Tuesday, October 27, 2020

🌱 ఆయుర్వేదం - మర్రిచెట్టు



మర్రిచెట్టు మన జాతీయ వృక్షం . మర్రి ని ఆంగ్లంలో బానియన్ ట్రీ అంటారు. ఇది ఫైకస్ జాతికి చెందిన ఒక చెట్టు. ఇది బాగా పెద్దగా విస్త రించిన కొమ్మలతో వాటికి దీటైన  ఊడలతో పెరిగే అతిపెద్ద వృక్షం. అందుకే దీన్నీ వటవృక్షం అంటారు. మర్రిచెట్టు ‘మారేసి‘ కుటుంబానికి ‘రోజేలిస్‘ క్రమానికి చెందిన చెట్టు. దీనిని సంస్కృతంలో ‘వటవృక్షము‘ అంటారు. దీని యొక్క శాస్త్రీయ నామము ‘ఫైకస్ బెంగాలెన్సిస్‘. మర్రిచెట్టు విత్తనాలు చాలా చిన్నవి కానీ మహావృక్షాలుగా పెరుగుతాయి. మర్రికాయలు మృదువుగా పియర్ ఆకారంలో అసంఖ్యాక విత్తనాలతో నిండి ఎర్రగా చిన్నవిగా చెట్టునిండా ఉంటాయి. కాయలోని గుజ్జు తియ్యగా ఉండి ఇష్టంగా తింటారు. వీటి వేర్లు భూమి పైకే కన్పిస్తుంటాయి. వీటి కొమ్మలు ఊడలుగా మార్పుచెంది కిందికి దిగి నేలలోకి చొచ్చుకుపోతాయి. చెట్లు చాలా పెద్దగా ఉండటం వలన గాలులకూ, వర్షాలకూ పడిపోకుండా ఈ ఊడలు ఊతమిస్తాయి. ఈ చెట్లను ‘ఎపిఫైట్లు‘ అంటారు. ఈ చెట్ల విస్తరణ చాలా చిత్రంగా పక్షుల ద్వారా జరుగుతుంది.లక్షులనోటికి కమ్మగా ఉండటమో ఏమో దీని పండ్లను భుజించి వేరే దూర ప్రాంతల్లో గింజలను విసర్జించడం ద్వారా ఈ చెట్ల సంతతి విస్తరిస్తుం టుంది. వీటి విత్తనాలు బీటలు వారిన గోడల్లో, వంతెనల్లో కూడా మొలకెత్తుతాయి. ఎలాంటి అననుకూల పరిస్థితుల్లోనైనా పెరుగుతాయి. రహదారి పక్కనున్న చెట్లు దారినపోయే బాలసారులకు నీడను ఇస్తాయి.


సర్వ లోకాలకూ గురువైన  జ్ఞాన స్వరూపుడైన గురు దక్షిణామూర్తి నివాసం మర్రి వృక్ష ఛాయలో నేట!. భగవంతునికి ఆది మధ్య అంతం లేవుకదా!  అలాగే , మైళ్ళకొద్దీ వ్యాపించిన మర్రిచెట్టుకు కూడా మొదలు, చివర  మధ్య ఎక్కడో కనుక్కోలేము దీని కొమ్మలు, ఊడలు క్రిందికిదిగి పెద్దకొమ్మలుగా, మొదళ్ళుగా మారి పోయి మహావృక్షంగాఉండటాన దీని ఆదిమధ్యాలు తెలుసుకోడం కష్టం. మహా విష్ణువు బాలకృష్ణుడు  వటపత్ర సాయి గా  మర్రి ఆకు మీద పవళించినట్లు మనకు తెల్సు. త్రిమూర్తులు మర్రిచెట్టు మీద ఉంటారని హిందువుల నమ్మకం. మహా విష్ణువు స్వరూపం అయిన మర్రి చెట్టు ఆకులతో అన్నం తింటే, క్రిమిరోగ నివారిణిగా పనిచేస్తుంది. 



మర్రివృక్ష భాగాలు సంపూ ర్ణంగా ,పచ్చి గా, ఎండినవి లేక ,పండ్లు గాని అపారమైన ఔషధ లుకలిగి ఉన్నాయి. భారతదేశంలో "బనియాలు అంటే'వణికులు' లేదా 'వ్యాపారులు' తమ ప్రయాణాలలో బండ్లమీదా, గుఱ్ఱా లమీదా , కొందరుకాలినడకనా వ్యాపారాలమీద ఇతరప్రాంతాలకు వెళుతూ తరచూ ఈ చెట్ల నీడలో విశ్రాంతి తీసుకొనేవారని విదేశీ పరిశీలకులు గమనించినందువల్ల, వారు ఈ చెట్టును దీనికి "బనియన్ ట్రీ" అనే వారు ,కాలక్రమంలో ఈపేరు బానియన్ ట్రీగా మారింది. కంటికి సంబంధించిన దోషాలను తొలగి స్తుంది.మర్రిచెట్టునీడ ఏసీని తలపిస్తుంది. ఎంతమందికైనా నీడనిచ్చి హాయినందించే మర్రి చెట్టు , కొమ్మలు ఎన్నో పక్షులకు గూళ్ళుకట్టుకుని నివసించే అవకాశాని అందించి అమ్మలా ఆదుకుంటుంది. 


మర్రిచెట్టు  క్రింద చిక్కని నీడ ఉంటుందికనుక ఏచెట్టూ మొలవదు. అందుకే ‘మర్రి చెట్టుక్రింద మొక్క మొల వదు’అనే సామెత వచ్చింది,దీన్ని బలవంతులున్నచోట చిన్నవారికి అవకాశం రాదనే అర్ధంలోవాడు తారు.  మర్రిని చెట్టు వివిధభాగాలను ఆయుర్వేదం లో మందుగా వాడుతారు. దీని బెరడు, లేత ఆకులు, మొగ్గలు, పాలు, పళ్ళు అన్నిటినీ ఆయుర్వేదంలో ఎన్నో వ్యాధుల్లో మందుగా వడి నయం చేసినట్లు దాఖలాలు న్నాయి  ముఖ్యంగా చర్మ సౌందర్యం కోసం మర్రి ఉపకరిస్తుంది.  



మర్రిచెట్టు కింద కూర్చుని సేద తీరితే ఎంతో మంచిదని మన పెద్దవారు చెబుతుంటారు. చెట్టు కింద కూర్చుంటేనే అంత మంచిదైతే మర్రిచెట్టు ఆకులను తింటే ఇంకా ఎన్నో లాభాలున్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అవేంటో తెలుసుకుందామా...


 మర్రి చెట్టు ఉపయోగాలు : - 



• జీర్ణ వ్యవస్థ కోసం: జీర్ణశయాంతర వ్యవస్థ మీద మర్రి చెట్టు అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇది విరేచనాల నుండి ఉపశమనం కలిగించడానికి సహాయపడే యాంటీమైక్రోబయల్ మరియు చికిత్సా లక్షణాలను (హీలింగ్ ప్రాపర్టీస్) కలిగి ఉంటుంది మరియు  మర్రి ఆకులలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ మలబద్దకాన్ని తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.

• కీళ్ళనొప్పుల లక్షణాలను తగ్గిస్తుంది: మర్రి ఆకులు యాంటీఇన్ఫలమేటరీ  మరియు అనాల్జేసిక్ లక్షణాలను చూపిస్తాయి, ఇది ఆర్థరైటిస్ లక్షణాల నుండి ఉపశమనం కలిగించడంలో ఉపయోగకరంగా ఉంటుంది.

• రోగనిరోధక శక్తిని పెంచుతుంది: మర్రి చెట్టు బెరడు సారాలను పారంపర్యంగా దాని రోగనిరోధక శక్తి పెంచే లక్షణాల కోసం ఉపయోగిస్తున్నారు. ఈ సారంలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వలన ఇది జరుగుతుందని పరిశోధన అధ్యయనాలు సూచిస్తున్నాయి. వారు ఆక్సీకరణ నష్టం న్యూట్రలైజ్ చేసి తద్వారా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.

• యోని సంక్రమణను నయం చేస్తుంది: వజైనల్ వాష్ (యోనిని శుభ్రపరచేందుకు తయారు చేసే సారం) తయారు చేయడానికి మర్రి ఆకుల పొడిని నీటితో కలుపుతారు. ఇది యాంటీమైక్రోబయాల్ లక్షణాలను కలిగి ఉంటుంది తద్వారా అది వ్యాధికారక సూక్ష్మజీవుల పెరుగుదలను అణిచివేస్తుంది మరియు ల్యూకోరియా వంటి సాధారణ యోని ఇన్ఫెక్షన్ లక్షణాల నుండి ఉపశమనం కలిగిస్తాయి.

• చర్మ సంరక్షణ కోసం: మర్రి ఆకుల నుండి తయారుచేసిన సారాలు చర్మాన్ని మృదువుగా చేసే ప్రభావాలాను చూపుతాయి. కలబంద గుజ్జుతో  కలిపి దీనిని సమయోచితంగా ఉపయోగించినప్పుడు ఇది చర్మ అలెర్జీలను నిరోధిస్తుంది. పాలతో కలిపినప్పుడు, ఈ సారం మోటిమలు మరియు దద్దుర్లు నుండి ఉపశమనం కలిగిస్తుంది.

• మెదడు కోసం ప్రయోజనకరమైనది: మర్రి చెట్టు పండు ఒత్తిడిని తగ్గించడం మరియు ఆందోళన మరియు కుంగుబాటును నివారించడంలో సహాయం చేస్తుంది. మర్రి చెట్టు యొక్క సారాలు జ్ఞాపకశక్తిని పెంపొందించే మరియు పానిక్ ఎటాక్ సమయంలో మూర్ఛ యొక్క ప్రమాదాన్ని తగ్గించగల బయోలాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటాయి.


మర్రి చెట్టు యొక్క ఇతర ప్రయోజనాలు : - 



ఆరోగ్య విషయంలో అనేక ఉపయోగాలను కలిగి ఉండడమే కాక, ఇతర విషయాలలో కూడా మర్రి చెట్టు ప్రయోజనకరంగా ఉంటుందని కనుగొనబడింది. మర్రి చెట్టు యొక్క వేర్వేరు భాగాల వలన కలిగే ఇతర ప్రయోజనాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.


• మర్రి చెట్టు ఆకు సారాలకి లార్విసిడల్ లక్షణాలు (లార్వాలను చంపగల) ఉంటాయి తద్వారా ఇవి దోమలకు వ్యతిరేకంగా పోరాడగలవు మరియు మలేరియా మరియు ఎన్సెఫాలిటిస్ వంటి దోమల వలన సంభవించే వ్యాధులను నిర్ములించగలవు.

• మర్రి చెట్టు యొక్క ఊడల సారాలు అనేక బయోయాక్టీవ్ సమ్మేళనాలు కలిగి ఉంటాయి ఇవి బాక్టీరియా మరియు ఫంగస్ కు వ్యతిరేకంగా పోరాడడంలో చాలా సమర్థవంతంగా పని చేస్తాయి.అందువలన వీటిని వ్యాధుల వ్యాప్తిని నియంత్రిచడానికి ఉపయోగించవచ్చు.

• మర్రి చెట్టు వాయు కాలుష్యం కలిగించే కారకాలకు వ్యతిరేకంగా పని చేసి వాయు కాలుష్యం అధికముగా ఉండే ప్రాంతాలలో గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది.


మర్రి చెట్టు యొక్క దుష్ప్రభావాలు : - 




మర్రి చెట్టు ఆకు సారాలు ఉపయోగించి తయారుచేసిన మందులు మరియు మిశ్రమాలు ఇప్పటి వరకు ఎటువంటి దుష్ప్రభావాలు కలిగించినట్లు కనుగొనబడలేదు. ఈ చెట్టు యొక్క సారాలను కలిగి ఉన్న ఔషధ ఉత్పత్తులను ఉపయోగించినప్పుడు దుష్ప్రభావాలు కలిగినట్లు ఎటువంటి నివేదికలు లేవు.

అయినప్పటికీ, గర్భిణీలు మరియు చనుబాలిచ్చే మహిళలపై మర్రి చెట్టు సారాల ప్రభావం గురించి అధ్యయనాలు పెద్దగా నిర్వహించబడలేదు. కాబట్టి, ముందు జాగ్రత్త చర్యగా, చనుబాలిచ్చే మహిళలు లేదా గర్భిణీ స్త్రీలు ఏవైనా దుష్ప్రభావాల యొక్క అవకాశాలను నివారించడానికి మర్రి చెట్టు సారం యొక్క ఉపయోగాన్ని నివారించాలని సూచించబడింది.



No comments:

Post a Comment

🌱 ఆయుర్వేదం - శతావరి

ఆయుర్వేదవైద్యం లో పేర్కొన్న పురాతనమైన మూలికలలో ‘ శతావరి ’ ఒకటి. శతావరి గురించిన ప్రస్తావనలు భారతదేశపు అత్యంత పురాతన వైద్య గ్రంధా...