మామిడి (ఆంగ్లం: Mango) కి నాలుగు వేల సంవత్సరముల చరిత్ర ఉంది. ఇది భారతదేశపు జాతీయ ఫలం. ఇవి మాంగిఫెరా (Mangifera) ప్రజాతికి చెందిన వృక్షాలు. దీనిని హిందీలో ఆమ్, తమిళంలో మాంబలం, మలయాళంలో అమ్రామ్, తెలుగులో అమ్రాము, మరాఠీలో అంబా, కన్నడలో మావినహన్నూ అని పిలుస్తారు. వీటినుండి మామిడి తాండ్ర తయారు చేసి అమ్ముతారు. ఇందులో కెరోటిన్, విటమిన్ సి, కాల్షియం ఎక్కువ. ఈ ఆకు పచ్చ రంగులో ఉంటుంది. ఆకారం కిరీటం ఆకారంలో ఉంటుంది. పరిమాణం పెద్దది. ఈ చెట్టు మహావృక్షంగా పెరుగుతుంది. భారతదేశంలో వంద రకాలకుపైగా మామిడిపళ్ళు దొరుకుతాయి. మామిడిని భారతదేశంలో వేర్వేరు పేర్లతో పిలుస్తారు.
భారతీయ సాంప్రదాయంలో మామిడి ఆకుల తోరణం ఉత్తమమైన తోరణంగా విశ్వసిస్తారు. ప్రతి పండుగ లేక శుభకార్యం కాని మామిడి తోరణం తోటే ప్రారంభం అవుతుంది. పూజా కార్యక్రమంలో మామిడి ఆకులు చోటు చేసుకుంటాయి. ఉగాది రోజున ఉగాది పచ్చడికి విశేష ప్రాధాన్యత ఉంది. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు కలసిన షడ్రుచుల సమ్మేళనంతో దీన్ని తయారు చేస్తారు.సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఈ పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు రసం, అరటి పళ్లు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలైనవి వాడుతారు. మామిడి ఆకులను "చూత పత్రి" అని కూడా అంటారు. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు ఒకటి. దుస్తులు, దుప్పట్లు, తివాచీలు మొదలైన బట్టలమీద, నగలు, ముగ్గులు మొదలైన వాటిలోను మామిడి కాయ ఆకారం చోటు చేసుకుంది.
ఫలాల్లోనే రారాజుగా నిలిచిన మామిడిలో పోషక విలువలూ కూడా ఎక్కువే. న్యూట్రీషినల్ విలువలున్న మామిడి పండ్లతో ఎన్ని రకాల వంటలు చేయొచ్చో. మామిడికాయలు ఎక్కువగా వచ్చే సీజన్‌లో మామిడి ఒరుగులు చేసుకుని, తినాలనిపించినప్పుడు పప్పులో వేసుకుని వండుకోవచ్చు. ఇక పచ్చళ్లలోనైతే, మామిడి ముక్కల పచ్చడి, మాగాయ, ఆవకాయ, తొక్క పచ్చడి, అల్లం వెల్లుల్లి, కొబ్బరి వేసి కూడా పచ్చళ్లు పెడతారు. మరి కొంతమంది మామిడికాయ నిల్వ పచ్చడిలో బెల్లం కూడా వేస్తారు. ఒక్కొక్కళ్లది ఒక్కో రుచి! చద్దన్నంలో ఆవకాయ బద్ద, పెరుగన్నంలో మామిడి పండు ముక్కలు వేసుకుని తింటుంటే ఆ మజానే వేరు. ఇక వేడి వేడి అన్నంలో ముద్దపప్పు, నెయ్యి, ఆవకాయ కలిపి తింటే... ఆ రుచి వర్ణించడానికి మాటలు చాలవు. మామిడిపండుతో హల్వా, ఐస్‌క్రీములు కూడా తయారు చేస్తారు. ఇక షర్బత్‌లు, జ్యూస్‌ల సంగతైతే సరేసరి. రెడీమేడ్‌గా ఫ్రూటీలు, మాజాలు ఉండనే ఉన్నాయి. పచ్చి మామిడి కాయని ముక్కలుగా కోసుకుని ఉప్పు -కారంతో తింటారు.
మన ఇండియాలో మామిడిలో ఎన్ని రకాలున్నా బంగినపల్లి రుచికి ప్రత్యేక స్థానం ఎప్పుడూ ఉంటుంది. ఇంకా వీటిలో నీలం, రసాలు, చందూరా, రుమానియా, రాజమాను, పంచదార కలశ, కోలంగోవా, అల్పోన్సో, బదామీ, దుస్సేరీ, సువర్ణ, రేశ, ఇమాం పసంద్, చిలకముక్కు మామిడి, బెంగళూరు మామిడి, మల్గోవ... ఇలా ఎన్ని రకాలో. తన రుచితో రాజులను, చక్రవర్తులను సైతం ఆకట్టుకున్న ఘనత మామిడి పండ్లది.
తాజా మామిడి పండులో పదిహేను శాతం (15%) చక్కెర, ఒక శాతం (1%) మాంసకృత్తులు, గుర్తించ తగిన మోతాదులో ఎ, బి, సి (A, B, C) విటమిన్లు ఉంటాయి. మామిడిపండు ఎక్కువగా తియ్యగా ఉన్నా, కొన్నిజాతుల పండు కొంచెం పుల్లగా ఉంటుంది, కొన్ని పండ్లు పీచు ఎక్కువ రసంతో ఉంటాయి. వీటిని రసాలు అంటారు. కొన్ని కరకరలాడే కండతో ఉంటాయి వీటిని మల్ గోవా మామిడి అంటారు. బంగినపల్లి రకం మామిడి కాయలు ఎక్కువ తీయగా మెత్తటి కండ కలిగి ఉంటాయి. నీటిశాతం ఎక్కువ కనుక రసభరితంగా ఉంటాయి.
ఉత్తర భారతంలో పుల్లని మామిడి ముక్కలను పొడిచేసి ప్యాక్ చేసి అమ్ముతారు. దీనిని వారు విరివిగా వంటలలో వాడుతుంటారు. దీనిని వారు ఆమ్ చూర్ (మామిడి పొడి) అంటారు. ఆంధ్రులు కూడా కొన్ని ప్రదేశాలలో ఇళ్ళలో ఎండపెట్టిన మామిడి ముక్కలను (వీటిని మామిడి ఒరుగు అంటారు) సంవత్సరం అంతా వాడే అలవాటు ఉంది. పచ్చి మామిడి కాయను వివిధ రూపాలలో వంటలలో వాడుతుంటారు. సున్నపు శక్తి (కాల్షియమ్) విటమిన్ బి పుష్కలంగా ఉంది. భారతదేశంలో మామిడి తాండ్రను చేసి చిన్నచిన్న బండ్ల మీద అమ్ముతూ ఉంటారు. ఇలాంటిదే పెద్దఎత్తున కొన్ని వ్యాపారసంస్థలు దేశం అంతటా విక్రయిస్తున్నాయి. మామిడికాయలతో చేసే ఊరగాయలు ఆంధ్రులద్వారా ప్రపంచం అంతటా లభిస్తున్నాయి. ఐస్ క్రీంలో మామిడి గుజ్జును, ఫ్రూట్ సలాడ్ లో మామిడి ముక్కలను వేస్తారు.
మామిడి బెరడు, ఆకులు, పువ్వులు, విత్తనం, ముడి మరియు పండిన పండ్లలో అనేక ఔషధ ఉపయోగాలు ఉన్నాయి.
☆ ఔషధోపయోగాలు :
• పాదాల పగుళ్ళు: మామిడి జిగురుకు మూడురెట్లు నీళ్ళు కలిపి పేస్టులాగా చేసి ప్రతిరోజూ పాదాలకు లేపనం చేసుకోవాలి. దీనితోపాటు ప్రతిరోజూ బూట్లు, సాక్సులు ధరించటం ముఖ్యం. పంటినొప్పి, చిగుళ్ళ వాపు: రెండు కప్పులు నీళ్ళు తీసుకొని మరిగించాలి. దీనికి రెండు పెద్ద చెంచాలు మామిడి పూతను వేసి మరికొంత సేపు మరగ నివ్వాలి. స్టవ్‌మీద నుంచీ దింపి గోరువెచ్చగా ఉన్నప్పుడు పుక్కిట పట్టాలి. అవసరమను కుంటే ఇలా రోజుకు రెండు మూడుసార్లు చేయవచ్చు.
• కడుపులో పురుగులు: మామిడి టెంకలోని జీడిని వేరుపరచి ఆరబెట్టాలి. దీనికి పెద్ద చెంచాడు మెంతులను కలిపి మెత్తగా నూరాలి. దీనిని ఒక సీసాలో భద్రపరచుకొని కొన్నిరోజులపాటు మజ్జిగతో కలిపి తీసుకోవాలి.
• ఆర్శమొలలు (రక్తయుక్తం) : అర చెంచాడు మామిడి జీడిని పొడి రూపంలో పెరుగు మీది తేటతో కలిపి తీసుకోవాలి.
• జ్వరం: మామిడి వేర్లను మెత్తగా రుబ్బి అరికాళ్ళకు, అరి చేతులకు రాసుకుంటే జ్వరంలో కనిపించే వేడి తగ్గుతుంది.
• బట్టతల: ఒక జాడీలో కొబ్బరి నూనెను గాని, నువ్వుల నూనెను తీసుకొని మామిడి కాయలను ఊరేయండి. ఇలా సంవత్సరంపాటు మాగేసి తల నూనెగా వాడుకోవాలి.
• చెవి నొప్పి: స్వచ్ఛమైన మామిడి ఆకులనుంచి రసం తీసి కొద్దిగా వేడిచేసి, నొప్పిగా ఉన్న చెవిలో డ్రాప్స్‌గా వేసుకోవాలి. ముక్కునుంచి రక్తస్రావం: మామిడి జీడినుంచి రసం తీసి రెండు ముక్కు రంధ్రాల్లోనూ డ్రాప్స్‌గా వేసుకోవాలి.
• కంటినొప్పి: పచ్చి మామిడి కాయను కచ్చాపచ్చాగా దంచి నిప్పులపైన సుఖోష్టంగా ఉండేలా వేడిచేసి మూసి వుంచిన కన్నుపైన ‘పట్టు’ వేసుకోవాలి.
• దంత సంబంధ సమస్యలు: మామిడి ఆకులను ఎండించి బూడిద అయ్యేంతవరకూ మండించండి. దీనికి ఉప్పుకలిపి టూత్ పౌడర్‌లా వాడుకోవాలి. ఈ పొడికి ఆవ నూనెను కలిపి వాడుకుంటే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి.
• కాలిన గాయాలు: మామిడి ఆకుల బూడిదను ‘డస్టింగ్ పౌడర్’లా వాడితే గాయాలు త్వరగా నయమవుతాయి.
• ఎగ్జిమా: మామిడి చెట్టు బెరడును, నల్ల తుమ్మ బెరడును తెచ్చి కచ్చాపచ్చాగా దంచి ఉంచుకోండి. రోజూ పిడికెడంత మిశ్రమాన్ని తీసుకొని అర లీటరు నీళ్ళలో వేసి ఆవిరి వచ్చేవరకూ మరిగించి, ఆవిరిని ఎగ్జిమా సోకిన ప్రదేశానికి తగిలేలా చేయాలి. తడి ఆరిన తర్వాత నెయ్యి రాసుకొని మర్ధనా చేసుకోవాలి.
• పుండ్లు: మామిడి బెరడును చిన్న చిన్న పీలికలు అయ్యేంతవరకూ దంచి, నీళ్ళలో వేసి మరిగించండి. ఈ డికాక్షన్‌తో పుండ్లను, వ్రణాలను కడిగితే త్వరగా మానతాయి.
• నీరసం: మామిడి ముక్కలకు చెంచాడు తేనెను, పిసరంత కుంకుమ పువ్వును, ఏలకులు, రోజ్‌వాటర్లను చిలకరించి ఆస్వాదించండి.
• వడదెబ్బ: పచ్చి మామిడికాయను నిప్పుల మీద వేడిచేసి పిండితే సులభంగా గుజ్జు వస్తుంది. దీనికి కొద్దిగా చన్నీళ్ళను, పంచదారను చేర్చి తాగాలి. దీనివల్ల దప్పిక తీరడమే కాకుండా ఎండల తీక్షణతవల్ల కోల్పోయిన శక్తి తిరిగి వస్తుంది.
• చెమట కాయలు: రెండు పచ్చి మామిడి కాయలను గిన్నెలో నీళ్ళుపోసి ఉడికించాలి. చల్లారిన తర్వాత గుజ్జును పిండి పంచదార, ఉప్పు కలిపి సేవించండి. దీనివల్ల శరీరంలో వేడి తగ్గి, ఒళ్లు పేలకుండా ఉంటుంది.
• మధుమేహం: లేత మామిడి ఆకులను, వేప చిగుళ్ళను సమానభాగాలు తీసుకొని మెత్తగా నూరి ముద్దగా చేయాలి. దీనిని నమిలి మింగేయాలి. ఇలా కొంతకాలం చేస్తే మధుమేహంలో హితకరంగా ఉంటుంది. ఇదే విధమైన యోగం మరోటి ఉంది. మామిడి పూతను, మామిడి పిందెలను, ఎండిన నేరేడు గింజలను తీసుకొని మెత్తగా చూర్ణం చేసి భద్రపరచుకోవాలి. దీనిని ప్రతిరోజు చిన్న చెంచాడు మోతాదుగా తీసుకోవాలి. ఇది మధుమేహ రోగులకు ఉపయోగకారి.
• స్టీృన్ (ప్లీహం) పెరుగుదల, కాలేయపు సమస్యలు: గుప్పెడు మామిడి గుజ్జుకు చిన్న చెంచాడు తేనెను కలుపుకొని మూడుపూటలా తాగండి. కాలేయపు సమస్యల్లో మామిడి గుజ్జును పాలతో కలిపి తీసుకోవాలి.
• విరేచనాలు: మామిడి టెంకను పగులకొట్టి దీనిలోని జీడిని వేరుపరిచి నీడలో ఆరబెట్టాలి. తర్వాత దీని బరువుకు సమానంగా సోపు (శతపుష్ప) గింజలను తీసుకోవాలి. ఈ రెండింటిని విడివిడిగా చూర్ణం చేసుకోవాలి. తర్వాత రెండు చూర్ణాలను బాగా కలిపి పలుచని గుడ్డతో జల్లించాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చెంచాడు చొప్పున వేడి నీళ్ళతో తీసుకోవాలి. దీనితోపాటు మామిడి బెరడు లోపలి పొరను పేస్టులాగా చేసి బొడ్డు చుట్టూ రాస్తే ఇంకా మంచిది. మామిడి జీడే కాకుండా మామిడి పూత కూడా విరేచనాలను ఆపడానికి ఉపయోగపడుతుంది. ఎండిన మామిడి పూతను తేనెతో కలిపి తీసుకుంటే సరిపోతుంది. ఇంతే కాకుండా మామిడి పూతను, దానిమ్మ పువ్వులను కలిపి ఎండించి, పొడిచేసి మజ్జిగతో కలిపి కూడా తీసుకోవచ్చు.
• “పచ్చి మామిడి” వేసవితాపం భరించలేక వడదెబ్బకు గురయ్యేవారు పచ్చి మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఒక గ్లాసు నీటిలో వేసి.. దాంట్లోనే కాస్త చక్కెర వేసి బాగా కలపాలి. కాసేపటి తరువాత ఈ ద్రవాన్ని తాగినట్లయితే వడదెబ్బ బారినుంచి బయటపడే అవకాశం ఉంది. అలాగే పచ్చి మామిడి ముక్కలపై కాస్త ఉప్పు వేసి తినటంవల్ల అధిక దాహాన్ని అరికట్టడమేగాకుండా.. చెమట ద్వారా శరీరంలోని లవణాలు, రక్తంలోని ఐరన్ తదితరాలు బయటకు పోకుండా ఆపుతుంది.
• వేసవిలో సంభవించే డయేరియా, రక్త విరేచనాలు, పైల్స్, వికారం, అజీర్తి, మలబద్ధకం లాంటి సమస్యలకు టెంక పూర్తిగా ఏర్పడని పచ్చి మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటికి ఉప్పు, తేనెను కలిపి తింటే అద్భుతమైన ఔషధంలాగా పనిచేస్తుంది. ఇంకా.. పచ్చి మామిడికి మిరియాలు, తేనె కలిపి తిన్నట్లయితే.. జాండీస్ (పచ్చ కామెర్లు) వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చు. అంతేగాకుండా మామిడి గుండెకు మంచి టానిక్‌లాగా పనిచేస్తుంది. పచ్చి మామిడికాయలో విటమిన్ సీ పుష్కళంగా లభిస్తుంది. గుండె కండరాలను బిగుతుగా చేసే శక్తి మామిడికి ఉంది. అలాగే చర్మాన్ని మిలమిలా మెరిసేలా చేసే శక్తి కూడా దీనికి అధికంగా ఉంది.
☆ అయితే అతి అనేది అన్ని వేళలా సరికాదు కాబట్టి.. ఎక్కువ మోతాదులో పచ్చిమామిడిని తినకూడదు. అలా తిన్నట్లయితే ఆర్ధరైటిస్, కీళ్లవాతం, సైనసైటిస్, గొంతునొప్పి, అసిడిటీ లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మామిడిని పరిమితంగా తినటం మంచి పద్ధతి.
☆ ఆయుర్వేదంలో :
ఆయుర్వేదం యొక్క గ్రంథాలు మామిడి చెట్టు యొక్క వివిధ భాగాలను ఉపయోగించి వివిధ మూలికా సన్నాహాలను పేర్కొన్నాయి. ఈ సన్నాహాలు వివిధ రకాల ఆరోగ్య పరిస్థితులను సాధారణీకరించడానికి ఉపయోగిస్తారు. ఆయుర్వేదం "మామిడి పండు కామోద్దీపన, మామిడి విత్తన నూనె జుట్టు మరియు చర్మానికి మంచిది, ఆకులు మరియు బెరడు ఐబిఎస్, విరేచనాలు మరియు విరేచనాలలో ఉపయోగపడతాయి."
1. మంగళకరమైన మామిడి దీని మరో నామము. లేత మామిడి ఆకును పెరుగులో నూరి దానిని సేవిస్తే అతిసారం తగ్గుతుంది. మామిడి జిగురులో ఉప్పు చేర్చి వేడి చేసి ఔషధంగా పూస్తే కాళ్ళ పగుళ్ళు, చర్మవ్యాధులు నశిస్తాయి.
2. నిద్రలేమి : నిద్రలేమితో బాధపడే వారు రాత్రి పడుకునే ముందు ఓ మామిడి పండును తినండి. హాయిగా నిద్ర పడుతుందని వైద్యులు అంటున్నారు.
3. శరీరం కాలినప్పుడు : మామిడి ఆకులను కాల్చి, బూడిద చేసి ఈ భస్మాన్ని కాలిన గాయాలపై చిలకరించండి. దీంతో కాలిన గాయం మానుతుంది.
4. దంతాలు గట్టిగా ఉండాలంటే : మామిడి తాజా ఆకులను బాగా నమలండి. నమిలినప్పుడు నోట్లో లాలాజలం ఊరుతుంది. దీనిని ఉమ్మేయండి. ఇలా నిత్యం చేస్తుంటే దంతాలు కదులుతుంటే దృఢంగా తయారవుతాయి. అలాగే చిగుళ్ళనుంచి రక్తం కారుతుంటేకూడా తగ్గుదల కనపడుతుందంటున్నారు వైద్యులు.
అంపిలేపి (కొండ మామిడి) చెట్టు దాదాపు 27 మీటర్ల ఎత్తు పెరుగుతుంది.ఈ చెట్టు బెరడు, కాయలను ఆయుర్వేద ఔషధాలలోను వివిధ మెడిసిన్ల తయారిలోను విరివిగా వినియోగిస్తున్నారు.
☆ మామిడి గింజ:
మామిడి గింజలకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. జుట్టుకు నూనె, మామిడి వెన్న మరియు మామిడి విత్తన పొడి తయారీలో దీనిని ఉపయోగిస్తారు.
• మామిడి విత్తన నూనె :
చుండ్రు మరియు జుట్టు రాలడాన్ని నివారించడానికి మామిడి విత్తన నూనెను జుట్టు మీద ఉపయోగిస్తారు. ఈ నూనె చర్మం యొక్క గ్లో మరియు ఆరోగ్యాన్ని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది.
• మామిడి వెన్న :
మామిడి విత్తనాల కెర్నల్ నుండి సేకరించిన మామిడి వెన్నను కాస్మెటిక్ పరిశ్రమలో శరీర వెన్నలు మరియు తేమ లోషన్లను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.
• మామిడి విత్తన పొడి :
మామిడి విత్తన పొడి హెయిర్ ప్యాక్‌తో పాటు ఇతర మూలికలతో మెంతి విత్తన పొడి, మందార పొడి మొదలైనవి జుట్టు ప్రకాశం, పెరుగుదల మరియు చర్మం ఆరోగ్యాన్ని పెంచుతాయి.
• మామిడి కెర్నల్ పౌడర్ సెమీ సాలిడ్ అయ్యే వరకు నీటిలో ఉడకబెట్టాలి. ఈ వండిన పేస్ట్ పెరుగుతో పాటు రోజూ మూడు సార్లు విరేచనాలు ఇస్తారు.
1. సాధారణంగా మామిడి యొక్క లేత ఆకులు నల్ల మిరియాలు గింజలతో చూర్ణం చేయబడతాయి. ఈ మిశ్రమాన్ని కడుపు నొప్పి విరేచనాలు మరియు వాంతులు నిర్వహిస్తారు.
2. తాజా జమున్ ఆకులు మరియు లేత మామిడి ఆకులను చిటికెడు పసుపు , ఒక చిన్న ముక్క బెల్లం , కొద్దిగా పెరుగు మరియు చిన్న పరిమాణంలో నీటితో చూర్ణం చేస్తారు . సోరియాసిస్ మరియు తామరచే సృష్టించబడిన మచ్చలు మరియు గుర్తులపై ఇలా పొందిన చక్కటి పేస్ట్ వర్తించవచ్చు . ఇది సహజ చర్మం రంగును తిరిగి పొందడానికి సహాయపడుతుంది.
3. మామిడి పసుపు పండిన ఆకులు తయారుచేసిన మామిడి టీ శక్తినిస్తుంది మరియు పునరుజ్జీవింప చేస్తుంది.
• చర్మ వ్యాధులకు మామిడి పువ్వులు :
మామిడి పూల టీ అనేక చర్మ వ్యాధులను నయం చేయడానికి సహాయపడుతుంది మరియు ఇది అద్భుతమైన శరీర శీతలకరణి. సిస్టిటిస్ మరియు యుటిఐలకు ఆయుర్వేద చికిత్సలో ఈ టీ చాలా ఉపయోగపడుతుంది.
• మామిడి.. క్యాన్సర్ నివారిణి :
మామిడి రొమ్ము, పెద్దపేగు క్యాన్సర్ కణాల పెరుగుదలను అరికడుతుందని మామిడి పండ్ల నుంచి తీసిన పాలీఫెనోల్‌లో క్యాన్సర్ కణాల పెరుగుదలను అరికట్టే గుణం ఉన్నట్టు నిపుణులు కనుగొన్నారు. ఐదు రకాల మామిడి పండ్ల నుంచి తీసిన పాలీఫెనోల్‌ను.. రొమ్ము, పెద్దపేగు, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, రక్త క్యాన్సర్ల బాధితులకు ఇచ్చి పరీక్షించారు. క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకోవటమే కాదు, ఇది రెండు క్యాన్సర్ కణాలను చనిపోయే స్థితికీ తెచ్చినట్టు గుర్తించారు.
☆ మామిడి దుష్ప్రభావాలు : –
• కొందరు వ్యక్తులు మామిడిపండ్లను తింటే అలెర్జీలకు గురయ్యే అవకాశం ఉంది.
• మామిడిపండ్లను దండిగా తింటే గనుక కడుపులో ప్రతికూల ప్రభావాన్ని కలిగించ వచ్చు మరియు అది అతిసారానికి దారి తీయవచ్చు .
• మామిడి జిగట (latex) లేక రసం కూడా కొంతమందికి అలెర్జీని కల్గిస్తుంది. వాంతులు మరియు శ్వాసకోశ ఇబ్బందులు వంటివి మామిడి రసం అలెర్జీ వలన అనుభవించగల కొన్ని దుష్ప్రభావాలు.
• చాలా దండిగా మామిడిపండ్లను తినడంవల్ల బరువు పెరగవచ్చు.
• మామిడి పండ్లు తినడంవల్ల ఇప్పటికే చక్కెరవ్యాధితో (మధుమేహంతో) బాధపడుతున్న వ్యక్తుల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.
• నేటి రోజుల్లో, మామిడికాయల్ని కృత్రిమంగా పండ్లుగా మార్చే పద్ధతిని పాటిస్తున్నారు. ఇటువంటి కృత్రిమ మాగుడు పధ్ధతిలో మాగిన మామిడిపండ్లను తినడంవల్ల క్యాన్సర్, నాడీ సంబంధిత రుగ్మతలు, కడుపులో నోప్పి ఉదర రుగ్మతలు వివిధ ఇతర వ్యాధులకు దారితీస్తుంది.
No comments:
Post a Comment