కాకర (Bitter gourd) ఇండియా అంతా పెంచబడుతున్న ఓ చేదు తీగ జాతి మొక్క. దీని శాస్త్రీయ నామం మొమోర్డికా కరన్షియా. ఇది కుకుర్బిటేసి కుటుంబానికి చెందినది. ఆరోగ్యాన్ని ఇచ్చే కాకర చేదు అయినప్పటికీ మధుమేహానికి మందు గావాడుతున్నారు . కాయ, కాకర రసము, కాకర ఆకులు మందుగా ఉపయోగ పడతాయి. కాకర రసములో " హైపోగ్లసమిక్ " పదార్ధము ఇన్‌సులిన్ స్థాయిలో తేడారాకుండా నియంత్రణ చేస్తూ రక్తం లోని చెక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది . కాకర గింజలలలో రక్తములో గ్లూకోజ్ ను తగ్గించే " చారన్‌టిన్ " అనే ఇన్సులిన్ వంటి పదార్ధము ఉంటుంది .
* తమిళము : పావక్కాయ్
* కన్నడము : హాగల్ కాయి
* మళయాలం : కప్పాక్కా
* ఓంఢ్రము : కరవిలా
* హిందీ : కర్లీ, కరేలా
* సంస్కృతము : కారవేల్ల.
కాకర రకాలు : నల్ల కాకర, తెల్ల కాకర, బారామాసి, పొట్టికాకర, బోడ కాకర కాయ అని మరొక గుండ్రని కాయ కలదు, ఇది కూడా చేదుగానే ఉండును.
కాకరకాయలు కొంచెము చేదుగా ఉన్ననూ ఉడికించిననూ, పులుసును పెట్టిననూ, బెల్లమును పెట్టి కూరగా చేసినను మంచి రుచికరముగా ఉండును. కొద్దిగా చేదు భరించువారు దీనిని ముక్కలుగా చేసి తినుటనూ ఉంది. దీనిలో నీరు తక్కువ పౌష్టిక శక్తి ఎక్కువ.
☆ వైద్యమున ఉపయోగాలు :
• దీనిని తినిన కొద్దిమందికి వేడిచేయును, అటువంటి వారికి దీనిని మజ్జిగలో ఉడికించి ఇవ్వవలెను, తద్వారా చేదు కూడా తగ్గును.
• కాకరాకు రసమును కుక్క, నక్క మొదలగు వాటి కాటునకు విరుగుడుగా వాడుదురు.
• కొందరు ఈ ఆకు రసమును గాయాలపై రాస్తారు.
• మరికొందరు దీనిని చర్మ వ్యాదులకు, క్రిమి రోగములకూ వాడురుదు.
• ఔషధగుణాలున్న కాకరను తరచూ స్వీకరించడం వల్ల రక్త శుద్ధి జరుగుతుంది.
• హైపర్‌టెన్షన్‌ని అదుపులో ఉంచుతుంది ఫాస్ఫరస్.
• అధిక మొత్తంలో పీచు లభిస్తుంది.
• సోరియాసిస్‌ను నివారణలో కాకర కీలకపాత్ర పోషిస్తుంది.
• శరీరానికి అత్యావశ్యక పోషకాలైన ఫొలేట్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ కూడా సమృద్ధిగా లభిస్తాయి.
• జీర్ణ శక్తిని వృద్ధిచేస్తుంది.
• చేదుగా ఉన్నందున పొట్టపురుగు నివారణకు ఉపయోగపడును.
• దీనిలో ఉన్న - మోమొకార్డిసిన్ యాంటి వైరస్ గా ఉపయోగపడును.
• ఇమ్యునో మోడ్యులేటర్ గా పనిచేయడం వల్ల - కాన్సర్, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు మంచిది.
కాకరలో సోడియం, కొలెస్ట్రాల్ శాతం తక్కువ. థయామిన్, రెబొఫ్లేవిన్, విటమిన్ బి6, పాంథోనిక్ యాసిడ్, ఇనుము, ఫాస్పరస్‌లు మాత్రం పుష్కలంగా లభిస్తాయి. అందుకే కాకరను తరచూ తినండి. కనీసం పదిహేనురోజులకోసారైనా టీ స్పూను కాకర రసం తాగండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
* కాకరకాయ తినే ముందు తీసుకునే జాగ్రత్తలు :
విసిన్ (vicine) అనే పాదార్ధము ఉన్నందున " favism " వచ్చే అవకాశము ఉన్నది, గింజలలో ఉన్న "red arilis " చిన్నపిల్లలో విషపదార్ధంగా చెడు చేయును, గర్భిణీ స్త్రీలు కాకరను ఏ రూపములో వాడకూడదు . పొట్టి కాకర కాయ :- Green fruit of Momordica muricata.చేదుగ నుండును, త్రిదోషములను హరించును; జ్వరము, దద్దురు, కుష్టు, విషము, కఫము, వాతము, క్రిమిరోగము వీనిని హరించును.
స్వభావం చేదైనా కమ్మని రుచులను అందించే కూరగాయ కాకరకాయ. కొంతమందికి కాకరకాయ వాసనంటేనే పడదు. కానీ కొందరు మాత్రం ఇష్టంగా తింటుంటారు. ఈ విషయం తెలిస్తే కాకరకాయ తినే అలవాటు లేకపోయినా కొత్తగా తినాలని చాలామంది అనుకుంటారేమో.
☆ కాకరగాయ వల్ల అనేక లాభాలున్నాయి :
* వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. కాకరకాయను నీళ్లలో ఉడికించి ఆ నీటిని చల్లార్చుకుని తాగితే ఎన్నో ఇన్‌ఫెక్షన్స్ నుంచి బయటపడొచ్చు.
* శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం: కాకరగాయ తినడం వల్ల జలుబు, దగ్గు, అస్తమా వంటి శ్వాసకోశ సమస్యల నుంచి త్వరగా కోలుకోవచ్చు. ఈ లక్షణాలతో బాధపడేవారు కాకరగాయ రసం తాగితే మరింత మంచిది.
* రక్త శుద్ధి, కాలినగాయాల పరిష్కారం: రక్తాన్ని శుద్ధి చేయడంలో కాకరగాయ ఎంతో కీలకంగా పనిచేస్తుంది. అంతేకాదు, కాలినగాయాలు, పుండ్లను మాన్పడంలో కూడా కాకరగాయ చక్కగా పనిచేస్తుంది.
* అందమైన శరీరాకృతి కోరుకునే వారు, బరువు తగ్గాలనుకునేవారు చేదుగా ఉన్నా కాకరగాయ రసం తాగాల్సిందే. కాకరకాయలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కొవ్వు శాతాన్ని తగ్గించి, బరువు తగ్గడానికి ఎంతగానో సహకరిస్తాయి.
* కంటి సమస్యలను తగ్గిస్తుంది.
* ఉదర సమస్యలకు, అజీర్ణం, కడుపులో మంట వంటి సమస్యలకు కాకరకాయ రసానికి మించిన సంజీవని లేదు.
* గుండెపోటుకు ఒక కారణం కొలెస్ట్రాల్. శరీరంలో కొవ్వు శాతాన్ని అదుపులో ఉంచి, గుండె సంబంధిత వ్యాధులను నియంత్రించడంలో కాకరకాయ ప్రధాన భూమిక పోషిస్తుంది.
No comments:
Post a Comment