గురివింద గింజను విషపదార్థంగా భావిస్తారు ప్రతివారు. అయితే ఈ గింజను శుద్ధిచేసి ఉపయోగిస్తే ఔషధంగా కూడా వాడవచ్చు. ఈ గింజలు ఎరుపు, తెలుగు రంగుల్లో లభిస్తాయి. తెలుగు రంగు గింజలు మాత్రమే ఔషధంగా ఉపయోగపడుతాయి. ఈ గింజలనే కాక లేత ఆకులను, వేళ్ళను కూడా వైద్యానికి ఉపయోగిస్తారు. ఆయుర్వేద వైద్యంలో తెల్లగురివింద గింజలు వాడబడుతున్నాయి.
• గురువింద గింజ ఆకులను కొంత సేపు నోట్లో వేసుకొని నమిలిన తరువాత ఒకచిన్న రాయిని నోట్లో వేసుకొని నమిలితే ఆ రాయి నలిగి పిండి అవుతుందట. దీని అకులు విష పూరితం కాదు. అలాగే గింజలను కనురెప్పల కింద దాచి పెట్టడం, పల్లెల్లోని పిల్లలకు ఇదొక ఆట. ఆయుర్వేదంలో ఈ గింజల్లోని పప్పును కొన్ని రకాల మానసిక రుగ్మతలకు వాడుతారు.
• గురివింద విత్తనాలను కంసాలి బంగారాన్ని తూకం కోసం వినియోగిస్తారు. (గత కాలంలో బంగారాన్ని ఇన్ని గురుగింజల ఎత్తు అని అనే వారు)
☆ లక్షణాలు :
• ఇది తీగల ద్వారా ఎగబ్రాకే పొద.
• దీర్ఘవృత్తాకారంలో ఉన్న సన్నని పత్రకాలు గల ( చింతాకుల వలె) సమపిచ్ఛాకార సంయుక్త పత్రాలు.
• గ్రీవస్థ అనిశ్చిత విన్యాసంలో అమరి ఉన్న కెంపు రంగు పుష్పాలు.
• నల్లని మచ్చతో చిక్కని ఎరుపురంగు విత్తనాలు కలిగి ఉన్న ద్విదారక ఫలాలు.
☆ ఆయుర్వేద వైద్యంలో వీటి ఉపయోగాలు :
• లేత గురివింద ఆకులను నమిలితే గొంతు శ్రావ్యంగా ఉంటుంది. ఎక్కువ సేపు ప్రసంగించే వక్తలు, మిమిక్రీ కళాకారులు, సంగీత విద్వాంసులు, హరికథలు, బుర్రకథలు వినిపించేవారు ఈ ఆకులను నమిలితే మంచి ప్రయోజనం కలుగుతుంది.
• తెల్లబట్టతో బాధపడే స్ర్తిలు పరిశుద్ధం చేయబడిన గురివింద గింజలను మెత్తగా పొడికొట్టి, ఆ పొడిలో తేనెను కలిపి పుచ్చుకుంటే నివారణ కలుగుతుంది.
• ఈ గింజలు లేదా ఆకుల కషాయాన్ని తాగితే సుఖప్రసవమవుతుంది.
• గురివిందగింజలను కాలిస్తే వచ్చే పొగ దోమలను నిర్మూలిస్తుంది.
• చెవిపోటువస్తే గురివిందగింజ ఆకును నూరి ఆ పసరుపోస్తే తగ్గిపోతుంది.
• పేనుకొరుకుడుతో బాధపడుతున్నారా .. గురివిందగింజతోవైద్యం -- గురివింద గింజని బాగా అరగదీసి గంధం తీసి పేనుకొరికిన చోట రాయండి. ఇలా నాలుగైదురోజులు రాస్తే వెంట్రుకలు మళ్ళీ తిరిగి వస్తాయి.
☆ ఆయుర్వేద డాక్టరు సలహా ప్రకారంగానే ఈ గింజల ఔషధాన్ని వాడాలి. పరిశుద్ధం చేయని గురివింద గింజలను ఔషధంగా వాడినట్లయితే దాని విషతత్వంవల్ల ఎన్నో అనారోగ్యాలు ఏర్పడే ప్రమాదముంది.
No comments:
Post a Comment