్యపోతున్నారా, రోజువారీ పనుల ద్వారా శరీరంలో ఏర్పడే కణాలు లేదా అణువులే స్వేచ్ఛా రాశులు. కానీ, చివరికి, ఈ స్వేచ్ఛా రాశులే శరీరం యొక్క సొంత కణాలనే చంపడం ద్వారా శరీరానికి విషపూరితం అవుతుంటాయి. ఈ స్వేచ్ఛా రాశులు పెద్ద సంఖ్యలో శరీరంలో గుమిగూడుకుపోవడాన్నే “ఆక్సీకరణ ఒత్తిడి”గా పిలువబడుతుంది. ఈ ఆక్సీకరణే బలహీనమైన శరీర విధులకు  మరియు అకాల వృద్ధాప్యానికి ప్రధాన కారణం. మీ శరీరం నుండి అన్ని హానికరమైన స్వేచ్ఛా రాశులను తొలగించేందుకు సహాయపడే మూడు అతి శక్తివంతమైన అనామలీజనకాలు- రసమూఫరాన్, అస్పార్గామిన్, రేసిమోసోల్ లను శతావరి కలిగి ఉందని అధ్యయనాలు పేర్కొన్నాయి. కాబట్టి మీ ఆహారంలో శతావరిని ఓ భాగంగా తీసుకుంటే మీ శరీరంలో కలిగే జీవక్రియాహానిని అరికట్టి ఆరోగ్యవంతమైన జీవక్రియకు ఈ మూలిక సహాయపడుతుంది.

• కడుపులో పుండ్లకు శతావరి :

మన కడుపు చాలా సన్నని రక్షిత పొరను కలిగి ఉంటుంది. ఇది శరీరంలో ఉత్పత్తి చేయబడిన హానికరమైన జీర్ణ ఆమ్లాల ప్రభావాల నుండి మనల్ని రక్షిస్తుంది. ఈ ఆమ్లాలు మనం తీసుకునే ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడంలో మరియు కడుపులో బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గించటానికి సహాయపడి పొట్టను ఆరోగ్యాంగా ఉంచుతాయి. అయితే కొందరు అధికంగా తీసుకునే మసాలాలు దట్టించిన ఆహారపదార్థాలు లేదా వారి జీవనశైలి అలవాట్ల కారణంగా మన పొట్టలో ఈ ఆమ్లాలు అధికంగా ఉత్పత్తి అయ్యేందుకు దారి తీయవచ్చు. జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే అధిక ఆమ్లాల ప్రభావాల నుండి కడుపు తనను తానూ రక్షించుకోలేకపోయినప్పుడు ఆ ఆమ్లాలు కడుపు లోపలి భాగాలను కాల్చడానికి (బర్న్ చేయటానికి) మొదలు పెడతాయి. తద్వారా కడుపులో పుండ్లు (లేక కడుపులో పూత/పేగుపూత అని కూడా అంటారు దీన్ని) ఏర్పడటానికి దారితీస్తుంది. “పెప్టిక్ పుండు” (peptic ulcer) అనేది వైద్య పదం. అంటే ఈ పెప్టిక్ పుండ్లు కడుపులో అధిక ఆమ్లాల ఉత్పత్తి కారణంగా ఏర్పడతాయి. కడుపులో పుండ్లకు చికిత్సగా శతావరి చూర్ణం చక్కగా పని చేసినట్లు అధ్యయనకారులు కనుగొన్నారు. కానీ, మీరు కూడా ఈ మూలికను సేవించి దాని సంపూర్ణ ఫలితాల్ని పొందడానికి ముందుగా మీ ఆయుర్వేద డాక్టర్ను సంప్రదించడం మంచిది.



• సూక్ష్మజీవనాశినిగా శతావరి ప్రయోజనాలు :

శతావరి యొక్క సూక్ష్మజీవనాశక (antimicrobial) తత్వాలను పరీక్షించేందుకు పలు అధ్యయనాలు నిర్వహించారు. మన పొట్టలో జనించే హానికారక సూక్ష్మజీవులైన ఈ-కోలి, బాసిల్లస్ సబ్లిటిస్, స్టాఫిలోకాకస్, సాల్మోనెల్లా మరియు సూడోమోనాస్ మరియు క్యాండిడా వంటి ఫంగస్ బ్యాక్టీరియాల విరుద్ధంగా శతావరి సూక్ష్మక్రిమినాశినిగా ప్రభావవంతంగా పని చేసిందని అధ్యయనాలు చెప్పాయి.అందువల్ల, చాలా మటుకు సూక్ష్మక్రిమికారక వ్యాధులు మరియు శిలీంధ్ర వ్యాధులకు చికిత్స చేయడానికి శతావరి వేర్లను సురక్షితంగా ఉపయోగించవచ్చు. 

• కీళ్లవాపుల నొప్పినివారిణిగా శతావరి : 

స్వేచ్చా రాశులు కల్గించే హాని మరియు ఆక్సీకరణ ఒత్తిడి అనేవి కీళ్ళనొప్పులకు కారకమయ్యే ముఖ్య కారణాల్లో ఒకటి. శతావరి ఓ అనామ్లజనిగా శరీరంలో స్వేచ్ఛా రాశుల్ని పూర్తిగా తొలగించేందుకు సహాయపడుతుంది, తద్వారా, ఆక్సీకరణ ఒత్తిడి తగ్గి, ముఖ్యంగా యువకులలో, కీళ్ళనొప్పులు వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అదనంగా, అధ్యయనాలు చాటుతున్నదేమంటే శతావరి ఓ చక్కటి నొప్పి నిరోధకంగా పని చేయడం మూలంగా ఇది కీళ్ళలో వచ్చే వాపు మరియు కీళ్ళ నొప్పులకు విరుగుడుగా పని చేస్తుంది.

• అతిసారం చికిత్సకు శతావరి :

ఆయుర్వేద వైద్యులు అతిసారం చికిత్సలో శతావరిని వాడుతూనే ఉన్నారు, కానీ ఈ మూలిక యొక్క సామర్ధ్యాన్ని పరీక్షించడానికి శాస్త్రవేత్తలు పరీక్షలు చేశారు. అత్యంత సాధారణ ఆరోగ్య సమస్య అయిన అతిసార చికిత్సలో శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనపరీక్షల ఫలితాలు ఆయుర్వేద వాదనలు ఖచ్చితమైనవేనని గుర్తించబడ్డాయి. అయితే, మానవుడికొచ్చే అతిసారం మరియు విరేచనాలను చికిత్స చేయడంలో శతావరి మోతాదు మరియు చర్యలను పరీక్షించే నిమిత్తమై అధ్యయనాలు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి. 

• మూత్రవిసర్జనకారిగా శతావరి :

శరీరంలోంచి తరచుగా సాధ్యమైనంతగా నీటిని విడుదల చేసేందుకు దోహదపడే మూలిక లేదా మందును “మూత్రకారకం” (diuretic) గా పేర్కొనవచ్చు. సహజసిద్ధంగా నిర్విషీకరణ ఏజెంట్ గా మరియు మూత్రవర్ధకంగా పనిజేసే మందుకోసం చూస్తున్నట్లయితే శతావరి ఈ విషయంలో మీకెంతో తోడ్పడుతుంది.   శరీరంలో ఉండే అధిక నీటిని, ఇతర విషపదార్థాలను బయటికి విడుదల చేస్తుంది, తద్వారా శరీరం ఆరోగ్యాంగా తయారవుతుంది. అంతేకాకుండా, అదనపు లవణాలు మరియు నీటిని బయటకు పంపేయడం ద్వారా శతావరి మూత్రపిండాలను శుభ్రం చేస్తుంది. 

• జుట్టు మరియు నెత్తిచర్మారోగ్యానికి శతావరి :

శతావరి వేర్ల నుండి తీసిన ఎథనోలిక్ పదార్ధాలు సాధారణమైన చర్మసంబంధమైన శిలీంధ్రాలకు వ్యతిరేకంగా పని చేసే ఒక అద్భుతమైన “యాంటీబయాటిక్” మందు అని చెప్పవచ్చు. చుండ్రు మరియు “సెబోరెయిక్ డెర్మటైటిస్స్” (తామర మరియు సోరియాసిస్ వంటి చర్మం-డంబంధమైన దురదలన్నిటి చర్మసమస్య.) చర్మ వ్యాధి చికిత్సలో శతావరి చాలా ప్రభావకారిగా ఉంటుంది. ఆయుర్వేదలో సూచించిన మేరకు శతావరి నొప్పిని, వాపుల్ని హరించే మందుగా దీర్ఘకాలంగా పిలవబడుతోంది, అనగా మీరు చర్మం-సంబంధమైన దద్దుర్లు, విపరీతమైన దురదతో, దానికితోడు తలమీది చర్మం మీద వచ్చే సాంక్రామిక దద్దుర్లు మరియు చిన్న కురుపుల బాధ నుండి ఉపశమనం పొందటానికి శతావరి బాగా పని చేస్తుంది. 

• చెక్కెర వ్యాధికి శతావరి ప్రయోజనాలు :

శతావరి వేర్లు చక్కెరవ్యాధికి పనిచేసే ఒక అద్భుతమైన “యాంటీ-డయాబెటిక్ ఏజెంట్”. ఇది శరీరం యొక్క ఇన్సులిన్ పరిమాణాన్ని పెంచుతుంది. తద్వారా, శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలను క్రమంగా తగ్గిస్తూ రోగికి సహాయం చేస్తుందీ మూలిక. 

• రోగనిరోధకతను పెంచే శతావరి :

ప్రకృతిలో సహజంగా లభించే పదార్థాలతో చేసే సంపూర్ణ చికిత్స మీ శరీరంలో దాపురించే ద్వితీయ సంక్రమణాల్ని నయం చేయడమే గాక మీ రోగనిరోధక వ్యవస్థను మరింత బలపరచి, అటుపై ఏ ఇతర ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు సహాయపడుతుంది. ద్వితీయ అంటురోగాలైన  కాండిడా మరియు స్టెఫిలోకోకస్ లను నయం చేసే ఒక అద్భుతమైన ఏజెంట్ శతావరి, అని అధ్యయనాలు సూచిస్తున్నాయి. శతావరిని మందుగా సేవించడం వల్ల మన శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థను మరింత ప్రభావితం చేస్తుంది. తద్వారా శరీరంలో మరిన్ని ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయడానికి శతావరి తోడ్పడి సంక్రమణవ్యాధుల్ని మరింత సమర్థవంతంగా చంపుతుందని అధ్యయనకారులు సూచించారు.

• దోమకారక వ్యాధులను నివారించడంలో శతావరి శక్తి :

భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో వ్యాధులు ప్రబలి, తత్ఫలితంగా సంభవించే మరణాలకు గల సాధారణ కారణాలలో దోమల వలన కలిగే వ్యాధులు ఒకటి. శతావరి వేర్ల నుండి తీసిన మిథనాల్ సారం దోమల్ని, వాటి  లార్వా, గుడ్లను సైతం అద్భుతంగా చంపేస్తాయి. అంటే డెంగ్యూ, మలేరియా మరియు చికున్ గున్యా వంటి వ్యాధులను నివారించడానికి ఈ శతావరి వేర్ల నుండి తీసిన ఇథనాల్ సారాన్ని ఉపయోగించుకోవచ్చు. పైగా ఇది పర్యావరణహిత కీటకనాశిని. శతావరి మూలికను దోమలనివారణకు అనువైనదిగా అభివృద్ధి చేయబడుతోంది కనుక ఇది విస్తృతమైన పరిధిలో పనిచేస్తుంది, కనుక శతావరి వేర్ల సారం యొక్క చర్యకు వ్యతిరేకంగా మరో నిరోధకతను పొందడం కష్టం.


శతావరి మోతాదు : - 



రోజులో రెండు సార్లు శతావరి చూర్ణాన్ని ఓ టీస్పూన్ మోతాదులో టీ మాదిరిగా సేవించవచ్చు. ఈమేరకు ఆయుర్వేద వైద్యులు సూచించారు. సంతానోత్పత్తి సమస్యలున్నవారు గర్భం దాల్చడానికి కొన్ని నెలల ముందుగానే శతావరి సేవనాన్ని ఓ క్రమపద్ధతిలో మొదలుపెట్టడం మంచిది. ఇలా చేయడం వల్ల ఇది మీ సంతానోత్పత్తిశక్తిని పెంచడమీ గాక గర్భందాల్చడానికి మీ గర్భాశయం యొక్క పరిస్థితులను మెరుగుపరుస్తుంది. కనుక గర్భం దాల్చేందుకు కొన్ని నెలలు ముందే ఈ మూలికను సేవించడం గర్భధారణకు మరింత అనుకూలంగా ఉంటుంది. ఆడవాళ్లు 2 టీస్పూన్ల శతావరి చూర్ణాన్ని పాలతోబాటు తీసుకోవచ్చని ఆయుర్వేద వైద్యులు సూచించారు. ఇది స్త్రీలలో గర్భధారణకు అనుకూలించడమే గాక వారిలో లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని సూచించారు.


శతావరి దుష్ప్రభావాలు : - 

• గర్భధారణ సమయంలో శతావరిని సేవించడం సురక్షితం కాదు, కాబట్టి, గర్భిణీ స్త్రీలు శతావరిని సేవించేందుకు ముందుగా వైద్యుడిని తప్పకుండా సంప్రదించితీరాలి. 

• శతావరి కుటుంబానికి చెందిన మూలికలు ఎవరి శరీరానికి పడవో అలాంటివారికి శతావరి కూడా పడకుండా పోవచ్చు, అలెర్జీకారకంగా తయారవచ్చు. 

• ఒకవేళ మీరు ఇప్పటికే ఏవైనా డాక్టర్ సూచించిన ఔషధాలను తీసుకుంటున్న యెడల, శతావరిని కూడా ఆ మందులతో పాటు సేవించాలని మీరనుకుంటుంటే నిపుణుడైన వైద్యుడ్ని సంప్రదించడం చాలా మంచిది.



x

Sunday, December 6, 2020

☘ Ayurvedam - Hadjod


Hadjod is a fleshy plant that is widely used in cooking traditional soups, chutneys and dals in India. Additionally, its immense curative abilities are documented in great detail in Ayurveda. According to scholarly texts of this age-old practice of Indian medicine, hadjod portrays powerful traits in mending fractures of the bones, as well as being an excellent natural remedy for flatulence, indigestion, weight loss, epilepsy, decreased sexual desire and haemorrhoids.

Generally called Hadjod in Hindi, this perennial shrub belonging to the grape family has various other local names including “Pirantai” in Tamil, “Nalleru” in Telugu, “Cannalamparanta” in Malayalam and “Mangarahalli” in Kannada. Scientifically, it is termed Cissus quadrangularis, with other common English names such as adamant creeper, veldt grape and edible stemmed vine.

Hadjod belongs to the family Vitaceae and is native to the hot and arid regions of India, Sri Lanka, Bangladesh and Africa. The Hadjod tree grows up to a height of 1.5 m, with branches splitting into four parts or a quadrangular arrangement. The leaves are bright green, with sharp edges and three lobes. This plant bears white or jade flowers and red berries when ripened. All parts of Hadjod are edible, with the stem and leaves being used traditionally for cooking and therapeutic purposes.

Today, hadjod is globally recognised for its fantastic incentives for bone tissue development as well as overall wellbeing. It is, thus, largely manufactured and sold in the form of capsules, tablets and powders containing pure Cissus quadrangularis extracts.



* Nutritional Values Of Hadjod:

Hadjod is blessed with countless useful constituents but is especially renowned for its vast reserves of calcium and magnesium, apart from anabolic steroids, resveratrol and flavonoids. These work in synergy, to promote rapid healing of fractures and provide relief from pain in joint disorders, thus justifying its classical Sanskrit name “Asthisamharaka”, which literally translates to “bone setter” or “that which protects the bone from destruction”.

Furthermore, hadjod is infused with many other beneficial bioactive constituents namely tannins, triterpenoids, alkaloids, carotenoids, as well as essential vitamins and minerals like vitamin C, vitamin E, iron, zinc and sodium, all of which offer advantageous antioxidant and anti-inflammatory properties.


Effect On Doshas:

Hadjod displays an intrinsically Katu (Pungent) and  Madhura (Sweet) rasa (taste), which eventually becomes a Katu vipaka (pungent flavour after digestion or end taste). It equalizes and balances the Vata (air and ether) and Kapha (water and earth) doshas (energies or life forces), as well as effectively flushes out the AMA toxins (toxins that are present within the system and which often lead to incomplete digestion of food).

In addition, hadjod holds an inherent Ushna virya (Heating potency) and exhibits typical Laghu (Light), Ruksha (Dry) and Sara (Unstable) gunas (qualities or actions).


Health Benefits Of Hadjod :-



• Fortifies Bones And Joints :

Packed with calcium, magnesium and the antioxidant resveratrol, hadjod works to foster proper bone cell growth, regeneration and proliferation, thereby ensuring positive structural development of the body.

• Regulates The Digestive Process :

Hadjod has rewarding benefits for digestion, being a noteworthy antimicrobial agent. It is efficacious in maintaining ideal gut flora and combating intestinal bacteria such as E.coli, in essence promoting digestion.  

• Protects The Hepatic System :

Containing profuse amounts of vitamin C apart from the anti-inflammatory substances triterpenoids and beta-sitosterol, hadjod effectively shields the liver from fatty liver disorders and bile duct diseases.

• Acts As An Aphrodisiac :

Hadjod is useful in restoring optimal sexual function in men and women, due to its powerful antioxidant content and serves as a natural aphrodisiac, boosting vigour and stamina.

• Efficiently Detoxifies The Body :

Being plentiful in vitamin C and several classes of flavonoids, hadjod effectively flushes out excess food particles, fluids and other harmful remnants from the system, evading their accumulation in kidneys.  


Therapeutic Uses Of Hadjod:



• Heals Bone Conditions :

The juice of hadjod stem derivatives can be consumed internally as well as a paste or powder prepared from its leaves applied externally, on fractures, osteoporosis and arthritis. Hadjod speeds up bone mineralization and formation, simultaneously increasing bone mineral density and strength, and pacifying aches in the joints.

• Promotes Weight Loss :

Hadjod juice works wonders in improving lipid metabolism in the body, decreasing fat accumulation and accelerating calorie consumption and weight loss in those who are obese.

• Treats Dental Infections :

Plaque, tartar and cavities cause discomfort in the teeth and gums. Following brushing, rinsing with hadjod juice clears all infectious agents causing toothaches, due to its extensive antimicrobial characteristics.  

• Manages Epilepsy Symptoms :

The powerful extracts of hadjod possess intrinsic sedative properties. A regular, measured intake of hadjod, therefore, assists in regulating the central nervous system and brain activity and controlling epilepsy.

• Remedies Severe Haemorrhoids :

The liquid residue of hadjod leaves, when infused with honey and taken with some warm milk or ghee, helps to diminish excessive bleeding and swelling experienced during haemorrhoids.


Hadjod Dosage:



The dosage of hadjod or Cissus quadrangularis depends upon the formulation of whether it is being consumed in powder, juice or capsule form.

For children, a lower dosage is advised by professional Ayurvedic practitioners, owing to their lesser bodyweight. A daily dosage of 1.5 grams as powder, 5 ml as the juice or 1 tablet, after meals, along with milk or ghee is recommended.

In the case of adults, an everyday dose of 3 grams of the powder, 10 – 20 ml of the juice or 2 tablets, post taking in food, with warm milk, water or ghee is considered secure.


Hadjod Side Effects :

Hadjod is generally well-tolerated in most people. Only when taken in very high doses, it tends to result in heating up of the body, dryness in the mouth and a slight burning sensation in the stomach. It is hence recommended to always consume hadjod only within the safe pharmacological dosage.




🌿 आयुर्वेद - अस्थिसंहार


अस्थिसंहार नाम से ही यह स्पष्ट हो जाता है यह हड्डियों से संबंधित नाम हैं क्योंकि अस्थि का मतलब हड्डी होता है। अस्थिसंहार को हिन्दी में हड्डीजोड़ कहते हैं। अस्थिसंहार को आयुर्वेद में औषधि के रुप में सबसे ज्यादा प्रयोग हड्डियों को जोड़ने के लिए इस्तेमाल किया जाता है। इसके अलावा भी अस्थिसंहार पेट संबंधी समस्या, पाइल्स, ल्यूकोरिया, मोच, अल्सर आदि रोगों के उपचार में भी काम आता है। अस्थिसंहार का वानास्पतिक नाम Cissus quadrangularis Linn. (सीस्सुस क्वॉड्रंगुलारिस्) Syn-Vitis quadrangularis (Linn.) Wall. ex. Wight है। अस्थिजोड़ Vitaceae (वाइटेसी) कुल का है। अस्थिजोड़ को अंग्रेजी में Bone setter (बोन सेटर) कहते हैं।

आयुर्वेद में और स्थानीय लोगों में भी अस्थिजोड़ चूर्ण का प्रयोग टूटी हुई हड्डियों को जोड़ने के लिये करते हैं। इसकी लगभग 8 मी तक लम्बी आरोही पर्णपाती लता होती है। जो देखने में चतुष्कोणीय तथा अस्थि शृंखला जैसी प्रतीत होती है, पुराने तने पत्रविहीन होते हैं। इसका प्रयोग अस्थि संबंधी बीमारियों के चिकित्सा में किया जाता है।

अस्थिसंहार प्रकृति से मधुर, कड़वा, तीखा, गर्म, लघु, गुरु, रूखी, कफवातशामक,पाचक और  शक्तिवर्द्धक होता है।

अस्थिसंहार कृमि, अर्श या पाइल्स, नेत्ररोग, अपस्मार या मिरगी, घाव या अल्सर, आध्मान या पाचन तथा दर्दनाशक होता है। अस्थिसंहार के पौधे से प्राप्त ग्लूकोसाइड हृदयपेशी पर नकारात्मक (नेगेटिव)क्रोनोट्रापिक(Chronotropic) प्रभाव डालता है। यह परखनलीय परीक्षण में अस्थिजनन क्रियाशीलता (Osteogenic activities) दिखाता है।


अस्थिसंहार के फायदे : -



• तमक श्वास में हड़जोड़ का प्रयोग -

ब्रोंकियल अस्थमा में हड़जोड़ का औषधीय गुण लाभकारी साबित हो सकता है। 5-10 मिली हड़जोड़ रस को गुनगुना कर पिलाने से तमक श्वास में लाभ होता है।

• पेट संबंधी समस्या में फायदेमंद हड़जोड़ -

अक्सर मसालेदार खाना खाने या असमय खाना खाने से पेट में  समस्याएं होने लगती है। हड़जोड़ का औषधीय गुण घरेलू इलाज में बहुत काम आता है। 5-10 मिली हड़जोड़ पत्ते के रस में मधु मिलाकर पिलाने से पाचन क्रिया ठीक होती है तथा उदर संबंधित समस्याओं से आराम मिलता है।

• अर्श या पाइल्स से दिलाये राहत हड़जोड़ -

अगर ज्यादा मसालेदार, तीखा खाने के आदि है तो पाइल्स के बीमारी होने की संभावना बढ़ जाती है। उसमें  हड़जोड़ का घरेलू उपाय बहुत ही फायदेमंद साबित होता है।

• उपदंश (जेनिटल पार्ट्स में घाव) में हड़जोड़ के फायदे -

उपदंश मतलब जननांग यानि जेनिटल पार्ट्स में घाव जैसा हो जाता है, लेकिन इस घाव में दर्द नहीं होता है। एक भाग तालमखाना, 1/2 भाग अस्थिसंहार, 1/4 भाग दालचीनी तथा 2 भाग शर्करा के चूर्ण को 14 दिनों तक दूध के के साथ सुबह शाम सेवन करने से उपदंश में लाभ होता है। (इस अवधि में तेल, अम्ल या एसिडिक फूड तथा नमक रहित आहार लेना चाहिए।) इसके अलावा हड़जोड़ तने के रस का लेप करने तथा तने के रस का सेवन करने से उपदंश आदि रतिज रोगों में लाभ होता है।

• डिलीवरी के बाद के दर्द से दिलाये राहत हड़जोड़ -

हड़जोड़ के तना एवं पत्तों को पीसकर लेप करने से डिलीवरी के दर्द से आराम मिलता है।

• प्रदर या ल्यूकोरिया में  हड़जोड़ के फायदे -

महिलाओं को अक्सर योनि से सफेद पानी निकलने की समस्या होती है। सफेद पानी का स्राव अत्यधिक होने पर कमजोरी भी हो जाती है। इससे राहत पाने में हड़जोड़ का सेवन फायदेमंद होता है। 5-10 मिली हड़जोड़ काण्ड रस का सेवन करने से अनियमित आर्तवस्राव तथा श्वेतप्रदर या सफेद पानी में लाभ होता है।

•गठिया के दर्द से दिलाये राहत हड़जोड़-

अक्सर उम्र बढ़ने के साथ जोड़ों में दर्द होने की परेशानी शुरू हो जाती है लेकिन हड़जोड़ का सेवन करने से इससे आराम मिलता है। एक भाग छिलका रहित तना तथा आधा भाग उड़द की दाल को पीस कर, तिल तेल में छान कर, वटिका बनाकर सेवन करने से वातरोगों में लाभकारी होता है। 15 दिनों तक अस्थिसंहार का व्यंजन आदि के रूप में सेवन करने से अस्थिभंग या हड्डियों के टूटने में शीघ्र लाभ होता है तथा तीव्र वात के बीमारियों में लाभ मिलता है।

• हड्डियों को जोड़ने में फायदेमंद हड़जोड़ -

हड्डियों को जोड़ने में हड़जोड़ बहुत ही लाभकारी होता है लेकिन इसके इस्तेमाल करने का  तरीका सही होना चाहिए।

-भग्न अस्थि या संधि पर हड़जोड काण्ड कल्क का लेप करने से शीघ्र भग्न संधान होता है।

-10-15 मिली हड़जोड़ स्वरस को घी में मिलाकर पीने से तथा भग्न स्थान पर इसके कल्क में अलसी तैल मिलाकर बांधने से भग्न अस्थि का संधान होता है।

-2-5 ग्राम हड़जोड़ मूल चूर्ण को दुग्ध के साथ पिलाने से भी टूटी हुई हड्डी जुड़ जाती है।



• रीढ़ की हड्डी के दर्द से राहत दिलाने में फायदेमंद हड़जोड़ -

अगर रीढ़ की हड्डी के दर्द से परेशान हैं तो हड़जोड़ का औषधीय गुण बहुत फायदेमंद तरीके से काम करता है। हड़जोड़ के पत्तों को गर्म करके सिंकाई करने से दर्द कम होता है।

• मोच का दर्द करे कम हड़जोड़ -

अगर मोच आने पर दर्द कम नहीं हो रहा तो हड़जोड़ का घरेलू उपाय बहुत ही लाभकारी होता है। हड़जोड़ स्वरस में तिल तैल मिलाकर, पकाकर, छानकर लगाने से मोच तथा वेदना में लाभ होता है।

• व्रण या घाव में फायदेमंद हड़जोड़ -

कभी-कभी अल्सर का घाव सूखने में बहुत देर लगता है या फिर सूखने पर पास ही दूसरा घाव निकल आता है, ऐसे में हड़जोड़ का प्रयोग बहुत ही फायदेमंद होता है। जले हुए घाव अथवा कीट के काटने पर हुए घाव में हड़जोड जड़ के रस का लेप लाभप्रद होता है।

• ब्लीडिंग करे कम हड़जोड़ -

अगर कटने या छिलने पर ब्लीडिंग कम नहीं हो रहा है तो हड़जोड़ का प्रयोग लाभकारी होता है। हड़जोड़ स्वरस को लगाने से क्षतजन्य रक्तस्राव का स्तम्भन होता है। इसके अलावा 2-4 मिली तने और जड़ के रस को पीने से शीताद, दंत से रक्तस्राव, नासिका से रक्तस्राव तथा रक्तार्श या बवासीर में खून आना आदि में काम आता है।

• पूरे शरीर में दर्द से दिलाये आराम हड़जोड़ -

सोंठ, काली मिर्च तथा अस्थिसंहार प्ररोह पेस्ट (1-2 ग्राम) का सेवन करने से सर्वांग शूल या दर्द से राहत मिलती है।

• अस्थिसंहार का उपयोगी भाग -

आयुर्वेद में हड़जोड़ के तना, पत्र तथा जड़ का औषधि के रुप में ज्यादा इस्तेमाल किया जाता है।


बीमारी के लिए हड़जोड़ के सेवन और इस्तेमाल का तरीका पहले ही बताया गया है। अगर आप किसी ख़ास बीमारी के इलाज के लिए हड़जोड़ का उपयोग कर रहे हैं तो आयुर्वेदिक चिकित्सक की सलाह ज़रूर लें।चिकित्सक के परामर्शानुसार-

-2-4 मिली तने जड़ का रस

-1-2 ग्राम पेस्ट

-5-10 मिली पत्ते का रस


🌱 ఆయుర్వేదం - నల్లేరు


 

ఇంటిల్లిపాదికీ ఆరోగ్యాన్నిచ్చే మొక్క నల్లేరు. నాలుగు పలకలు కలిగిన కాండంతో సన్నగా పెరిగే తీగజాతి మొక్క నల్లేరు. గణుపు విరిచి మట్టిలో గుచ్చితే చాలు బతుకుతుంది.నల్లేరు శాస్త్రీయ నామం సిస్సస్ క్వాడ్రాంగ్యులా ఎల్. అంటారు. ఆంగ్లములో దీనిని ఎడిబుల్ స్టెమ్మేడ్ వైన్ అంటారు. సంస్కృతములో ఆస్థి సంహార, వజ్రవల్లి అంటారు.

నల్లేరు వాడకం వలన మన జీవితం నల్లేరుఫై నడక లాగ హాయిగా సాగిపోతుంది. నల్లేరు గురించి పల్లెటూళ్ళలో తెలిసినట్టుగా పట్టణ ప్రజలకు అవగాహన లేదు. ఉళ్లల్లొ ఎక్కడ పడితే అక్కడ పెరుగుతూ ఉంటుంది. తీగ జాతిలాగా ఉండి కణుపులు కణుపులుగా పెరుగుతూ ఉంటుంది. ఈ తీగ నాలుగు పలకలుగా, నలుచదరంగా ఉంటుంది.

సిద్ధ వైద్యములో నల్లేరు రసం చాలా వ్యాధులకు వాడతారు. విరిగిన ఎముకల అతుకుటకు నల్లేరు రసం అమోఘంగా పని చేస్తుంది . ఎముకలు విరిగినా చిట్లినా నల్లేరు రసం రోజూ పధ్ధతి ప్రకారం ఒక చెంచా, 8 వారాలు తీసుకుంటే ఖచ్చితముగా ఎముకలు అతుకుతాయని శాస్త్రీయముగా ఋజువు అయింది.

నల్లేరు లో యాంటిబాక్టీరియల్, యాంటిఫంగల్, యాంటిఆక్సిడెంట్లు పుష్కలముగా ఉన్నాయి. నల్లేరు రసం రక్తహీనత  లేకుండా కాపాడుతుంది . ఇందులో కేరోటినాయిడ్లు బాగా ఉన్నాయి. ఇంతే కాకుండా కాన్సర్ కణాల పెరుగుదల నిరోధించే ట్రై టెర్పనాయిడ్లు మరియు ఎస్కోర్బిక్ యాసిడ్లు నల్లెరులో అధికముగా కలవు.



నల్లేరు తీగ లోని లేత కణుపులు కోసి వాటి తొక్కు తీసి పచ్చడి చేస్తారు సొరకాయ, బీరకాయ మాదిరి. దోసలలోకి కూరలలొకి వాదతారు. తొక్కు తీసేటపుడు కొంచెం జాగ్రత్తగా చేతికి నూనే రాసుకుని తీయాలి. లేకుంటే చేతులు దురద పెడతాయి. నల్లేరు లోపలి గుజ్జు అప్పడాల పిండిలో కలిపి వత్తితే బాగా పొంగుతాయి.

దీన్ని పెరట్లో నేలలో, కుండీల్లోనూ సులభంగా పెంచుకోవచ్చు. విరిగిన ఎముకలను అతికించడంలో దీని పాత్ర అమోఘం. పసిపిల్లల ఎముకలు దృఢంగా పెరగడానికి దోహదపడుతుంది. మధ్య వయస్కులకు కీళ్ల నొప్పులు రాకుండా చూస్తుంది. కీళ్ల నొప్పులుంటే తగ్గిస్తుంది. దీని పెరుగుదల కూడా చాలా వేగంగా ఉంటుంది. నల్లేరు కణుపు కోసి కుండి లోని మట్టిలో పెడితే చాలు. బతుకుతుంది, మట్టిలో గుచ్చిన నెలలోనే పెరుగుదల మొదలవుతుంది.

అధిక బరువు తగ్గించుకోవడానికి వాడతారు. గ్రీన్ టీ, సోయా లలో ఉండే సెలీనియమ్, క్రోమియం, విటమిన్ బి లలో ఉండే గుణాలన్నీ నల్లేరు లో ఉన్నాయి. మహిళలలో 40 వయసు తర్వాత వచ్చే మెనోపాజ్ లక్షణాలలో చాలా ముఖ్యం , ఎక్కువగా ఇబ్బంది పడేది ఎముకల బలహీనత వలన. నల్లేరు లో అధికముగా ఉండే కాల్షియం వలన అటువంటి ఇబ్బందులు తగ్గుతాయి . ఆస్థియో పోరోసిస్ ,ఎముకలు గుల్ల బారడం చిన్న దెబ్బలకు ఎముకలు విరగడం వంటివి ఎముకల కాన్సర్ రాకుండా నల్లేరు ఎంతగానో ఉపయోగపడుతుంది.



నల్లేరు లోని పీచు పదార్ధం వలన ఫైల్స్ ప్రాబ్లం రాదు. ఆస్తమా, అరుగుదల సమస్యలకు నల్లేరు దివ్యౌషధం . అంతే కాకుండా యాన్టి బ్యాక్టీరియల్  గుణాలు కలిగిన నల్లేరులో గ్యాస్ట్రిక్ అల్సర్ నిరోధించే హెలికో బ్యాక్టీరియల్  ఫైలోరీ  ఉంది. సిద్ధ వైద్యంలో నల్లేరు విశిష్టత గురించి ఏంతో గొప్పగా ఉంది. నల్లేరు కాండాన్ని మెత్తగా నూరి గాయంపై వేసి కట్టుకట్టొచ్చు. 2 చుక్కల నల్లేరు కాడల రసం చెవిలో వేస్తే పోటు తగ్గుతుంది. నల్లేరు ఆకుల రసం 1,2 చెంచాలు తాగితే నీళ్ల విరేచనాలు తగ్గుతాయి. కంచెల్లో.. చాలా చోట్ల కనిపించే నల్లేరు ఔషధ గుణాలు తెలుసుకొని వాడుకుంటే బతుకు నల్లేరుపై నడకేనంటే అతిశయోక్తి కాదు.


☆ గమనిక : తాటిచెట్టుకు పాకుతున్న నల్లేరు వాడకూడదు. దానిలొని సుగుణాలన్ని  విషపురితమవుతాయి  అని ఆయుర్వేదంలో చెప్పబడింది.



Friday, December 4, 2020

🌱 ఆయుర్వేదం - కాకరకాయ



కాకర (Bitter gourd) ఇండియా అంతా పెంచబడుతున్న ఓ చేదు తీగ జాతి మొక్క. దీని శాస్త్రీయ నామం మొమోర్డికా కరన్షియా. ఇది కుకుర్బిటేసి  కుటుంబానికి చెందినది. ఆరోగ్యాన్ని ఇచ్చే కాకర చేదు అయినప్పటికీ మధుమేహానికి మందు గావాడుతున్నారు . కాయ, కాకర రసము, కాకర ఆకులు మందుగా ఉపయోగ పడతాయి. కాకర రసములో " హైపోగ్లసమిక్ " పదార్ధము ఇన్‌సులిన్‌ స్థాయిలో తేడారాకుండా నియంత్రణ చేస్తూ రక్తం లోని చెక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది . కాకర గింజలలలో రక్తములో గ్లూకోజ్ ను తగ్గించే " చారన్‌టిన్‌ " అనే ఇన్సులిన్‌ వంటి పదార్ధము ఉంటుంది . 

* తమిళము : పావక్కాయ్‌ 

* కన్నడము : హాగల్‌ కాయి 

* మళయాలం : కప్పాక్కా 

* ఓంఢ్రము : కరవిలా 

* హిందీ : కర్లీ, కరేలా 

* సంస్కృతము : కారవేల్ల. 


కాకర రకాలు : నల్ల కాకర, తెల్ల కాకర, బారామాసి, పొట్టికాకర, బోడ కాకర కాయ అని మరొక గుండ్రని కాయ కలదు, ఇది కూడా చేదుగానే ఉండును.



కాకరకాయలు కొంచెము చేదుగా ఉన్ననూ ఉడికించిననూ, పులుసును పెట్టిననూ, బెల్లమును పెట్టి కూరగా చేసినను మంచి రుచికరముగా ఉండును. కొద్దిగా చేదు భరించువారు దీనిని ముక్కలుగా చేసి తినుటనూ ఉంది. దీనిలో నీరు తక్కువ పౌష్టిక శక్తి ఎక్కువ.


 వైద్యమున ఉపయోగాలు :

• దీనిని తినిన కొద్దిమందికి వేడిచేయును, అటువంటి వారికి దీనిని మజ్జిగలో ఉడికించి ఇవ్వవలెను, తద్వారా చేదు కూడా తగ్గును.

• కాకరాకు రసమును కుక్క, నక్క మొదలగు వాటి కాటునకు విరుగుడుగా వాడుదురు.

• కొందరు ఈ ఆకు రసమును గాయాలపై రాస్తారు.

• మరికొందరు దీనిని చర్మ వ్యాదులకు, క్రిమి రోగములకూ వాడురుదు.

• ఔషధగుణాలున్న కాకరను తరచూ స్వీకరించడం వల్ల రక్త శుద్ధి జరుగుతుంది.

• హైపర్‌టెన్షన్‌ని అదుపులో ఉంచుతుంది ఫాస్ఫరస్‌.

• అధిక మొత్తంలో పీచు లభిస్తుంది.

• సోరియాసిస్‌ను నివారణలో కాకర కీలకపాత్ర పోషిస్తుంది.

• శరీరానికి అత్యావశ్యక పోషకాలైన ఫొలేట్‌, మెగ్నీషియం, పొటాషియం, జింక్‌ కూడా సమృద్ధిగా లభిస్తాయి.

• జీర్ణ శక్తిని వృద్ధిచేస్తుంది.

• చేదుగా ఉన్నందున పొట్టపురుగు నివారణకు ఉపయోగపడును.

• దీనిలో ఉన్న - మోమొకార్డిసిన్‌ యాంటి వైరస్ గా ఉపయోగపడును.

• ఇమ్యునో మోడ్యులేటర్ గా పనిచేయడం వల్ల - కాన్సర్, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు మంచిది.



కాకరలో సోడియం, కొలెస్ట్రాల్‌ శాతం తక్కువ. థయామిన్‌, రెబొఫ్లేవిన్‌, విటమిన్‌ బి6, పాంథోనిక్‌ యాసిడ్‌, ఇనుము, ఫాస్పరస్‌లు మాత్రం పుష్కలంగా లభిస్తాయి. అందుకే కాకరను తరచూ తినండి. కనీసం పదిహేనురోజులకోసారైనా టీ స్పూను కాకర రసం తాగండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. 

* కాకరకాయ  తినే ముందు తీసుకునే జాగ్రత్తలు : 

విసిన్‌ (vicine) అనే పాదార్ధము ఉన్నందున " favism " వచ్చే అవకాశము ఉన్నది, గింజలలో ఉన్న "red arilis " చిన్నపిల్లలో విషపదార్ధంగా చెడు చేయును, గర్భిణీ స్త్రీలు కాకరను ఏ రూపములో వాడకూడదు . పొట్టి కాకర కాయ :- Green fruit of Momordica muricata.చేదుగ నుండును, త్రిదోషములను హరించును; జ్వరము, దద్దురు, కుష్టు, విషము, కఫము, వాతము, క్రిమిరోగము వీనిని హరించును.

స్వభావం చేదైనా కమ్మని రుచులను అందించే కూరగాయ కాకరకాయ. కొంతమందికి కాకరకాయ వాసనంటేనే పడదు. కానీ కొందరు మాత్రం ఇష్టంగా తింటుంటారు. ఈ విషయం తెలిస్తే కాకరకాయ తినే అలవాటు లేకపోయినా కొత్తగా తినాలని చాలామంది అనుకుంటారేమో. 


☆ కాకరగాయ వల్ల అనేక లాభాలున్నాయి :



* వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. కాకరకాయను నీళ్లలో ఉడికించి ఆ నీటిని చల్లార్చుకుని తాగితే ఎన్నో ఇన్‌ఫెక్షన్స్ నుంచి బయటపడొచ్చు.

* శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం: కాకరగాయ తినడం వల్ల జలుబు, దగ్గు, అస్తమా వంటి శ్వాసకోశ సమస్యల నుంచి త్వరగా కోలుకోవచ్చు. ఈ లక్షణాలతో బాధపడేవారు కాకరగాయ రసం తాగితే మరింత మంచిది.

* రక్త శుద్ధి, కాలినగాయాల పరిష్కారం: రక్తాన్ని శుద్ధి చేయడంలో కాకరగాయ ఎంతో కీలకంగా పనిచేస్తుంది. అంతేకాదు, కాలినగాయాలు, పుండ్లను మాన్పడంలో కూడా కాకరగాయ చక్కగా పనిచేస్తుంది.

* అందమైన శరీరాకృతి కోరుకునే వారు, బరువు తగ్గాలనుకునేవారు చేదుగా ఉన్నా కాకరగాయ రసం తాగాల్సిందే. కాకరకాయలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కొవ్వు శాతాన్ని తగ్గించి, బరువు తగ్గడానికి ఎంతగానో సహకరిస్తాయి.

* కంటి సమస్యలను తగ్గిస్తుంది.

* ఉదర సమస్యలకు, అజీర్ణం, కడుపులో మంట వంటి సమస్యలకు కాకరకాయ రసానికి మించిన సంజీవని లేదు.

* గుండెపోటుకు ఒక కారణం కొలెస్ట్రాల్. శరీరంలో కొవ్వు శాతాన్ని అదుపులో ఉంచి, గుండె సంబంధిత వ్యాధులను నియంత్రించడంలో కాకరకాయ ప్రధాన భూమిక పోషిస్తుంది.


🌱 ఆయుర్వేదం - శతావరి

ఆయుర్వేదవైద్యం లో పేర్కొన్న పురాతనమైన మూలికలలో ‘ శతావరి ’ ఒకటి. శతావరి గురించిన ప్రస్తావనలు భారతదేశపు అత్యంత పురాతన వైద్య గ్రంధా...